Chanakya Niti: ఉదయం లేవగానే ఈ వస్తువులను అస్సలు చూడొద్దు.. చాణక్యుడు చెప్పిన సీక్రెట్స్..
మన రోజు మొత్తం ఎలా ఉండాలనేది మనం ఉదయాన్ని ఎలా ప్రారంభిస్తాం అనే దానిపై ఆధారపడి ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. రోజును సానుకూల ఆలోచనలతో మొదలుపెడితే అంతా మంచే జరుగుతుందని, అదే ప్రతికూలతతో ప్రారంభిస్తే రోజంతా పాడవుతుందని నమ్మకం. ఈ విషయమై ఆచార్య చాణక్యుడు కూడా తన నీతి శాస్త్రంలో ముఖ్యమైన విషయాలను చెప్పాడు. చాణక్యుడి ప్రకారం.. మనం రోజు మొత్తం ఉత్సాహంగా, ప్రశాంతంగా ఉండాలంటే, ఉదయం నిద్ర లేచిన వెంటనే కొన్ని విషయాలను తప్పక చూడకూడదు. ఆ విషయాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం
Updated on: Dec 04, 2025 | 10:15 PM

అద్దం వైపు చూడొద్దు: చాణక్యుడి సూచన ప్రకారం.. ఉదయం నిద్రలేచిన వెంటనే అద్దం వైపు చూడకూడదు. ఈ విధంగా చూడటం వలన ప్రతికూల భావోద్వేగాలు మనసులోకి ప్రవేశిస్తాయి. ఇది మీ మొత్తం రోజును నాశనం చేస్తుంది. నిద్రలేచిన తర్వాత మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రశాంతతను కాపాడుకోవాలని చాణక్యుడు అంటాడు.

ప్రతికూల వ్యక్తి: నిరంతరం కోపంగా ఉంటూ ప్రతికూలతను వ్యాప్తి చేసే వ్యక్తులను ఉదయం లేవగానే చూడటం మంచిది కాదు. ఉదయం మీ మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు అలాంటి వ్యక్తిని చూస్తే మనస్సు చిరాకు పడుతుంది. ఇది రోజంతా పాడు చేస్తుంది. సానుకూల వ్యక్తులతోనే రోజును ప్రారంభించాలని చాణక్య నీతి చెబుతుంది.

పోరాటాలు, తగాదాలు: ఉదయం వేళ మనం చూసే విషయాలు మన మనస్సుపై లోతైన ప్రభావాన్ని చూపుతాయి. నిద్ర లేచిన వెంటనే తగాదాలు, వాదనలు జరుగుతున్న దృశ్యాలను చూస్తే.. మీ మనస్సు పూర్తిగా కలవరపడుతుంది. దీంతో మీరు చేయబోయే ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టలేక విఫలమయ్యే అవకాశం ఉంది.

గజిబిజిగా వస్తువులు: మురికిగా ఉన్న గది, చిందరవందరగా పడి ఉన్న వస్తువులు లేదా చెల్లాచెదురుగా ఉన్న ప్రదేశాలను ఉదయం చూడటం కూడా మంచిది కాదు. ఇలాంటి వాతావరణాన్ని చూడటం వల్ల మనస్సు కలవరపడుతుంది. రోజంతా సానుకూల దృక్పథాన్ని కొనసాగించాలనుకుంటే, ఉదయం పరిశుభ్రమైన, క్రమబద్ధమైన వాతావరణాన్ని చూడటం మేలు.

సోమరితనం ఉన్నవారితో: ఉదయం అనేది సానుకూల శక్తి, ఉత్సాహం ఉండే సమయం. అటువంటి సమయంలో నిద్రపోతున్న లేదా సోమరితనం ఉన్నవారిని చూస్తే వారి నెగెటివ్ వైబ్స్ మీ శక్తిని కూడా బలహీనపరుస్తాయి. అందుకే శక్తిని నింపే అంశాలు, వ్యక్తులతో రోజును ప్రారంభించాలని ఆచార్య చాణక్యుడు సూచిస్తున్నాడు. ఈ చిట్కాలను పాటించడం ద్వారా ప్రతి ఒక్కరూ తమ రోజును ప్రశాంతంగా విజయవంతంగా ముగించవచ్చని చాణక్య నీతి చెబుతోంది.




