MS Dhoni: రూటు మార్చిన ధోనీ.. యాక్షన్ మూవీతో హీరోగా ఎంట్రీ.. కీలక ప్రకటన చేసిన భార్య..
MS Dhoni Film: తన కెప్టెన్సీలో భారత్‌కు రెండు ప్రపంచకప్‌లను అందించిన వెటరన్ మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) ఇప్పుడు క్రికెట్‌ను వదిలి నటనలోకి అడుగుపెట్టవచ్చిన తెలుస్తోంది. అతను అనేక వాణిజ్య ప్రకటనలలో ఇప్పటికే కనిపించిన సంగతి తెలిసిందే. అనేక ప్రసిద్ధ బ్రాండ్‌లతో అనుబంధం కలిగి ఉన్నాడు. ఇప్పటి వరకు ధోనీ నటనను కేవలం ప్రకటనలలో చూసిన అభిమానులకు..
Mahendra Singh Dhoni Film: తన కెప్టెన్సీలో భారత్‌కు రెండు ప్రపంచకప్‌లను అందించిన వెటరన్ మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) ఇప్పుడు క్రికెట్‌ను వదిలి నటనలోకి అడుగుపెట్టవచ్చిన తెలుస్తోంది. అతను అనేక వాణిజ్య ప్రకటనలలో ఇప్పటికే కనిపించిన సంగతి తెలిసిందే. అనేక ప్రసిద్ధ బ్రాండ్‌లతో అనుబంధం కలిగి ఉన్నాడు. ఇప్పటి వరకు ధోనీ నటనను కేవలం ప్రకటనలలో చూసిన అభిమానులకు.. ఇకపై వెండితెరపైనా చూడొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ధోనీ భార్య సాక్షి తెలియజేసింది.
ధోనీ హీరోగా కనిపిస్తాడా?
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం తన ప్రొడక్షన్ హౌస్‌తో చర్చల్లో ఉన్నాడు. ఇటీవల, అతని భార్య సాక్షి ధోనిని విలేకరుల సమావేశంలో మహి తెరపై హీరోగా చూడొచ్చా అని ప్రశ్నించగా.. ఆమె మాట్లాడుతూ.. అభిమానులు ఖచ్చితంగా ఆ ఆనందాన్ని పొందవచ్చు అంటూ బదులిచ్చింది. ‘ఆ రోజు కోసం ఎదురుచూస్తాను. ఇదే జరిగితే ఆ క్షణం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మంచి పాత్ర వస్తే తప్పకుండా నటించగలడు’ అంటూ చెప్పుకొచ్చింది.
‘కెమెరా ముందు నేను సిగ్గుపడను’
మూడు ప్రధాన ICC ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక కెప్టెన్ భార్య మాట్లాడుతూ, ‘ధోని తన జీవితంలో చాలా యాడ్-షూట్‌లు చేశాడు. ఇకపై కెమెరా ముందు సిగ్గుపడడు. ఎలా నటించాలో అతనికి బాగా తెలుసు. అతను 2006 నుంచి కెమెరాను ఎదుర్కొంటున్నాడు. మంచి పాత్ర వస్తే తప్పకుండా నటించగలడు. ఆయన కోసం సినిమా ఎంచుకోవాల్సి వస్తే యాక్షన్ రోల్ ఎంచుకుంటాను’ అంటూ బదులిచ్చింది.
నిర్మాతగా సాక్షి..
ధోనీ భార్య సాక్షి నిర్మాతగా మారింది. ధోనీ ఫిలిమ్స్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించిన ‘లెట్స్ గెట్ మ్యారేడ్’ చిత్రం ‘ఎల్‌జీఎం’ కూడా విడుదలైంది. సాక్షి ధోని నిర్మాతగా రమేష్ తమిళ్మణి దర్శకత్వం వహించిన ద్విభాషా చిత్రం ఇది. ఈ చిత్రంలో హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా ప్రధాన పాత్రలు పోషించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..