Mysterious Postcard: 54 ఏళ్ల తర్వాత సరైన చిరునామాకు చేరిన పోస్ట్ కార్డు .. దీని ప్రయాణం చాలా ఆసక్తికరం..

ఈ పోస్ట్‌కార్డ్‌ను జెస్సికా మీన్స్ అనే మహిళ అందుకుంది. జెస్సికా గత సోమవారం తన మెయిల్‌బాక్స్‌ని తెరిచి చూసినప్పుడు ఒక పోస్ట్ కార్డు కనిపించింది. ఇది చనిపోయి 30 సంవత్సరాలకు పైగా ఉన్న వ్యక్తికి సంబంధించిన కార్డు అని జెస్సికా చెప్పారు.

Mysterious Postcard: 54 ఏళ్ల తర్వాత సరైన చిరునామాకు చేరిన పోస్ట్ కార్డు .. దీని ప్రయాణం చాలా ఆసక్తికరం..
Mysterious Postcard
Follow us

|

Updated on: Jul 22, 2023 | 5:31 PM

కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందింది. ప్రపంచం మొత్తం ఇప్పుడు క్షణాల్లో అరచేతుల్లో దర్శనం ఇస్తుంది. తమ చేతిలోని స్మార్ట్ ఫోన్ల ద్వారా ప్రపంచాన్ని చూస్తున్నారు. ఎవరు ఎక్కడ ఉన్నా మాట్లాడుతున్నారు. తమ భావాలను ఇతరులకు క్షణాల్లో చేరవేస్తున్నారు. అయితే మొబైల్ ఫోన్లు అందుబాటులో లేని కొన్ని ఏళ్ల క్రితం వరకూ తమ భావాలను, తమ క్షేమ సమాచారాన్ని పోస్టు కార్డులను ఉపయోగించి అక్షరాల ద్వారా తెలియజేసేవారు. ఉత్తరాలను ఉపయోగించే కాలంలో ప్రపంచంలోని నలుమూలల నుండి ప్రజలు తమ సన్నిహితులకు, స్నేహితులకు, ప్రియమైనవారికి పోస్ట్‌కార్డ్‌లు పంపేవారు. తమ పరిస్థితిని తమవారికి తెలియజేసేవారు. అంతేకాదు ప్రియమైన వారి నుండి శుభవార్తలను ఆశించేవారు. సాధారణంగా పోస్ట్‌కార్డ్‌లు కొన్ని రోజుల్లో తమ గమ్యాన్ని చేరుకునేవి. అయితే ప్రస్తుతం ఒక పోస్ట్ కార్డుకు సంబంధించిన ఒక పోస్ట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ పోస్ట్ కార్డు 54 సంవత్సరాల తర్వాత గమ్యాన్ని చేరుకుంది. తన గమ్య స్థానానికి చేరుకోవడానికి ఆ పోస్ట్ కార్డు చేసిన ప్రయాణం కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

బంగోర్ డైలీ న్యూస్ కథనం ప్రకారం.. ఈ పోస్ట్‌కార్డ్‌ను జెస్సికా మీన్స్ అనే మహిళ అందుకుంది. జెస్సికా గత సోమవారం తన మెయిల్‌బాక్స్‌ని తెరిచి చూసినప్పుడు ఒక పోస్ట్ కార్డు కనిపించింది. ఇది చనిపోయి 30 సంవత్సరాలకు పైగా ఉన్న వ్యక్తికి సంబంధించిన కార్డు అని జెస్సికా చెప్పారు. ఈ పోస్ట్‌కార్డ్ 1969 సంవత్సరంలో పారిస్ నుండి పంపించారు. అప్పుడు పోస్ట్ చేసిన లెటర్ 54 సంవత్సరాల తర్వాత అంటే 2023లో సరైన చిరునామాకు (పోర్ట్‌ల్యాండ్) చేరుకుంది.

చనిపోయిన వ్యక్తి పేరు మీద పోస్ట్‌కార్డు  జెస్సికా మాట్లాడుతూ  ‘మొదట ఈ పోస్ట్‌కార్డ్ తన పొరుగువారిలో ఎవరికోసమైనా వచ్చి ఉంటుందని తాను భావించినట్లు చెప్పింది. అయితే కార్డు మీద ఉన్న అడ్రెస్ .. పేరు చూసి. తన అసలు ఇంటి యాజమానిది అని తాను గ్రహించినట్లు చెప్పింది. పోస్ట్‌కార్డ్ ను మిస్టర్ అండ్ మిసెస్ రెనే ఎ. గగ్నన్ అనేవారు..  రాయ్ అనే పేరుతో పంపించినట్లు చెప్పింది.

ఇవి కూడా చదవండి

ఈఫిల్ టవర్ నుండి వచ్చిన పోస్ట్ కార్డు  ఈ పోస్ట్‌కార్డ్‌లో రాసిన విషయాన్నీ జెస్సికా వెల్లడించింది కూడా.. మీకు ఈ కార్డు చేరే సమయానికి నేను ఇంటి కి వచ్చేస్తాను.. నేను ప్రస్తుతం ఈఫిల్ టవర్ దగ్గర ఉన్నాను.. అయితే నా క్షేమ సమాచారంతో మీకు లెటర్ పంపించడం సముచితమని భావించి ఈ ఉత్తరం రాస్తున్నాను.. అయితే పారిస్ లో ఇంకా చాలా చూడాల్సినవి ఉన్నాయని.. అవి ఇప్పటి వరకూ చూసే అవకాశం రాలేదని చెప్పారు. అయితే మేము ఇప్పటి వరకూ చూసిన వాటిని ఆస్వాదిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ పోస్ట్‌కార్డ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ లెటర్ పై ప్రజలు భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ పోస్ట్ కార్డు ప్రయాణం కథ చాలా బాగుందని కొందరు చెబుతుండగా, కొందరు యూజర్లు తమ స్నేహితులను కూడా పోస్ట్‌లో ట్యాగ్ చేశారు. ఈ పోస్ట్‌కార్డ్ ఎవరి కోసం వ్రాయబడిందో అతనికి తెలిసి ఉండవచ్చని ఆశతో ఇలా చేస్తున్నామని కొందరు పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..