Perni Nani: ఆరేడు నెలల్లో రిటైర్ అవుతున్నాను నాకు ప్రెస్టేజ్ ఏముంటుంది: పేర్ని నాని కీలక వ్యాఖ్యలు

వైఎస్సార్సీపీ ముఖ్య నేత, మాజీ మంత్రి పేర్ని నాని తన రిటైర్మెంట్ పై మరోసారి కామెంట్స్ చేశారు. ఆరేడు నెలల్లో రిటైర్ అయ్యే నాకు ప్రెస్టేజ్ ఇష్యూ ఉండదని చెప్పుకొచ్చారు. అయితే ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తీరుపై సీఎస్‌ను కలిసేందుకు..

Perni Nani: ఆరేడు నెలల్లో రిటైర్ అవుతున్నాను నాకు ప్రెస్టేజ్ ఏముంటుంది: పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
Perni Nani
Follow us
pullarao.mandapaka

| Edited By: Subhash Goud

Updated on: Jul 20, 2023 | 8:30 PM

వైఎస్సార్సీపీ ముఖ్య నేత, మాజీ మంత్రి పేర్ని నాని తన రిటైర్మెంట్ పై మరోసారి కామెంట్స్ చేశారు. ఆరేడు నెలల్లో రిటైర్ అయ్యే నాకు ప్రెస్టేజ్ ఇష్యూ ఉండదని చెప్పుకొచ్చారు. అయితే ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తీరుపై సీఎస్‌ను కలిసేందుకు సచివాలయానికి వచ్చారు పేర్ని నాని. వ్యవస్థలు పక్క దారి పట్టకూడదనే ఒక కలెక్టర్ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నాను తప్ప.. దీనిలో ప్రెస్టేజ్ ఏమీ లేదన్నారు.

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా తన కుమారుడు పేర్ని కృష్ణమూర్తిని మచిలీపట్నం అభ్యర్థిగా బరిలో దించాలని పేర్ని నాని నిర్ణయించుకున్నారు. గతంలో స్వయంగా సీఎం సభలో కూడా తన రిటైర్మెంట్ గురించి వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి.. ఇవాళ మరోసారి రాజకీయాల నుంచి ఆరేడు నెలల్లో తప్పుకుంటానని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి