IND vs WI: రెండో వన్టేలో మిస్టర్ 360పై వేటు.. 9 నెలల తర్వాత రీఎంట్రీ ఇవ్వనున్న బ్యాడ్ లక్ ప్లేయర్?

India vs West Indies 2nd ODI: బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన తొలి వన్డేలో సులువుగా గెలిచిన టీమిండియా మరోసారి రంగంలోకి దిగనుంది. తొలి మ్యాచ్‌లో ఇరుజట్లు కలిసి 46 ఓవర్లు మాత్రమే ఆడాయి. ప్రయోగాల మధ్య భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను పాజిటివ్‌గా ప్రారంభించింది.

IND vs WI: రెండో వన్టేలో మిస్టర్ 360పై వేటు.. 9 నెలల తర్వాత రీఎంట్రీ ఇవ్వనున్న బ్యాడ్ లక్ ప్లేయర్?
Ind Vs Wi 2nd Odi
Follow us
Venkata Chari

|

Updated on: Jul 29, 2023 | 8:30 AM

Sanju Samson: బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన తొలి వన్డేలో సులువుగా గెలిచిన టీమిండియా మరోసారి రంగంలోకి దిగనుంది. తొలి మ్యాచ్‌లో ఇరుజట్లు కలిసి 46 ఓవర్లు మాత్రమే ఆడారు. ప్రయోగాల మధ్య భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను ప్రారంభించింది. ఇప్పుడు ఈ మైదానంలో జరగనున్న రెండో మ్యాచ్‌పైనే దృష్టి నెలకొంది. విజయం సాధించినప్పటికీ, టీమిండియా ముందు మళ్లీ పెద్ద ప్రశ్న తలెత్తింది. అది సంజూ శాంసన్‌కు జట్టులో అవకాశం ఎప్పుడు వస్తుందంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.

సిరీస్‌లో రెండో మ్యాచ్ జులై 29, శనివారం జరగనుండగా, ఇందులో సంజూ శాంసన్‌కు అవకాశం వస్తుందని భావిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో సంజూ స్థానంలో ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా జట్టులోకి వచ్చాడు. ఇషాన్ కూడా నిరాశపరచలేదు. కీపింగ్‌లో పెద్దగా రాణించలేకపోయినా బ్యాటింగ్‌లో తనకు లభించిన అవకాశాన్ని ఇషాన్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఓపెనింగ్‌లో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ బలమైన అర్ధ సెంచరీ సాధించాడు.

ఎవరి ప్లేస్‌లో సంజుకి ఛాన్స్‌ వస్తుంది?

ఇటువంటి పరిస్థితిలో టీమిండియా తదుపరి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌ను డ్రాప్ చేసే ఛాన్స్ లేదు. మరి శాంసన్‌కి అవకాశం ఎలా వస్తుంది? బెంచ్‌పై కూర్చొని మరో సిరీస్ కూడా ఆడకుండానే ఉంటాడా? ఈసారి అది జరగకపోవచ్చని తెలుస్తోంది. దీనికి కారణం మొదటి మ్యాచ్‌లో శాంసన్ జెర్సీని ధరించి మైదానంలోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్‌పై వేటు పడనుంది. ఈసారి సంజు జెర్సీ మాత్రమే కాదు.. శాంసన్ కూడా మైదానంలోకి దిగడం చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

గత ఏడాది కాలంగా సూర్యకుమార్ యాదవ్‌ను వన్డే ఫార్మాట్‌లో జట్టులోకి తీసుకురావడానికి నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, టీ20 సూపర్‌స్టార్‌కు వన్డేల్లో నిరూపించుకోవడం కష్టంగా కనిపిస్తోంది. అతను వరుసగా 16 ఇన్నింగ్స్‌లలో పూర్తిగా విఫలమయ్యాడు. తొలి వన్డేలో 115 పరుగుల లక్ష్యం ఉంది. మూడో ర్యాంక్‌లో బరిలోకి దిగిన సూర్య కుమార్.. కేవలం19 పరుగులు మాత్రమే చేశాడు.

రెండో వన్డే నుంచి సూర్య ఔట్?

ఇలాంటి పరిస్థితుల్లో శాంసన్‌కు అవకాశం ఇచ్చే పరిస్థితి వచ్చిందని భావిస్తున్నారు. ఇటీవలి పనితీరు ఆధారంగా సూర్యకుమార్‌ను తప్పించాలి. 24 వన్డేల తర్వాత, సూర్య 23 సగటుతో 452 పరుగులు మాత్రమే చేశాడు. ఇదిలావుండగా, కెప్టెన్, కోచ్‌లు ఆటగాళ్లకు పూర్తి అవకాశాలు ఇవ్వాలని మాట్లాడుతున్నందున రెండవ మ్యాచ్‌లో కూడా సూర్యకు అవకాశం ఇచ్చే అవకాశం కూడా ఉంది.

మ్యాచ్ సమయం..

భారత్-వెస్టిండీస్ రెండో వన్డే మ్యాచ్ టాస్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు జరగనుంది. మ్యాచ్ 7.30కి ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌ను డీడీ స్పోర్ట్స్ ఛానెల్‌లలో చూడొచ్చు. అలాగే, మీరు ఫ్యాన్ కోడ్ యాప్, జియో సినిమాలలో ప్రత్యక్ష ప్రసారాన్ని చూడొచ్చు.

టీమ్ ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, ఉమ్రాన్ మాలిక్.

వెస్టిండీస్ జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్ (వైస్ కెప్టెన్), ఖైల్ మేయర్స్, అలిక్ అతానాజ్, కేసీ కార్తీ, షిమ్రాన్ హెట్మెర్, అల్జారీ జోసెఫ్, డొమినిక్ డ్రేక్స్, యానిక్ కారియా, గుడాకేష్ మోతీ, బ్రాండన్ కింగ్, కెవిన్ సింక్లెయిర్, ఒషానే థామస్ , రొమేరో షెపర్డ్, జేడెన్ సీల్స్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..