- Telugu News Photo Gallery Cricket photos 3 team India young stars missed in 15 member squad for ODI World Cup 2023 says reports
World Cup 2023: వన్డే ప్రపంచకప్ జట్టు నుంచి ముగ్గురు ఔట్..! కేఎల్ రాహుల్‌కు లక్కీ ఛాన్స్.. భారత జట్టు ఇదే?
ICC World Cup 2023: ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక నివేదిక ప్రకారం, అజిత్ అగార్కర్ నేతృత్వంలోని కమిటీ భారతదేశంలో అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే ODI ప్రపంచ కప్ కోసం జట్టును ఎంపిక చేసింది. అయితే, ఈ జట్టులో ముగ్గురు యువ ఆటగాళ్లకు చోటు దక్కలేదు. నేడు భారత జట్టును ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
Updated on: Sep 03, 2023 | 2:48 PM

వన్డే ప్రపంచకప్ 2023 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును నేడు ప్రకటించనున్నారు. ఈమేరకు బీసీసీఐ సీనియర్ జాతీయ సెలక్షన్ కమిటీ శనివారం పల్లెకెలెలో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన ఆసియా కప్ మ్యాచ్ తర్వాత ఖరారు చేసినట్లు సమాచారం.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేసిన జట్టులో ఆసియా కప్ జట్టులోకి వచ్చిన నలుగురు ఆటగాళ్లకు ప్రపంచ కప్ జట్టులోనూ ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే.

ఆసియా కప్ కోసం బ్యాకప్ ప్లేయర్‌గా శ్రీలంక వెళ్లిన సంజూ శాంసన్‌కు వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదు. వీరితో పాటు కొత్తగా వచ్చిన తిలక్ వర్మ, పేసర్ ప్రసీద్ధ్ కృష్ణలకు కూడా ప్రపంచకప్ జట్టు నుంచి గేట్ పాస్ లభించినట్లు సమాచారం.

అయితే ఆసియా కప్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన కేఎల్ రాహుల్ 15 మంది సభ్యుల ప్రపంచకప్ జట్టులో ఎంపికైనట్లు సమాచారం. అయితే 17 మంది సభ్యులతో కూడిన ఆసియా కప్ జట్టులో కృష్ణ, తిలక్‌లకు చోటు దక్కలేదు.

2023 వన్డే ప్రపంచ కప్‌లో, రోహిత్ శర్మ నేతృత్వంలోని టీం ఇండియా అక్టోబర్ 8 న చెన్నైలో ఆస్ట్రేలియాతో తలపడటం ద్వారా ప్రపంచ కప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఆ తర్వాత అక్టోబర్ 14న భారత్-పాకిస్థాన్ మధ్య హైవోల్టేజీ యుద్ధం జరగనుంది.

అలాగే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్న ఆటగాళ్లను పరిశీలిస్తే, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్‌లు జట్టులోని ఇతర స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌లు కాగా, రాహుల్, ఇషాన్ కిషన్ ఇద్దరు వికెట్ కీపర్లుగా ఉన్నారు.

హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లు ఆల్‌రౌండర్లుగా ఎంపికవ్వగా, కుల్దీప్ యాదవ్ ఒక్కడే స్పిన్నర్‌గా ఎంపికయ్యాడు. 50 ఓవర్ల మెగా ఈవెంట్‌కు నలుగురు పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్ ఎంపికయ్యారు.

నివేదికల ప్రకారం, ఆసియా కప్‌ను చూసేందుకు శ్రీలంకకు వచ్చిన సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ అక్కడ కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్‌లను కలుసుకుని జట్టును ఎంపిక చేశారు. దీంతో పాటు రాహుల్ ఫిట్‌నెస్‌పై చర్చ జరగగా, వైద్య బృందం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అతడిని జట్టులోకి ఎంపిక చేసినట్లు సమాచారం.

ఆగస్టు 21న న్యూఢిల్లీలో భారత ఆసియా కప్ జట్టును ప్రకటించిన సందర్భంగా, సెలక్షన్ కమిటీ తన 18 మంది సభ్యుల ఆసియా కప్ జట్టు నుంచి ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేస్తుందని అగార్కర్ సూచించాడు. అనుకున్నట్టుగానే ఇప్పుడు ఆ జట్టు నుంచి వరల్డ్ కప్ జట్టు ఎంపికైంది.

వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీ.




