Video: ఏంది బాసూ.. ఈ ఊరమాస్ ఇన్నింగ్స్.. 307 స్ట్రైక్‌రేట్‌తో పాక్ బౌలర్‌ను కన్నీళ్లు పెట్టించిన భారత ప్లేయర్..

Yusuf Pathan: హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన జిమ్ ఆఫ్రో T10 లీగ్ క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో జోబర్గ్ బఫెలోస్ 6 వికెట్ల తేడాతో డర్బన్ క్వాలండర్స్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. జోబర్గ్ బఫెలోస్ తరపున అద్భుతంగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు మాజీ ఆటగాడు యూసుఫ్ పఠాన్.. కేవలం 26 బంతుల్లోనే అజేయంగా 80 పరుగులతో విజయానికి హీరోగా మారాడు.

Video: ఏంది బాసూ.. ఈ ఊరమాస్ ఇన్నింగ్స్.. 307 స్ట్రైక్‌రేట్‌తో పాక్ బౌలర్‌ను కన్నీళ్లు పెట్టించిన భారత ప్లేయర్..
Yusuf Pathan
Follow us
Venkata Chari

|

Updated on: Jul 29, 2023 | 8:44 AM

Zim Afro T10: హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన జిమ్ ఆఫ్రో T10 లీగ్ క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో జోబర్గ్ బఫెలోస్ 6 వికెట్ల తేడాతో డర్బన్ క్వాలండర్స్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. జోబర్గ్ బఫెలోస్ తరపున అద్భుతంగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు మాజీ ఆటగాడు యూసుఫ్ పఠాన్.. కేవలం 26 బంతుల్లోనే అజేయంగా 80 పరుగులతో విజయానికి హీరోగా మారాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ ఖలందర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన జోబర్గ్ బఫెలోస్ జట్టు 4 వికెట్లు కోల్పోయి, మరో బంతి మిగిలి ఉండగానే విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో జోబర్గ్ బఫెలోస్ టాస్ గెలిచి డర్బన్ క్వాలండర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన డర్బన్ క్వాలండర్స్ జట్టుకు శుభారంభం లభించలేదు. ఓపెనర్ సీఫెర్ట్ 11 పరుగులకే పెవిలియన్ చేరగా.. మరో ఓపెనర్ మీర్జా బేగ్ 20 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. మూడో స్థానంలో వచ్చిన ఆండ్రీ ఫ్లెచర్ 14 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేశాడు.

60 బంతుల్లో 140 పరుగుల లక్ష్యం..

అలాగే, 5వ ర్యాంక్‌లో వచ్చిన ఆసిఫ్ అలీ కూడా 14 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో అజేయంగా 32 పరుగులు చేశాడు. చివర్లో, నిక్ వెల్చ్ కూడా 9 బంతుల్లో 24 పరుగుల సహకారం అందించాడు. చివరగా డర్బన్ క్వాలండర్స్ జట్టు 60 బంతుల్లో 140 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించిన జోబర్గ్ బఫెలోస్‌కు శుభారంభం లభించలేదు. మంచి భాగస్వామ్యాన్ని అందించడంలో విఫలమైన ఓపెనర్ మహ్మద్ అఫీజ్ 17 పరుగులకే ఇన్నింగ్స్ ముగించాడు. టామ్ బాంటన్ 4 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. మూడో స్థానంలో వచ్చిన విల్ ష్మిత్ కూడా ఎక్కువ సేపు ఫీల్డ్‌లో ఉండకుండా 16 పరుగులకే తన వికెట్‌ను కోల్పోయాడు.

26 బంతుల్లో 4 బౌండరీలు, 9 సిక్సర్లు..

దీంతో ఆ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ సమయంలో బ్యాటింగ్‌కు దిగిన యూసుఫ్ పఠాన్ డర్బన్ ఖలందర్స్ జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన ఇన్నింగ్స్‌లో 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న యూసుఫ్ 4 ఫోర్లు, 9 సిక్సర్లతో అజేయంగా 80 పరుగులు చేశాడు. ఆఖర్లో యూసుఫ్‌కు అండగా నిలిచిన ముష్ఫికర్ రహీమ్ 10 బంతుల్లో 14 పరుగులతో అజేయంగా నిలిచాడు.

పాకిస్థాన్ పేసర్‌కు చుక్కలు..

నిజానికి 8వ ఓవర్లో పాక్ పేసర్ మహ్మద్ అమీర్ పై ధీటుగా బ్యాటింగ్ చేసిన పఠాన్.. ఒకే ఓవర్లో 3 సిక్సర్లు, ఒక బౌండరీతో 25 పరుగులు రాబట్టాడు. దీంతో ఆ జట్టు 100 పరుగుల మార్కును దాటింది. దీంతో చివరి రెండు ఓవర్లలో బఫెలోస్ విజయానికి 39 పరుగులు చేయాల్సి ఉంది.

ఆఖరి ఓవర్లో విజయానికి 20 పరుగులు కావాల్సిన సమయంలో యూసుఫ్ ఇన్నింగ్స్ 9వ ఓవర్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది జట్టును విజయతీరాలకు చేర్చి అర్ధసెంచరీ పూర్తి చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో