మందుబాబులకు కిక్కిచ్చే వార్త..! ఇప్పుడు చెక్కతో కూడా మద్యం తయారీ.. ఇంత సులువుగానా..

కొందరికి బీర్, కొందరికి విస్కీ, కొందరికి రమ్, కొందరికి వైన్, ఇంకొందరికి ఇంకేదో ఇష్టం. ఇలా మద్యంలో అనేక రకాలు, భిన్నమైన రుచ్చులతో ఉంటాయి. ద్రాక్ష, బియ్యం, బంగాళదుంపలు, చెరకు నుండి ఆల్కహాల్ తయారవుతుందని మీరు ఇప్పటి వరకు వినే ఉంటారు. అయితే, మీరు ఎప్పుడైనా చెక్కతో కూడా ఆల్కహాల్‌ను తయారు చేస్తారనే మాటాలు విన్నారా..? అవును.. ఇది నిజమే.. ఇప్పుడు చెక్కతో ఆల్కహాల్‌

మందుబాబులకు కిక్కిచ్చే వార్త..! ఇప్పుడు చెక్కతో కూడా మద్యం తయారీ.. ఇంత సులువుగానా..
Alcohol
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 05, 2023 | 1:09 PM

మన దగ్గర మందుప్రియులకు కొదువే లేదు. చాలా మందికి ఆల్కహాల్ అంటే చెప్పలేనంత ఇష్టం. కొందరికి బీర్, కొందరికి విస్కీ, కొందరికి రమ్, కొందరికి వైన్, ఇంకొందరికి ఇంకేదో ఇష్టం. ఇలా మద్యంలో అనేక రకాలు, భిన్నమైన రుచ్చులతో ఉంటాయి. ద్రాక్ష, బియ్యం, బంగాళదుంపలు, చెరకు నుండి ఆల్కహాల్ తయారవుతుందని మీరు ఇప్పటి వరకు వినే ఉంటారు. అయితే, మీరు ఎప్పుడైనా చెక్కతో కూడా ఆల్కహాల్‌ను తయారు చేస్తారనే మాటాలు విన్నారా..? అవును.. ఇది నిజమే.. ఇప్పుడు చెక్కతో ఆల్కహాల్‌ తయారు చేసే మార్గాన్ని పరిశోధకులు కనుగొన్నారు. జపాన్‌లోని కొందరు శాస్త్రవేత్తలు చెక్కతో కూడా ఆల్కహాల్‌ తయారు చెయ్యొచ్చు అంటున్నారు. జపాన్‌లోని సెడార్ అనే చెట్టు నుంచి ఆల్కహాల్ తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

జపాన్‌లోని ఒక ప్రదేశంలో 1600లో దేవదారు చెట్లను నాటారు. 1916 లో, ఈ చెట్టు నుండి ద్రవం రావడం గమనించారు.. ఈ ద్రవం తెలుపు రంగులో ఉంది. ఈ దేవదారు చెట్టు నుండి దాదాపు 35 లీటర్ల ద్రవం వచ్చింది. ఇప్పుడు పరిశోధకులు ఈ ద్రవం నుండి ఆల్కహాల్‌ను ఉత్పత్తి చేసే పద్ధతిని కనుగొన్నారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, మిథనాల్ మొదట దేవదారు, చెర్రీ చెట్ల నుండి వచ్చింది. ఈ మిథనాల్ తాగినంత శరీరానికి ఎలాంటి హాని కలిగించదు. పెయింట్స్, ప్లాస్టిక్స్ తయారీలో మిథనాల్ ఉపయోగిస్తారు. ఇది కాకుండా, ఇంధనం తయారీకి కూడా మిథనాల్‌ ఉపయోగిస్తారు.

ఓట్సుకా అనే జపాన్ నిపుణుడు చెట్ల నుండి ఆల్కహాల్ (ఇథనాల్) తయారు చేసే మార్గాన్ని కనుగొన్నాడు. బీర్, వోడ్కా, వైన్ ఇథనాల్ నుండి తయారు చేస్తారు. ఒట్సుకా చెక్క నుండి ఇథనాల్ పొందేందుకు ఒక ప్రత్యేక పద్ధతిని అవలంబించారు. ఒట్సుకా మొదట్లో చెక్కను పేస్ట్‌గా మార్చారు.. ఈ పేస్ట్‌కు ఎంజైమ్‌లు, ఈస్ట్‌ను కలపటం ద్వారా కిణ్వ ప్రక్రియ జరుగుతుంది. అప్పుడు ఒక ద్రవం ఏర్పడుతుంది, ఇందులో 15 శాతం ఆల్కహాల్ ఉంటుంది. సాధారణ పద్ధతిలో 3.75 శాతం ఆల్కహాల్ ఒక లీటరు ద్రవంలో ఉత్పత్తి అవుతుంది. ఇక ఇప్పుడు జపాన్‌లో కూడా కలపతో మద్యం తయారు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ..

చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు