- Telugu News Photo Gallery Cricket photos Zimbabwe Legendary Cricketer Heath Streak becomes unrecognizable in the last days due to cancer
Heath Streak: క్యాన్సర్‌తో బక్కచిక్కిపోయి.. ఆఖరి రోజుల్లో గుర్తుపట్టలేకుండా మారిపోయిన హీత్ స్ట్రీక్
జింబాబ్వే క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, లెజెండరీ ఆల్ రౌండర్ హీత్ స్ట్రీక్ కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఆయన ఆదివారం తుదిశ్వా స విడిచారు. ఈ దుర్వార్తను అతని సతీమణి నడైన్ స్ట్రీక్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
Updated on: Sep 03, 2023 | 3:19 PM

జింబాబ్వే క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, లెజెండరీ ఆల్ రౌండర్ హీత్ స్ట్రీక్ కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఆయన ఆదివారం తుదిశ్వా స విడిచారు. ఈ దుర్వార్తను అతని సతీమణి నడైన్ స్ట్రీక్ సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించారు.

ఈ సందర్భంగా హీత్ స్ట్రీక్ తో ఆఖరి రోజుల్లో గడిపిన క్షణాలను ఫేస్‌బుక్‌లో షేర్ చేసుకున్నారు నడైన్ స్ట్రీక్. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియా లో వైరలవుతున్నాయి. వీటిని చూసి క్రికెట్ ఫ్యాన్స్ నివ్వెరపోతున్నారు.

క్రికెట్ ఆడే రోజుల్లో భారీ దేహ ధారుడ్యంతో కనిపించిన హీత్ స్ట్రీక్.. ఆఖరి రోజుల్లో మాత్రం తీవ్రంగా బక్కచిక్కిపోయారు. చాలామంది ఈ ఫొటోలను మొదటిసారి చూసినప్పుడు గుర్తుపట్టలేదు.

హీత్ స్ట్రీక్ ఫొటోలను చూసి క్రికెటర్లు, అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ నివాళి అర్పిస్తున్నారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

ఆటగాడిగానే కాకుండా కెప్టెన్‌గానూ జింబాబ్వే జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించారు హీత్ స్ట్రీక్. 65 టెస్టుల్లో 216 వికెట్లు, 11 అర్ధ సెంచరీలు, 189 వన్డేల్లో 239 వికెట్లు, 13 అర్ధసెంచరీలు చేశారు. ఐపీఎల్‌లోనూ కేఆర్‌కే టీంకు సేవలందించారు.




