Indian Railways: రైలు ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై రూ.20 లకే భోజనం.. రూ.3 లకే తాగునీరు..

సాధారణంగా మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లతో సహా ప్రతి రైలులో ఇంజిన్ దగ్గర కనీసం 2 జనరల్ కోచ్‌లు ఉంటాయి. రైలు చివరిలో ఒకటి ఉంటాయి. కౌంటర్‌లో కొనుగోలు చేసిన జనరల్/అన్‌రిజర్వ్‌డ్ టికెట్ ఉన్న ఎవరైనా ఆ కంపార్ట్‌మెంట్లలో ప్రయాణించవచ్చు. IRCTC క్యాటరింగ్ యూనిట్ల నుండి భోజనం అందించాలని రైల్వే శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Indian Railways: రైలు ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై రూ.20 లకే భోజనం.. రూ.3 లకే తాగునీరు..
Indian Railways
Follow us

|

Updated on: Jul 20, 2023 | 9:06 PM

రైలు ప్రయాణికులకు శుభవార్త. సాధారణ కోచ్ ప్రయాణికులకు ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్రత్యేకించి సరసమైన ధరలకు భోజనం, ప్యాకేజ్డ్ వాటర్ అందించాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. రైల్వే బోర్డు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, సాధారణ కోచ్‌లకు సంబంధించిన ప్లాట్‌ఫారమ్‌లపై ఈ భోజనాన్ని అందించే కౌంటర్లు ఏర్పాటు చేయనుంది. దీంతో రైలు రెగ్యులర్ కోచ్‌లో ప్రయాణించే వ్యక్తులు ఆహారం, పానీయాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పై జనరల్ క్యారేజ్ ముందు ‘ఎకానమీ మీల్స్’ స్టాల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు భారతీయ రైల్వే శాఖ తెలిపింది. సాధారణ కోచ్‌లలో ప్రయాణించే వారు ఆహారం, తాగునీటి కోసం స్టేషన్‌ చుట్టూ తిరగాల్సి వస్తోంది. అందుకే ప్రయాణికులకు ఎకానమీ ధరలకే భోజనం, స్నాక్స్ అందించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించి జూన్ 27న రైల్వే బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. జనరల్ కోచ్‌ల దగ్గర ప్లాట్‌ఫారమ్‌పై ఎకానమీ భోజనం, స్నాక్స్ అందించాలని జారీ చేసిన లేఖలో సూచించారు. ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లు తెరుస్తున్నామని, జోనల్ రైల్వే ద్వారా లొకేషన్ నిర్ణయిస్తామని స్పష్టం చేసింది రైల్వే శాఖ.

రైల్వే శాఖ నిర్ణయించిన క్యాటరింగ్ ధర ప్రకారం ప్రయాణికులకు 7 పూరీలు, 150 గ్రాముల కూరగాయలు, ఊరగాయ ప్యాకెట్ రూ.20కి లభిస్తాయి. ఇక్కడ 2 రకాల ఆహారం అందుబాటులో ఉంటుంది. భోజనం టైప్ 1లో రూ.20కి 7 పూరీలు, కూరగాయలు, పచ్చళ్లు ఉంటాయి. టైప్ 2 భోజనం కోసం రూ 50లుగా ఉండనుంది. ఇందులో మీకు 350 గ్రాముల స్నాక్స్, భోజనం లభిస్తుంది. 50 రూపాయల అల్పాహారం కోసం మీరు రాజ్మా-రైస్, ఖిచ్డీ, చోలే కుల్చే, చోలే భాతురే, పావ్ భాజీ లేదా మసాలా దోస అందిస్తారు. అంతేకాకుండా రూ.3కే 200ఎంఎం ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అందుబాటులో ఉంటుంది.

GS కోచ్‌లు సాధారణ సీటు కోచ్‌ని సూచిస్తాయి. ఇది 2వ తరగతి అన్‌రిజర్వ్‌డ్ కోచ్. సాధారణంగా మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లతో సహా ప్రతి రైలులో ఇంజిన్ దగ్గర కనీసం 2 జనరల్ కోచ్‌లు ఉంటాయి. రైలు చివరిలో ఒకటి ఉంటాయి. కౌంటర్‌లో కొనుగోలు చేసిన జనరల్/అన్‌రిజర్వ్‌డ్ టికెట్ ఉన్న ఎవరైనా ఆ కంపార్ట్‌మెంట్లలో ప్రయాణించవచ్చు. IRCTC క్యాటరింగ్ యూనిట్ల నుండి భోజనం అందించాలని రైల్వే శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

IRCTC అన్ని స్టాల్స్, ప్యాంట్రీ కార్లు 1 లీటర్ రైల్ వాటర్ బాటిల్‌ను రూ. 15కి మాత్రమే విక్రయిస్తామని ప్రకటించాయి. అదనపు ఛార్జీల విషయంలో, ప్రయాణికులు ఏదైనా స్టేషన్‌లో లేదంటే ఆన్‌లైన్‌లో ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..