AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి టీడీపీ ఇన్చార్జి తిక్కా రెడ్డి మధ్య మాటల యుద్ధం.. భూ కబ్జాలపై పరస్పర విమర్శలు

కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యే, టిడిపి ఇన్చార్జి మధ్య భూ కబ్జా ఆరోపణలు హాట్ టాపిక్ అయ్యాయి. నువ్వు ప్రభుత్వ భూములు కబ్జా చేసావు అంటే, కాదు నువ్వే బియ్యం స్కాం లో జైలుకు వెళ్లి వచ్చావు అంటూ ఇరువురు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి టీడీపీ ఇన్చార్జి తిక్కా రెడ్డి మధ్య మాటల యుద్ధం.. భూ కబ్జాలపై పరస్పర విమర్శలు
Y Balanagi Reddy And Tikka
J Y Nagi Reddy
| Edited By: Jyothi Gadda|

Updated on: Jul 20, 2023 | 7:21 PM

Share

కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి టిడిపి ఇన్చార్జి తిక్కారెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కౌతాళం మండలం ఎరిగేరి గ్రామంలో సర్వేనెంబర్ 259 లో 10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది రోడ్డు పక్కనే ఉండటంతో మంచి ధర పలుకుతుంది. 50 సెంట్లు అక్రమాలకు గురైంది. మిగతా 9: 50 ఎకరాలలో 2006లో అప్పటి ఆదోని ఎమ్మెల్యే , బాల్ నాగిరెడ్డి అన్న సాయి ప్రసాద్ రెడ్డి పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఆ తర్వాత పునర్విభజనలో భాగంగా కౌతాళం మండలం ఆదోని నుంచి కొత్తగా ఏర్పడిన మంత్రాలయం నియోజకవర్గంలో చేరింది.

ప్రస్తుతం మంత్రాలయం ఎమ్మెల్యేగా బాలనాగిరెడ్డి, ఆదోని ఎమ్మెల్యేగా సాయి ప్రసాద్ రెడ్డి ఉన్నారు వీరిద్దరూ స్వయాన సోదరులు. 2006లో పట్టాలు ఇచ్చినప్పటికీ ఎవరు పొజిషన్ లోకి రాలేదు ఇల్లు కట్టుకోలేదు. దీంతో ప్లాట్లు వేసి విక్రయించేందుకు కొందరు భూమిని చదును చేశారు. ప్లాట్లుగా విక్రయించేందుకు ప్రయత్నం చేశారు. దీని వెనుక ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఉన్నారని మంత్రాలయం టిడిపి ఇన్చార్జి తిక్కారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అన్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే, తమ్ముడు లాక్కుని విక్రయిస్తున్నారని స్వయానా భూమిలోకి వెళ్లి తిక్కా రెడ్డి ఆరోపణలు చేశారు.

దీనిపై ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి స్పందించారు. అన్న సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గా పట్టాలు ఇచ్చిన విషయం వాస్తవమేనని, అయితే ఇంతవరకు ఎవరు ఇల్లు కట్టుకోలేదని అన్నారు, ఈ భూములు తామే కబ్జా చేశామని తిక్కారెడ్డి చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. పేదలకు ఇచ్చిన పట్టాలను భూములను తిరిగి వారికే పంచుతామని తాము ఆక్రమించుకోవాల్సిన అవసరం లేదని బాలనాగిరెడ్డి వివరణ ఇచ్చారు. బియ్యం స్కామ్ లో జైలుకు వెళ్లి వచ్చిన తిక్క రెడ్డి నాపై ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మొత్తం మీద గత కొంతకాలంగా 10 కోట్లకు పైగా విలువైన 10 ఎకరాల ప్రభుత్వ భూమిపై ఉత్కంఠ వీడింది. 10 ఎకరాలలో పేదలకు పట్టాలు ఇస్తానని ఎమ్మెల్యే చెప్పడంతో ఎమ్మెల్యే, ఇన్చార్జి మధ్య ఇంతటితో విమర్శలు ఆగుతాయా లేక మరింత పెరుగుతాయా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..