Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Strange but True: ఇది ప్రేమా పైత్యమా..! 70 ఏళ్ల వృద్ధుడిని ప్రేమించిన 23 ఏళ్ల యువతి.. తీరా పెళ్లి రోజున ఏమి చేసిందంటే..

23 ఏళ్ల ఎరికా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. అమెరికా నివాసి. మిలియనీర్ రిక్‌ని మొదటి సరిగా డేటింగ్ షోలో కలిసింది. ఎరికా మాట్లాడుతూ.. 'రిక్ నా కంటే 46 సంవత్సరాలు పెద్దవాడు.. అయితే అతని ఎలా ప్రేమలో పడ్డానో నాకే తెలియదని చెప్పింది. ప్రేమ పెళ్లి వరకూ వెళ్ళింది. అయితే పెళ్లి రోజు మాత్రం ఎరికా మనసు మార్చుకుంది.

Strange but True: ఇది ప్రేమా పైత్యమా..! 70 ఏళ్ల వృద్ధుడిని ప్రేమించిన 23 ఏళ్ల యువతి.. తీరా పెళ్లి రోజున ఏమి చేసిందంటే..
Erica Moser Love
Follow us
Surya Kala

|

Updated on: Jul 29, 2023 | 9:39 AM

‘ప్రేమ గుడ్డి’ అనే సామెతను గుర్తు చేస్తున్నాయి కొన్ని ప్రేమ పెళ్లిళ్లు. ఎందుకంటే.. కొంతమంది వయసు తేడా, ఉన్నవారు లేని వారు భాష బేధం వంటి వాటిని పట్టించుకోరు. అయితే 23 ఏళ్ల అమ్మాయి 70 ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడింది. తన తాత వయసున్న వ్యక్తిని ప్రేమించడమే కాదు.. కలిసి బతుకుతానని.. కలిసి మరణిస్తామని ఏకంగా ప్రమాణం కూడా చేస్తోంది ఆ యువతి.  ఎరికా మోజర్ అనే యువతి రిక్ సైక్స్ అనే వృద్ధుడితో గత ఒకటిన్నర సంవత్సరాలుగా డేటింగ్ లో ఉంది. తమ ప్రేమను చెప్పి.. అనుమతితో పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. వృద్ధుడు వరుడిని పెళ్లి చేసుకునే సమయం కూడా వచ్చింది. ఇంతలో ఏమి జరిగిందో లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చింది. మరి ఈ ప్రేమ పక్షుల కథ గురించి తెలుసుకుందాం..

ది సన్‌ నివేదిక ప్రకారం 23 ఏళ్ల ఎరికా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. అమెరికా నివాసి. మిలియనీర్ రిక్‌ని మొదటి సరిగా డేటింగ్ షోలో కలిసింది. ఎరికా మాట్లాడుతూ.. ‘రిక్ నా కంటే 46 సంవత్సరాలు పెద్దవాడు.. అయితే అతని ఎలా ప్రేమలో పడ్డానో నాకే తెలియదని చెప్పింది. ప్రేమ పెళ్లి వరకూ వెళ్ళింది. అయితే పెళ్లి రోజు మాత్రం ఎరికా మనసు మార్చుకుంది. తన జీవితాన్ని నాశనం చేసుకోబోతోందని భావించింది. దీంతో  చివరి క్షణంలో ఆమె రిక్‌తో పెళ్లిని రద్దు చేసింది.

ఎలా ఇద్దరూ కలిశారంటే  ఎరికా, రిక్ 2021లో ‘మేరీయింగ్ మిలియన్స్’ అనే టీవీ సిరీస్‌లో కనిపించారు. ఈ షోలోని పాల్గొనే జంటల్లో ఒకరు ధనవంతులు అయితే.. మరొకరు సాధారణ వ్యక్తి. ఈ ప్రదర్శన సమయంలో కలిగిన పరిచయంతో  ఎరికా, రిక్ చాలా దగ్గర అయ్యారు. అయితే ఎరికా ఇప్పుడు సోషల్ మీడియాలో తన రొమాన్స్ గురించి బహిరంగంగా మాట్లాడింది.

ఇవి కూడా చదవండి

ఎరికా ఏం చెప్పిందంటే  ఎరికా టిక్‌టాక్ @erica35mmలో నేషనల్ టీవీలో దాదాపు 70 ఏళ్ల వ్యక్తిని పెళ్లి చేసుకోనున్నానని ప్రజలకు తెలియజేస్తూ వీడియో పోస్ట్‌ను షేర్ చేసింది. అయితే ఇప్పుడు తనకి బుద్ధి వచ్చిందని.. ఇకపై తాను ఈ  పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేనని తెలిపింది. అంతేకాదు ఆమె ఇంకా మాట్లాడుతూ, ‘మేమిద్దరం చాలా భిన్నంగా ఉంటాము. మా మధ్య ఎలాంటి కామన్ పాయింట్ లేదు. అందుకనే తాను అతనికి గుడ్ బై చెప్పినట్లు ఎరికా వెల్లడించింది. ఈ విషయం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఒకప్పుడు ఇద్దరూ ఒకరినొకరు బాగా ఇష్టపడేవారు.

ప్రజల స్పందన ఇన్‌ఫ్లుయెన్సర్  పోస్ట్ చేసిన ఈ వీడియో ‘మేరీయింగ్ మిలియన్స్’ పై నెటిజన్లు, అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఒకరు మీ గురించి నిజాయితీగా చెప్పాలంటే, మీ పట్ల నాకు గౌరవం పెరిగింది. లేకుంటే మీ ప్లేస్ లో చాలా మంది ఆడవాళ్లు డబ్బు కోసం రిక్ పెళ్లి చేసుకున్నారు. అదే సమయంలో, అతను ఎరికాను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నందున రిక్ ప్రస్తుత పరిస్థితి తనకు బాధను కలిగిస్తుందని మరొకరు చెప్పారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..