AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Polonium: ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన విషం.. చిటికెడు విషంతో వేలాది మంది మృతి.. కనిపెట్టిన శాస్త్రవేత్తను నోబెల్ బహుమతి

పోలోనియం నిజానికి యురేనియం ధాతువులో లభించే లోహం. ఇది నేరుగా మన శరీరంలోకి ప్రవేశించదు ఎందుకంటే ఈ ఆల్ఫా కణాలు ఎక్కువ దూరం ప్రయాణించలేవు. అయితే పొరపాటున ఇది మన శరీరంలోకి ప్రవేశిస్తే.. ప్రపంచంలోని ఏ వైద్యుడు అతని మరణాన్ని ఆపలేడు. అంటే ఇది ఎంత ప్రమాదకరమో ఆలోచించండి.

Polonium: ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన విషం.. చిటికెడు విషంతో వేలాది మంది మృతి.. కనిపెట్టిన శాస్త్రవేత్తను నోబెల్ బహుమతి
Polonium Poison
Surya Kala
|

Updated on: Aug 14, 2023 | 11:08 AM

Share

అమృతం, విషం తరచుగా వినే మాటలే.. ప్రాణాలను పోసేది అమృతం అయితే.. ప్రాణాలను తీసేది విషం. అయితే విషం పేరు చెబితే చాలు ముందుగా గుర్తుకొచ్చేవి పాములు, తేళ్లు, జెర్రీ వంటి జీవులు. అంతేకాదు ఆధునిక కాలంలో విషం పేరు వినగానే.. ముందుగా గుర్తుకు వచ్చేది సైనైడ్.. అయితే మన భూమిపై అంతకన్నా ప్రమాదకరమైన విషం ఉందని మీకు తెలుసా. ఈ ఒక చిటికెడు విషం చాలు వేలాది మంది మరణిస్తారు. అవును మనం Polonium-210 గురించి మాట్లాడుతున్నాము.. దీని రేడియేషన్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే మానవ శరీరంలోని అంతర్గత అవయవాలు, DNA, రోగనిరోధక వ్యవస్థను నాశనం చేస్తుంది. క్షణంలో చనిపోతారు.

పోలోనియం నిజానికి యురేనియం ధాతువులో లభించే లోహం. ఇది నేరుగా మన శరీరంలోకి ప్రవేశించదు ఎందుకంటే ఈ ఆల్ఫా కణాలు ఎక్కువ దూరం ప్రయాణించలేవు. అయితే పొరపాటున ఇది మన శరీరంలోకి ప్రవేశిస్తే.. ప్రపంచంలోని ఏ వైద్యుడు అతని మరణాన్ని ఆపలేడు. అంటే ఇది ఎంత ప్రమాదకరమో ఆలోచించండి. చిన్న ధాన్యం సైజు అంత విషం మన శరీరంలోకి చేరినా అతని ఆట పూర్తిగా ముగిసినట్లే అని చెప్పవచ్చు.

ఈ  పోలోనియం శరీరంలోకి ప్రవేశించిన వెంటనే.. మన వెంట్రుకలన్నీ ఆటోమేటిక్‌గా రాలడం ప్రారంభిస్తాయి. క్రమంగా శరీరంలోకి ప్రవేశించి లోపల భాగాలను నాశనం చేస్తుంది. అయితే ఈ విషం  అతిపెద్ద సమస్య ఏమిటంటే.. ఈ విషం మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు.. దాని ఉనికిని సరిగ్గా గుర్తించలేరు. సరైన సమయంలో చికిత్స పొందక చనిపోతారు. ఈ విషయం  గురించి ప్రపంచానికి పరిచయం చేసిన శాస్త్రవేత్త మేడమ్ క్యూరీ.. ఇందుకు గాను ఆమెకు నోబెల్ బహుమతి కూడా లభించింది.

ఇవి కూడా చదవండి

ముఖ్యంగా పోలోనియం తినే ఆహారంలో కలిపితే అస్సలు తెలియదట.. ఆహారం తిన్న వెంటనే అది మీ శరీరంలోకి ప్రవేశించి మెల్లగా ప్రభావము చూపిస్తుంది. అయితే ఈ విషం మొదటి బాధితురాలు మేరీ క్యూరీ కుమార్తె ఐరీన్ జూలియట్ క్యూరీ. ఈ విషాన్ని సరదాగా తిన్నదని.. అనంతరం ఆమె మరణించిందని అంటారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..