Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రయాన్-3 సక్సెస్‌.. జాబిల్లిపై నిద్రపోయిన రోవర్‌.. ఆ సమయంలో పుట్టిన పిల్లల పేర్లు ఏంటంటే..

ప్రస్తుతం చంద్రుడిపై చీకటిపడింది. ఆదివారం అంటే..సెప్టెంబర్3 నుంచి చంద్రుడిపై 14 రోజులు చీకటిగా ఉంటుంది. సూర్యుడు కనిపించాడు. ఈ నేపథ్యంలో రోవర్ ను ఇస్రో శాస్త్రవేత్తలు స్లీప్ మోడ్ లోకి పంపించారు. సురక్షితమైన ప్లేస్‌లో రోవర్‌ని పార్క్ చేసిన ఇస్రో దానిని స్లీప్ మోడ్ లోకి పంపించినట్లుగా ప్రకటించింది. తిరిగి 14 రోజుల తర్వాత అంటే.. సెప్టెంబర్ 22న

చంద్రయాన్-3 సక్సెస్‌.. జాబిల్లిపై నిద్రపోయిన రోవర్‌.. ఆ సమయంలో పుట్టిన పిల్లల పేర్లు ఏంటంటే..
Newborns Vikram Pragyan
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 06, 2023 | 9:18 AM

భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంతరిక్ష యాత్ర చంద్రయాన్-3 ఆగస్టు 23న విజయవంతమైంది. దీంతో చంద్రుడిపై విజయవంతంగా దిగిన నాలుగో దేశంగా భారత్ స్థానం సంపాదించుకుంది. ఇక చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలోకి అడుగుపెట్టిన తొలి దేశంగా మన దేశం రికార్డు సృష్టించింది. ఆగస్టు 23న చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైందని ఇస్రో ప్రకటించింది. ఈ వార్త విన్న తర్వాత భారతీయ శాస్త్రవేత్తల ఈ విజయాన్ని చూసి దేశం మొత్తం ఆనందంతో సంబరాలు చేసుకుంది.. ఇస్రోను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. ఈ చారిత్రాత్మక పురోగతికి గుర్తుగా ఇప్పుడు కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో ఇద్దరు దంపతులు తమ నవజాత శిశువులకు చంద్రయాన్-3 లోని ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ అనే పేరు పెట్టారు.

చంద్రయాన్-3 విజయవంతంగా ప్రయోగించిన వెంటనే ఒకే కుటుంబంలో ఇద్దరు పిల్లలు పుట్టారు. కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా వడగెర పట్టణానికి చెందిన ఇద్దరు దంపతులు బాలప్ప, నగ్మా కు జూలై 28న జన్మించిన బిడ్డకు విక్రమ్ అని పేరు పెట్టగా, ఆగస్టు 14న నింగప్ప, శివమ్మ దంపతులకు పుట్టిన శిశువుకు ప్రజ్ఞాన్ అని పేరు పెట్టారు. చంద్రుని మిషన్ విజయవంతమైందని ఇస్రో ప్రకటించిన మరుసటి రోజు ఆగస్టు 24న ఈ ఇద్దరు పిల్లలకు నామకరణం చేశారు.

అదేవిధంగా, ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో జన్మించిన అనేక మంది శిశువులకు కూడా భారతీయ చంద్ర మిషన్ల పేరు పెట్టారు. విక్రమ్ చంద్రుడిపై దిగిన ఒక రోజు తర్వాత ఆగస్టు 24న కేంద్రపరాలోని జిల్లా ఆసుపత్రిలో మొత్తం ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి జన్మించారు. ఈ నవజాత శిశువుల తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు చంద్రయాన్ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారు.

ఇవి కూడా చదవండి

చంద్రునిపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయిన నిమిషాలకే మా పాప పుట్టింది. బిడ్డకు చంద్ర మిషన్ పేరు పెట్టాలని నిర్ణయించుకున్నామని చిన్నారి తండ్రి ప్రవత్ మాలిక్ తెలిపారు. ఇది రెట్టింపు ఆనందం అంటూ వారు సంతోషం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం చంద్రుడిపై చీకటిపడింది. ఆదివారం అంటే..సెప్టెంబర్3 నుంచి చంద్రుడిపై 14 రోజులు చీకటిగా ఉంటుంది. సూర్యుడు కనిపించాడు. ఈ నేపథ్యంలో రోవర్ ను ఇస్రో శాస్త్రవేత్తలు స్లీప్ మోడ్ లోకి పంపించారు. సురక్షితమైన ప్లేస్‌లో రోవర్‌ని పార్క్ చేసిన ఇస్రో దానిని స్లీప్ మోడ్ లోకి పంపించినట్లుగా ప్రకటించింది. తిరిగి 14 రోజుల తర్వాత అంటే.. సెప్టెంబర్ 22నచంద్రుడిపై వెలుతురు వస్తుంది… అప్పుడు సూర్యరశ్మి ప్రభావంతో మళ్లీ సోలార్ ప్యానల్స్ పని చేసే అవకాశం ఉంటుందని ఇస్రో పేర్కొంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..