AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబం..! 39 మంది భార్యలు, 94 మంది పిల్లలతో ఒకే ఇంట్లో కాపురం..

ఓ వ్యక్తి అత్యధిక వివాహాలు చేసుకుని హాట్‌ టాపిక్‌ అయ్యాడు. ఒకటి రెండు కాదు..కాదు.. ఏకంగా 39 వివాహాలు చేసుకున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ భార్యలందరూ ఒకే తాటిపై జీవించారు. ఈ వ్యక్తి ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబాన్ని సృష్టించి ప్రపంచ రికార్డును సృష్టించారు. వీరింట్లో రోజుకు 45 కిలోల బియ్యం, 30-40 కోళ్లు, 25 కిలోల పప్పులు, డజన్ల కొద్దీ గుడ్లు వినియోగిస్తారు.

ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబం..! 39 మంది భార్యలు, 94 మంది పిల్లలతో ఒకే ఇంట్లో కాపురం..
Largest Family
Jyothi Gadda
|

Updated on: Sep 06, 2023 | 8:45 AM

Share

ప్రముఖ న్యాయవాది, భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే.. 68 ఏళ్ల వయస్సులో మూడో వివాహం చేసుకున్నారు.  ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, మన దేశంలో ఒకటికి మించి ఎక్కువ వివాహాలు చేసుకోవడం ఇదేం మొదటిసారి కాదు. ఇలాంటి వివాహాలు అనేకం వార్తల్లో వింటుంటాం. చూస్తుంటాం కూడా. అయితే, మిజోరాంలో ఓ వ్యక్తి అత్యధిక వివాహాలు చేసుకుని హాట్‌ టాపిక్‌ అయ్యాడు. ఒకటి రెండు కాదు..కాదు.. ఏకంగా 39 వివాహాలు చేసుకున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ భార్యలందరూ ఒకే తాటిపై జీవించారు. ఈ వ్యక్తి ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబాన్ని సృష్టించి ప్రపంచ రికార్డును సృష్టించారు.

భారతదేశంలోని తూర్పు రాష్ట్రంమైన మిజోరంలోని బక్టోంగ్ తలంగ్నుమ్ అనే గ్రామంలో ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబం నివసిస్తుంది. ఈ కుటుంబానికి అధిపతి అయిన జియోనా చానా 2021లో మరణించారు. మిజోరాం ముఖ్యమంత్రి జోరమ్‌తంగా ఆయన మరణవార్తను ట్వీట్ చేశారు. జియోనా, అతని కుటుంబం చాలా ప్రత్యేకమైనది. ఇది భారతీయ మీడియా మాత్రమే కాకుండా ప్రపంచ మీడియా కూడా ఈ కుటుంబం గురించి చర్చించింది. అతనికి 39 వివాహాలు జరిగాయి. అతను తన భార్యలందరితో కలిసి ఒకే ఇంట్లో నివసించాడు. అతనికి 39 మంది భార్యల ద్వారా 89 మంది పిల్లలు ఉన్నారు. అతనికి 36 మంది మనవళ్లు కూడా ఉన్నారు. అయినప్పటికీ, అనేక మీడియా నివేదికల ప్రకారం, అతని పిల్లల సంఖ్య 94 వరకు ఉంది. ఇక వీళ్లంతా ఒకే ఇంట్లో నివసించేవారు. వారికోసం ఆ ఇంట్లో దాదాపు 100 గదులు ఉన్నాయి. అతని ఇంటి పేరు చువార్ థాన్ రన్ అంటే కొత్త యుగం ఇల్లు. ఈ ఇల్లు రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

జియోనా 1945లో జన్మించాడు.. అతను తన కంటే 3 సంవత్సరాలు పెద్దదైన 17 సంవత్సరాల వయస్సులో తన మొదటి భార్యను పెళ్లి చేసుకున్నాడు.. చన పాల్ అనే క్రైస్తవ వర్గానికి చెందిన ఈ కుటుంబం 2 వేల మంది అనుచరులను కలిగి ఉంది. ఈ వ్యక్తి తాత 1942లో ఈ సంఘాన్ని స్థాపించారు. ఈ సంఘం బహుభార్యాత్వాన్ని అనుమతించింది.

ఈ కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ఉద్యోగం కేటాయించబడుతుంది. ఇంట్లో అతి పెద్ద వంటగది ఉంటుంది. ఇక్కడ దాదాపు 180 మంది కుటుంబానికి భోజనం వండుతారు. రోజుకు 45 కిలోల బియ్యం, 30-40 కోళ్లు, 25 కిలోల పప్పులు, డజన్ల కొద్దీ గుడ్లు వినియోగిస్తారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..