AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: స్నేహమంటే ఇదేరా.. తన ఫ్రెండ్స్‌తో విదేశాల్లో గడపడానికి ఏకంగా ప్లైట్ బుక్ చేసిన యువకుడు..

నిజమైన స్నేహం పేద, ధనిక అనే తేడా చూడదని అంటారు. నిజమైన స్నేహితులు ఒకరి కోసం ఒకరు గా జీవిస్తుంటారు. తమ స్నేహితుడి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి ఒక సంఘటన  అమెరికాలో చోటు చేసుకుంది.

Viral News: స్నేహమంటే ఇదేరా.. తన ఫ్రెండ్స్‌తో విదేశాల్లో గడపడానికి ఏకంగా ప్లైట్ బుక్ చేసిన యువకుడు..
Trending Boy
Surya Kala
|

Updated on: Jul 28, 2023 | 10:26 AM

Share

ప్రపంచంలో అనేక మంది ధనవంతులున్నారు. కొందరు కష్టపడి.. ఆర్ధికంగా తమకంటూ ఓ సామ్రాజ్యాన్ని స్థాపించుకోగా.. మరికొందరు జన్మతః ధనవంతులు. కోట్లకు కోట్లకు యజమానులు సైతం సింపుల్ జీవితాన్ని ఇష్టపడరు. అదే సమయంలో కొందరు తరచుగా ప్రపంచాన్ని చుట్టేయ్యాలని భావిస్తారు. ఈ నేపదంలో కొందరు తమ ప్రైవేట్ విమానంలో ప్రయాణిస్తుండగా.. మరికొందరు ఇతర ప్రయాణీకులతో కలిసి వాణిజ్య విమానాలలో ప్రయాణిస్తారు. అయితే ప్రస్తుతం ఒక యువకుడు మొత్తం విమానాన్ని బుక్ చేసుకుని వార్తల్లో నిలుస్తుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. బాలుడి వయసు 16 ఏళ్లు మాత్రమే. ఆ బాలుడు  మొత్తం విమానం ఎందుకు బుక్ చేసాడో రీజన్ తెలిస్తే వావ్ అని అంటారు. అంతేకాదు హృదయాన్ని సంతోషపరుస్తుంది.

నిజమైన స్నేహం పేద, ధనిక అనే తేడా చూడదని అంటారు. నిజమైన స్నేహితులు ఒకరి కోసం ఒకరు గా జీవిస్తుంటారు. తమ స్నేహితుడి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి ఒక సంఘటన  అమెరికాలో చోటు చేసుకుంది. కేవలం 16 ఏళ్ల కుర్రాడు తన స్నేహితులతో కాలక్షేపం చేయడానికి మొత్తం విమానాన్ని బుక్ చేశాడు. అతను తన స్నేహితులతో కలిసి బహామాస్‌ను సందర్శించడానికి విమానం బుక్ చేసుకున్నట్లు పేర్కొంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లో ఒక వీడియోను పంచుకున్నాడు. అంతేకాదు ఆ యువకుడు ‘అమెరికాలో అత్యంత ధనవంతుడు’ అని కూడా పేర్కొన్నాడు.

విలాసవంతమైన జీవనశైలి  ది సన్ కథనం ప్రకారం ఆ యువకుడు పేరు డోనాల్డ్. అతను తనను తాను యూట్యూబర్ అని పేర్కొంటారు.  ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చాలా చురుకుగా ఉంటాడు. అతడు తన విలాసవంతమైన జీవనశైలి కనిపించే వివిధ చిత్రాలు, వీడియోలను పంచుకుంటూ ఉంటాడు. ఇన్‌స్టాలో డోనాల్డ్ కు రెండున్నర లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

నెటిజన్ల రియాక్షన్స్  నివేదికల ప్రకారం టిక్‌టాక్‌ ప్లాట్ ఫామ్ లో వీడియోను షేర్ చేసిన వెంటనే చాలా మంది డోనాల్డ్‌ను చాలామంది ట్రోల్ చేశారు. అయితే చాలా మంది విమానాన్ని కొనుగోలు చేయమని సలహా ఇచ్చారు. ఒక రోజు ప్రయాణానికి ఇంత డబ్బు ఖర్చు చేయడం సరికాదని ఒకరు కామెంట్ చేస్తే.. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని మరొకరు ప్రశ్నించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..