Robert Earl Hughes: 124 అంగుళాల ఛాతీ ఉన్న వ్యక్తి.. ఇప్పటి వరకు ఈ ప్రపంచ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు..
ఈ వ్యక్తి పేరు రాబర్ట్ ఎర్ల్ హ్యూస్. రాబర్ట్ ఛాతీ 124 అంగుళాలు అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచంలోనే అత్యంత విశాలమైన ఛాతీ ఉన్న వ్యక్తిగా రికార్డులకెక్కాడు. అతను ఈ ప్రపంచాన్ని విడిచి ఎన్ని ఏళ్లు అయినా అతని విశాలమైన ఛాతీ కారణంగా.. ప్రజలు ఇప్పటికీ అతన్ని గుర్తుంచుకుంటారు. ఎంత బరువున్నా ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తి కాలేరు. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తి .. విశాలమైన ఛాతీ ఉన్న వ్యక్తి అయిన ఓ వ్యక్తి గురించి ఈ రోజు తెలుసుకుందాం..
బరువు పెరగడం సర్వసాధారణం.. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది బాధపడుతున్నారు.. పెరుగుతున్న బరువును తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరు యోగా, వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గించుకోవాలని ప్రయత్నిస్తుంటే.. మరి కొందరు సర్జరీ చేసి పొట్టను తగ్గించుకుంటున్నారు. అదే సమయంలో బరువు బాగా పెరిగిన వారు కూడా ఉన్నారు. ఎంత బరువున్నా ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తి కాలేరు. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తి .. విశాలమైన ఛాతీ ఉన్న వ్యక్తిగా రికార్డుకెక్కిన ఓ వ్యక్తి గురించి ఈ రోజు తెలుసుకుందాం..
ఈ వ్యక్తి పేరు రాబర్ట్ ఎర్ల్ హ్యూస్. రాబర్ట్ ఛాతీ 124 అంగుళాలు అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచంలోనే అత్యంత విశాలమైన ఛాతీ ఉన్న వ్యక్తిగా రికార్డులకెక్కాడు. అతను ఈ ప్రపంచాన్ని విడిచి ఎన్ని ఏళ్లు అయినా అతని విశాలమైన ఛాతీ కారణంగా.. ప్రజలు ఇప్పటికీ అతన్ని గుర్తుంచుకుంటారు. అంతేకాదు 1955 సంవత్సరంలో.. రాబర్ట్ ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తిగారికార్డ్ కెక్కాడు. అతని పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది. అప్పుడు అతని బరువు 429 కిలోలు, తరువాత 484 కిలోలకు చేరుకుంది.
బరువు విపరీతంగా పెరగడం ఎప్పుడు మొదలైందంటే..
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాబర్ట్ చాలా బరువు ఉన్నప్పటికీ హాయిగా నడిచేవాడు. ఎంత పని అయినా చేసుకునేవాడు. అందుకే ప్రపంచంలోనే ఎలాంటి సహాయం లేకుండా నడిచే అతి బరువైన వ్యక్తిగా రికార్డ్ గా పేరు నమోదైంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం రాబర్ట్ కేవలం 5 నెలల వయస్సులో ఉన్నప్పుడు కోరింత దగ్గు వచ్చింది. దీని కారణంగా థైరాయిడ్ గ్రంథి పగిలిపోయి.. బరువు పెరగడం ప్రారంభించింది. కేవలం 6 సంవత్సరాల వయస్సులో రాబర్ట్ బరువు 92 కిలోలకు పెరిగింది. 10 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి బరువు 171 కిలోలకు చేరుకుంది.
నడవం కష్టమై చదువు మానేసిన రాబర్ట్
నివేదికల ప్రకారం రాబర్ట్ బరువు దాదాపు 250 కిలోలకు పెరిగింది. ప్రతిరోజూ స్కూల్ కు మైలు దూరం నడిచి వెళ్లడం కష్టంగా ఉన్నందున.. ఏడవ తరగతి తర్వాత స్కూల్ కు గుడ్ బై చెప్పేశాడు. రాబర్ట్ తల్లిదండ్రులు అతని కోసం ఒక ప్రత్యేక మంచం వేయవలసి వచ్చింది. ఈ మంచంపైనే పడుకునేవాడు. అయితే ఈ పెరుగుతున్న బరువు కారణంగా రాబర్ట్ 21 సంవత్సరాల వయస్సులోనే మరణించాడు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..