Viral News: 3 ఏళ్ల కొడుకుని చంపేందుకు ప్లాన్ చేసిన తల్లి.. కిల్లర్ కోసం ఆన్ లైన్‌లోనే సెర్చ్..

తన తనయుడిని చంపేందుకు ఆ తల్లే ప్లాన్ కూడా చెప్పింది. తన కొడుకు అమ్మమ్మ దగ్గరే ఉంటున్నాడని  మహిళ చిన్నారి ఫోటో, తన పుట్టినిల్లు అడ్రెస్, అమ్మమ్మ మొబైల్ నంబర్‌ను ఇచ్చింది. వెబ్‌సైట్‌ను నడుపుతున్న ఒక వ్యక్తి ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు.

Viral News: 3 ఏళ్ల కొడుకుని చంపేందుకు ప్లాన్ చేసిన తల్లి.. కిల్లర్ కోసం ఆన్ లైన్‌లోనే సెర్చ్..
Miami Mother
Follow us
Surya Kala

|

Updated on: Jul 21, 2023 | 3:43 PM

అమెరికాలో ఓ తల్లి తన సొంత కుమారుడిని చంపేందుకు కిల్లర్ ను నియమించుకుంది. ఫ్లోరిడాలోని మయామిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. 18 ఏళ్ల యువతి తన మూడేళ్ల కొడుకును చంపడానికి ప్రయత్నించింది. ఆ చిన్నారిని చంపించడానికి ఆ మహిళ హిట్ ఫర్ హైర్ వెబ్‌సైట్‌కి వెళ్లి కిల్లర్ తో  ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నించింది. ఈ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.  అయితే వాస్తవానికి మయామి మొదట తన బిడ్డను చంపేందుకు ప్రయత్నించినట్లు అనుమానిస్తున్నారు. అయితే ఆ ప్రయత్నం సక్సెస్ అవ్వకపోవడంతో.. తన పిల్లాడిని చంపడానికి ఒక కిల్లర్ ను ఎంచుకుంది. ఈ విషయం వెలుగులోకి వచ్చిన 18 ఏళ్ల తల్లిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, ఆమె తన నేరాన్ని అంగీకరించింది. తన కుమారుడిని చాలా దూరం, దూరంగా తీసుకెళ్లి… వీలైనంత త్వరగా చంపేయాలని తాను కోరుతున్నానని ఆ మహిళ కోర్టుకు తెలిపింది. ఇందుకోసం మూడు వేల డాలర్లు చెల్లించేందుకు ఆ మహిళ సిద్ధంగా ఉన్నట్లు మియామీ పోలీసులు తెలిపారు.

సోషల్ మీడియాలో పోస్ట్  

నిజానికి ఆ యువతి హిట్-ఫర్-హైర్ వెబ్‌సైట్‌లో “ఒకసారి .. తాను ఏదైనా చేయాలనుకుంటున్నాను” ఒక కిల్లర్ కావాలని అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది. అంతేకాదు తన కొడుకు ఫోటోను కూడా పోస్ట్ కి జత చేసింది. తన తనయుడిని చంపేందుకు ఆ తల్లే ప్లాన్ కూడా చెప్పింది. తన కొడుకు అమ్మమ్మ దగ్గరే ఉంటున్నాడని  మహిళ చిన్నారి ఫోటో, తన పుట్టినిల్లు అడ్రెస్, అమ్మమ్మ మొబైల్ నంబర్‌ను ఇచ్చింది. వెబ్‌సైట్‌ను నడుపుతున్న ఒక వ్యక్తి ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. ఆ యువతి ఐపి అడ్రస్ ను కూడా ట్రాక్ చేసి పోలీసులకు తెలిపాడు

ఇవి కూడా చదవండి

యువతికి కోర్టు $15,000 జరిమానా 

అయితే చిన్నారిని చంపించాలనుకున్న కసాయి తల్లి పేరు వెల్లడించలేదు పోలీసులు. చిన్నారి అమ్మమ్మతో డిటెక్టివ్‌లు మాట్లాడగా.. రెండు నెలల క్రితమే ఆ బాలుడి తల్లి ఇల్లు వదిలి వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఆ యువతి తన బిడ్డను ద్వేషిస్తుంది. మంగళవారం ఆ మహిళను ఆమె తండ్రి ఇంటిలో అరెస్టు చేశారు. ఆ యువతి తన నేరాన్ని అంగీకరించింది. తనకు ఎలాంటి మానసిక సమస్యలూ లేవని ఆ మహిళ కోర్టుకు తెలిపింది. ఆ మహిళకు కోర్టు $15,000 జరిమానా విధించి..  గురువారం విడుదల చేసింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే