Success Story: వ్యవసాయం చేస్తున్న రిటైర్మెంట్ NSG కమాండో.. నెలకు రూ. 25 లక్షల సంపాదన..

NSG కమాండోగా పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్న అతను అందరికంటే భిన్నంగా వ్యవసాయం రంగాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు పంటలు పండించే విషయంలో ప్రావీణ్యం పొందుతున్నారు. వ్యవసాయం చేస్తూ ఏడాదికి లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నారు. ఖర్జూరం, దానిమ్మ, జామ, నిమ్మ, దోస కాయ, పుచ్చకాయ వంటి అనేక రకాల పంటలతో అతని తోటలు కనువిందు చేస్తూ ఉంటాయి.

Success Story: వ్యవసాయం చేస్తున్న రిటైర్మెంట్ NSG కమాండో.. నెలకు రూ. 25 లక్షల సంపాదన..
Nsg Commando Mukesh Manju
Follow us
Surya Kala

|

Updated on: Aug 27, 2023 | 10:32 AM

NSG కమాండోల పేరు వింటేనే ఎటువంటి ఉగ్రవాదులకైనా  చెమటలు పట్టాల్సిందే..  రెప్పపాటులో చిరుతపులిలా ప్రత్యర్థులపై దాడి చేసేంత చురుకుదనం వీరి సొంతం. అయితే అలాంటి ఒక NSG కమాండో ఇపుడు వ్యవసాయం చేస్తూ అక్కడ కూడా తనదైన రికార్డ్ ను సృష్టిస్తున్నాడు. NSG కమాండోగా పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్న అతను అందరికంటే భిన్నంగా వ్యవసాయం రంగాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు పంటలు పండించే విషయంలో ప్రావీణ్యం పొందుతున్నారు. వ్యవసాయం చేస్తూ ఏడాదికి లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నారు. విశేషమేమిటంటే.. రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఆధునిక పద్ధతిలో గార్డెనింగ్ చేస్తున్నాడు. ఖర్జూరం, దానిమ్మ, జామ, నిమ్మ, దోస కాయ, పుచ్చకాయ వంటి అనేక రకాల పంటలతో అతని తోటలు కనువిందు చేస్తూ ఉంటాయి.

నిజానికి.. ఈ రైతు పేరు ముఖేష్ మంజు.. రాజస్థాన్‌లోని పిలాని నివాసి. గతంలో ముఖేష్ ఎన్‌ఎస్‌జీలో కమాండర్‌గా విధులు నిర్వహించారు. 2018లో పదవీ విరమణ పొందిన తర్వాత సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. వ్యవసాయంతో అతని అదృష్టం మారిపోయింది. అయితే పదవీ విరమణ చేయకముందే 2012లో తన తండ్రికి వ్యవసాయంలో సహాయం చేయడం ప్రారంభించానని ముఖేష్  చెబుతున్నారు. అయితే తాను సంప్రదాయ పద్ధతిలో కాకుండా ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేయడం ప్రారంభించినట్లు పేర్కొన్నాడు. అతని తోటలో నిమ్మ, దానిమ్మ, ఖర్జూరంతో సహా అనేక రకాల పండ్ల చెట్లను నాటాడు. సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నాడు. అయితే ఖర్జూరం సాగుకు ప్రభుత్వం నుంచి రాయితీ కూడా పొందాడు.

అతని సంపాదన గతంలో కంటే 10 రెట్లు పెరిగింది

విశేషమేమిటంటే ముఖేష్ మంజు తన తోటలో ఆగ్రో టూరిజం కూడా ప్రారంభించాడు. ప్రజలు ఆయన పొలానికి వచ్చి ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. ఈ సమయంలో, ముఖేష్ వారికి పండ్లు కూడా తినడానికి ఇస్తూ ఉంటాడు. పర్యాటకులు ముఖేష్ పొలంలోని పండ్లు, కూరగాయలను నేరుగా కొనుగోలు చేస్తారు. వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం గతంతో పోలిస్తే 10 రెట్లు పెరిగిందని చెప్పారు. నేడు ఏటా 25 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

చెరువులో చేపలు పట్టడం

ముఖేష్ వద్ద ఇప్పటికీ సాహివాల్ , గిర్ వంటి దేశీయ జాతులకు చెందిన అనేక ఆవులు ఉన్నాయి. అతడికి ఇద్దరు మగపిల్లలు కూడా ఉన్నారు. తన పొలంలోని కొంత భాగంలో పౌల్ట్రీని పెంచుతారు. వర్షపు నీటిని సేకరించేందుకు తన పొలాల్లో చెరువును నిర్మించుకున్నాడు. దీంతో పాటు ఈ చెరువులో చేపల పెంపకం కూడా చేస్తుండడంతో మంచి లాభాలు వస్తున్నాయి.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..