Mosquito Burger: ప్రొటీన్ కోసం దోమల బర్గర్ తినే ఆ దేశ ప్రజలు.. ఒక బర్గర్ కోసం ఎన్ని లక్షల దోమలు ఉపయోగిస్తారో తెలిస్తే షాక్.. .

దోమల బర్గర్‌ని ఆఫ్రికాలోని ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాదు ఈ బర్గర్ పూర్తిగా ప్రోటీన్‌తో నిండి ఉంటుంది. ఈ బర్గర్ తినడం మొదలుపెడితే శరీరంలో ప్రొటీన్ల కొరత ఎప్పటికీ ఏర్పడదని చెబుతున్నారు. అంతేకాదు దోమలతో బర్గర్ తయారు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయట.. ప్రస్తుతం వర్షాకాలం.. కనుక ప్రపంచమంతటా దోమల వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తుంది. 

Mosquito Burger: ప్రొటీన్ కోసం దోమల బర్గర్ తినే ఆ దేశ ప్రజలు.. ఒక బర్గర్ కోసం ఎన్ని లక్షల దోమలు ఉపయోగిస్తారో తెలిస్తే షాక్.. .
Mosquito Burger
Follow us
Surya Kala

|

Updated on: Aug 04, 2023 | 7:41 AM

పిజ్జా, బర్గర్ ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ వంటకాలు. వీటిని అన్ని వయసుల వారు ఇష్టంగా తింటారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరికీ దీని రుచి అంటే పిచ్చి. దీనిని చూడగానే నోటిలో నీళ్లు వచ్చేంత రుచికరమైన వంటకం. బర్గర్ ను వెజ్, నాన్ వెజ్ ఇలా అన్ని రకాలుగా తయారు చేస్తారు. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో టేస్టీగా ఉండేందుకు వివిధ దేశాల్లో రకరకాలుగా తయారుచేస్తారు. ఎవరి టెస్టుకు తగినట్లు వారికి అనేక రకాల బర్గర్లు అందుబాటులో ఉన్నాయి కూడా..  అయితే మీరు ఎప్పుడైనా దోమలతో చేసిన బర్గర్ తిన్నారా! ఇది మీకు వింతగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం.

దోమల బర్గర్‌ని ఆఫ్రికాలోని ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాదు ఈ బర్గర్ పూర్తిగా ప్రోటీన్‌తో నిండి ఉంటుంది. ఈ బర్గర్ తినడం మొదలుపెడితే శరీరంలో ప్రొటీన్ల కొరత ఎప్పటికీ ఏర్పడదని చెబుతున్నారు. అంతేకాదు దోమలతో బర్గర్ తయారు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయట.. ప్రస్తుతం వర్షాకాలం.. కనుక ప్రపంచమంతటా దోమల వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తుంది.

దోమల బర్గర్ ఎందుకు తయారు చేయడం మొదలు పెట్టారంటే.. 

ఇవి కూడా చదవండి

ఆఫ్రికాలోని విక్టోరియా సరస్సులోని నీటి చుట్టూ చాలా దోమలు పెరుగుతున్నాయి. దీంతో ఇక్కడ నివసించే ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అదే సమయంలో ఈ ప్రాంతంలో పెరుగుతున్న దోమల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉండటాన్ని స్థానికులు గమనించారు. దీంతో ఈ దోమలను తరిమికొట్టేందుకు ఇక్కడి ప్రజలు ఓ ప్రత్యేక ట్రిక్‌ని ఉపయోగించి వాటితో బర్గర్‌లను తయారు చేయడం ప్రారంభించారు.

మీడియా కథనాల ప్రకారం ఈ బర్గర్‌లో ఉపయోగించిన టిక్కీ పూర్తిగా నలుపు రంగులో ఉంటుంది. ఒక టిక్కీని తయారు చేయడానికి దాదాపు ఐదు లక్షల దోమలను ఉపయోగిస్తారు. దీన్ని కలిపి ముద్దగా చేసి టిక్కీ ఆకారంలో ఇస్తారని, తక్కువ మంటపై కాల్చి బర్గర్‌లో కలుపుకుని తింటారని చెబుతున్నారు. ఈ బర్గర్ గురించి.. ప్రొటీన్ లేమితో ఇబ్బంది పడే వారికి ఈ బర్గర్ ఎంతో మేలు చేస్తుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..