Viral Video: రోడ్డు మీద నిద్రిస్తున్న తల్లికొడుకు.. మహిళ ముఖంపై నుంచి వెళ్లిన కారు.. షాకింగ్ వీడియో వైరల్

ఈ ఘటన వీడియోలో చూడవచ్చు. అయితే ముందు చక్రం మహిళ మీద నుంచి వెళ్లిన తర్వాత.. కారు డ్రైవర్ తన కారుని ఆపి.. ఆమెకు ఏదైనా జరిగిందా అని చూడటం ప్రారంభించాడు. అయితే మహిళ చిన్నారిపై నుంచి కారు వెళ్లకపోవడం గమనించదగిన విషయం. లేకుంటే అక్కడ పెను ప్రమాదం జరిగి ఉండేది.

Viral Video: రోడ్డు మీద నిద్రిస్తున్న తల్లికొడుకు.. మహిళ ముఖంపై నుంచి వెళ్లిన కారు.. షాకింగ్ వీడియో వైరల్
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jul 23, 2023 | 6:11 PM

‘హిట్ అండ్ రన్’ కేసులు తరచుగా తెరపైకి వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు భారతదేశం నుండి..  కొన్నిసార్లు విదేశాల నుండి.. రోడ్డు యాక్సిడెంట్స్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అవి హృదయాన్ని కదిలిస్తాయి. అంతేకాదు పొరపాటున ఇతరులను ఢీ కొట్టడం లేదా వారి శరీరంపై ఎక్కించడం తరువాత తాము చేసిన దానికి పశ్చాత్తాపం చెందడం కూడా అనేక సార్లు కనిపిస్తుంది. ప్రస్తుతం హిట్ అండ్ రన్ కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది  చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా గూస్‌బంప్స్ పొందుతారు.

వాస్తవానికి రోడ్డు పక్కన నిద్రిస్తున్న తల్లీ కొడుకులపైకి ఓ కారు డ్రైవర్ వాహనం నడిపి, ఆ మహిళకు ఏమైనా జరిగిందో లేదో చూసేందుకు కారులో నుంచి కిందకు దిగాడు. ఓ మహిళ తన బిడ్డతో కలిసి ఓ దుకాణం ముందు రోడ్డు పక్కన హాయిగా నిద్రిస్తుండగా.. ఓ కారు రోడ్డుమీద నుంచి వెళ్తూ.. నిద్రిస్తున్న మహిళపై నుంచి దూసుకెళ్ళింది. ఈ ఘటన వీడియోలో చూడవచ్చు. అయితే ముందు చక్రం మహిళ మీద నుంచి వెళ్లిన తర్వాత.. కారు డ్రైవర్ తన కారుని ఆపి.. ఆమెకు ఏదైనా జరిగిందా అని చూడటం ప్రారంభించాడు. అయితే మహిళ చిన్నారిపై నుంచి కారు వెళ్లకపోవడం గమనించదగిన విషయం. లేకుంటే అక్కడ పెను ప్రమాదం జరిగి ఉండేది. ఆ మహిళపై నుంచి కారు వెళ్లినా.. ఆమె అదృష్టవంతురాలు.. ఆమెకు ఎటువంటి ప్రమాదం జరగలేదు.. లక్కీగా ప్రాణాలతో ఉంది.

ఇవి కూడా చదవండి

హృదయాన్ని కదిలించే ఈ వీడియో @crazyclipsonly అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. కేవలం 16 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 15 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోగా..  80 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు.

అదే సమయంలో ఈ ప్రమాదాన్ని చూసి ప్రజలు భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ ఘటన పై కొందరు  మహిళ చేసింది తప్పు అని అంటున్నారు. అసలు వారు ఎందుకు రోడ్డుమీద నిద్రపోవాలని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు కారు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై నిద్రిస్తున్న వారిని చూడని డ్రైవర్ ను నిందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..