Watch: అరుదైన పింక్ డాల్ఫిన్.. తీరంలో సందడి చేసిన వీడియో వైరల్
20 ఏళ్లకు పైగా చేపల వేట సాగిస్తున్నఓ వ్యక్తి రోజూ మాదిరిగానే చేపల వేట కోసం వెళ్లాడు. సాగర తీరంలో ఈ అరుదైన పింక్ డాల్ఫిన్ ను గుర్తించిన అతడు.. వెంటనే దాన్ని వీడియో తీశాడు. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు జాలరి పంట పడిందంటూ ట్విట్లు, కామెంట్లు చేస్తున్నారు.
అరుదైన పింక్ డాల్ఫిన్ గత వారం లూసియానా తీరంలో గల్ఫ్ ఆఫ్ మెక్సికో జలాలను అలంకరించింది. 20 ఏళ్లకు పైగా చేపల వేట సాగిస్తున్న థుర్మాన్ గస్టిన్ అనే వ్యక్తి ఈ అరుదైన పింక్ డాల్ఫిన్ ను గుర్తించి వీడియో తీశాడు. వాస్తవానికి, జూలై 12న గల్ఫ్ ఆఫ్ మెక్సికో సమీపంలోని కామెరాన్ పారిష్‌లో రెండు పింక్ డాల్ఫిన్‌లను గుస్టిన్ గుర్తించారు. ఆ తర్వాత ఈ క్లోప్‌ని సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది.
ఈ నేపథ్యంలో గుస్టిన్ మాట్లాడుతూ, తాము గత 20ఏళ్లకు పైగా చేపల వేట సాగిస్తున్నామని చెప్పాడు. లూసియానాలో గల్ఫ్ ఆఫ్ మెక్సికో వరకు ప్రవహించే ఛానెల్‌కు సమీపంలో వారు చేపట వేట సాగిస్తుంటామని చెప్పాడు. అయితే, ఈ క్రమంలోనే నీటి అడుగున అతి పెద్ద డాల్ఫిన్‌ని గుర్తించినట్టుగా చెప్పారు. దానికి సరైన రంగు లేదని చెప్పారు. మొదట నమ్మలేకపోయానని చెప్పాడు. వెంటనే తన కెమెరా తీసి ఆ అరుదైన దృశ్యాన్ని వీడియో తీసినట్టుగా వివరించాడు. కాసేపటి తర్వాత, అది పడవకు దగ్గరగా వచ్చింది.
గుస్టిన్ తన ఉత్సాహాన్ని మరింత వ్యక్తం చేస్తూ, తాను దాదాపు 20 సంవత్సరాలుగా చేపలు పట్టడం ప్రారంభించానని, అయితే పింక్ డాల్ఫిన్‌ను గుర్తించడం ఇదే మొదటిసారి అని చెప్పాడు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..