AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఇంద్రభవనంలాంటి ఇంటిని సొంతం చేసుకోండి.. కేవలం 82 రూపాయలకే.. కండిషన్స్ అప్లై..

కొన్ని నెలల క్రితం లండన్‌లో 40 బెడ్‌రూమ్‌లతో కూడిన ఇల్లు ఉందని.. దీని ఖరీదు దాదాపు 25 వేలకోట్ల రూపాయలు అని ఒక వార్త వచ్చింది. అయితే ఇప్పుడు ఇల్లు ఖరీదు గురించి అలాంటి వార్త ఒకటి హల్ చల్ చేస్తోంది. ఈ ఇల్లు ఖరీదు అతి తక్కువ.. దీనిని డబ్బులు దాచుకునే చిన్న పిల్లవాడు కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ ఇంటిని ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇల్లుగా అభివర్ణిస్తున్నారు

Viral News: ఇంద్రభవనంలాంటి ఇంటిని సొంతం చేసుకోండి.. కేవలం 82 రూపాయలకే.. కండిషన్స్ అప్లై..
The House Was Built In 1956Image Credit source: Zillow
Surya Kala
|

Updated on: Aug 27, 2023 | 9:57 AM

Share

సొంత ఇల్లు కావాలని కలలు కనేవాడు బహు అరుదని చెప్పవచ్చు. అయితే సొంత ఇంటి కల అందరికి  నెరవేరదు. అయితే ఇల్లు కట్టి చూడు అని మన పెద్దలు.. సొంత ఇల్లు కట్టుకోవడం వెనుక ఉండే కష్టము గురించి చెప్పకనే చెప్పేశారు. ప్రస్తుతం ఇల్లు కట్టడం లేదా కొనడం చాలా ఖరీదుగా మారిపోయింది. కొన్ని నెలల క్రితం లండన్‌లో 40 బెడ్‌రూమ్‌లతో కూడిన ఇల్లు ఉందని.. దీని ఖరీదు దాదాపు 25 వేలకోట్ల రూపాయలు అని ఒక వార్త వచ్చింది. అయితే ఇప్పుడు ఇల్లు ఖరీదు గురించి అలాంటి వార్త ఒకటి హల్ చల్ చేస్తోంది. ఈ ఇల్లు ఖరీదు అతి తక్కువ.. దీనిని డబ్బులు దాచుకునే చిన్న పిల్లవాడు కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ ఇంటిని ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇల్లుగా అభివర్ణిస్తున్నారు.

ఈ ఇల్లు USAలోని మిచిగాన్‌లోని పోంటియాక్‌లో ఉంది. ఈ ఇల్లు ధర కేవలం ఒక డాలర్ అంటేమన దేశ కరెన్సీలో 82 రూపాయలు. ఈ డబ్బులకు 10 ఇటుకలు కూడా రావు. మరి అలాంటి ఇల్లును ఎలా నిర్మించారు.. ఎందుకు ఇంత తక్కువ ధరకు అందుబాటులో ఉంది. లేదా ఈ ఇల్లు చాలా చిన్నదిగా ఉంటుందేమో అంటూ రకరకాల కారణాలను అనుకుంటూ ఉండవచ్చు.. అయితే ఈ ఇల్లు  డబుల్ బెడ్ రూమ్స్ ఉన్న బంగ్లా..

ఇల్లు కొంగలు కోసం బారులుతీరుతున్న జనం..

Ladbible అనే వెబ్‌సైట్ నివేదిక ప్రకారం.. రియల్ ఎస్టేట్ ఏజెంట్ క్రిస్టోఫర్ హుబెల్ ఈ ఇంటి అమ్మకానికి కలదని.. ధరను ఆన్‌లైన్‌లో షేర్ చేసిన వెంటనే.. భారీగా కాల్స్ రావడం ప్రారంభించాయని చెప్పారు.  ప్రపంచంలోనే అత్యంత చవకైన ఇంటిని కొనుగోలు చేయాలనే ఆసక్తిని కనబరుస్తూ తనకు వందల కొద్దీ ఫోన్ కాల్‌లు, వందల కొద్దీ మెసేజ్లు , వందల కొద్దీ ఇమెయిల్‌లు వచ్చాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి

2011లో ఇంటి ధర 8 లక్షలు.

ఈ ఇంటిని 1956లో నిర్మించారని.. చాలా ఏళ్ల తర్వాత దాన్ని వేరొకరికి విక్రయించారని క్రిస్టోఫర్ చెప్పారు. ప్రస్తుతం ఈ ఇల్లు దాదాపు 20 సంవత్సరాలుగా ఒక వ్యక్తితో అధీనంలో ఉంది. 2004లో కొనుగోలు చేసి అద్దెకు ఇచ్చాడు. 2011లో కూడా ఈ ఇంటిని 10 వేల డాలర్లకు అంటే నేటి లెక్కన దాదాపు 8 లక్షల 25 వేల రూపాయలకు అమ్మేందుకు ప్రయత్నించగా అమ్ముడుపోలేదు.

ఇంటి లోపల చాలా దారుణమైన పరిస్థితి

ఇప్పుడు ఈ ఇంటి పరిస్థితి దారుణంగా తయారైంది. ఎంతగా అంటే ఇక్కడ ఎవరూ ఉండలేని పరిస్థితి నెలకొంది. ఏళ్ల తరబడి ఈ ఇల్లు ఖాళీగా ఉంది. పెయింట్‌వర్క్‌లు ఎక్కడికక్కడ పాడైపోయాయి. వంటగది శిథిలావస్థకు చేరుకుంది. అల్మారాలు శిథిలావస్థలో ఉన్నాయి. బాత్‌రూమ్‌లు కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి. దీంతో ఇప్పుడు అతి తక్కువ ధరకు ఈ ఇంటిని ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టారు. ఎవరైనా ఈ ఇంటిని తన సొంతం చేసుకోవాలనుకుంటే.. ఆగస్టు 23 వరకు మాత్రమే సమయం ఇచ్చారు. ఇప్పుడు ఈ ఆఫర్ ముగిసింది. దీంతో ఈ ఇల్లు ధర మళ్లీ వేల డాలర్లలోకి వెళ్ళింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..