- Telugu News Photo Gallery Viral photos Now scientists say climate change is making us blind says new research
Climate Change: మనిషి చేస్తున్న పనులతో ప్రకృతి కన్నెర్ర.. పెరుగుతున్న ఉష్ణోగ్రతతో ప్రమాదంలో కంటి చూపు..
వాతావరణ మార్పు మనిషి దృష్టిపై చెడు ప్రభావాన్ని చూపుతోంది. ఇదే విషయంపై అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 1.7 మిలియన్ల మందిపై జరిపిన పరిశోధనలో వెల్లడైందని శాస్త్రజ్ఞులు చెప్పారు.
Updated on: Jul 10, 2023 | 11:25 AM

మానవ తప్పిదాలతో పర్యావరణంలో పెను మార్పులు వస్తున్నాయి. కాలాలు మారుతున్నాయి. రోజు రోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అయితే ఇలా ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మనుషులను అంధులను చేస్తున్నాయి. ఇటీవలి పరిశోధనలో ఈ విషయం వెల్లడైందని కెనడియన్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అమెరికాలోని 50 రాష్ట్రాల్లోని 1.7 మిలియన్ల మందిపై జరిపిన పరిశోధనలో వాతావరణ మార్పులు మనిషి చూపుపై చెడు ప్రభావాన్ని చూపుతోందని వెల్లడైంది. పరిశోధనలో శాస్త్రవేత్తలు వేడి ఉష్ణోగ్రతలో నివసించే ప్రజలపై ఉష్ణోగ్రత గరిష్ట ప్రభావం ఎలా కనిపిస్తుందో చెప్పారు.

శీతల ప్రదేశాలతో పోలిస్తే వేడి ప్రాంతాల్లో నివసించే వారిలో 50 శాతం మంది కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు పరిశోధనలో తేలిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి సాధారణ కారణం సూర్యుడి నుండి భూమికి వచ్చే అతినీలలోహిత కిరణాలు. ఇవి కంటిలోని కార్నియా, లెన్స్, రెటీనాను దెబ్బతీస్తున్నాయి. అంతేకాదు కళ్లు దురద, ఇన్ఫెక్షన్ కలిగి ఇబ్బంది పడతారు.

దీంతో పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ఇదే అనేక ప్రమాదాలను సృష్టిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.1 సెల్సియస్‌కు చేరుకుంది. గ్లోబల్ టెంపరేచర్ మరింత పెరిగే అవకాశం ఉందని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన యూనివర్సిటీ ఆఫ్ టొరంటో పరిశోధకుడు ఎస్మే ఫుల్లర్ థామ్సన్ చెప్పారు. అటువంటి పరిస్థితిలో వృద్ధుల కంటి సమస్య మరింత పెరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పరిశోధకుడు థామ్సన్ మాట్లాడుతూ తగ్గుతున్న కంటి చూపుకి సగటు ఉష్ణోగ్రత మధ్య ఉన్న సంబంధం ఆశ్చర్యకరమైనదని చెబుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఆందోళన పెరుగుతున్నది. జర్నల్ ఆఫ్తాల్మిక్ ఎపిడెమియాలజీలో ప్రచురించిన పరిశోధన ప్రకారం, ఈ అధ్యయనంలో 2012 నుండి 2017 వరకు 65 ఏళ్ల వయస్సు ఉన్నవారి డేటా ఉంది. అంతే కాదు పరిశోధనలో పాల్గొన్న వ్యక్తుల నుంచి కంటి దృష్టిపై సమాచారాన్ని తీసుకున్నారు. కొందరికి కంటి అద్దాలు పెట్టుకున్నాచూపు తగ్గడం, వెలుతురు తగ్గడం గమనించారు.

తాజా పరిస్థితిలో అనేక కంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కంటి శుక్లాలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. కంటి లెన్స్ అస్పష్టంగా కనిపిస్తాయి. ఈ వ్యాధి అంధుడిని చేస్తుంది. అంతేకాదు గ్లకోమా ప్రమాదం కూడా ఉందని కళ్ళ ఆప్టిక్ నరం దెబ్బతింటుంది. న్యూయార్క్ లాంటి ప్రాంతాల్లో రిస్క్ తక్కువగా ఉందని పరిశోధనలో తేలింది. అదే సమయంలో ఫ్లోరిడా, టెక్సాస్, జార్జియా వంటి అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాలలో దీని ప్రమాదం ఎక్కువగా ఉందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.





























