Black Meteorite: టెర్రస్ మీద కాఫీ తాగుతున్న మహిళపై ఆకాశం నుంచి పడిన రాయి.. శాస్త్రవేత్తలకు కూడా షాక్..
డాబా మీద కూర్చుని సరదాగా గడుపుతూ ఆకాశంవైపు చూస్తుంటే.. అప్పుడు సడన్ గా మీ మీద ఏదైనా వస్తువు పడితే అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది.. ఇటువంటి అనుభవం ఒక మహిళకు ఎదురైంది. ఫ్రాన్స్‌లోని ఒక మహిళ తన స్నేహితురాలితో కలిసి టెర్రస్ మీద కూర్చొని కాఫీ తాగుతూ ఉంది. ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక రాయి ఆమె శరీరంపై పడింది. అది చూసి ఆమె ఆశ్చర్యపోయింది.
ఒక్కోసారి ప్రపంచంలో జరిగే కొన్ని సంఘటనలు అందరికీ షాక్ నిస్తాయి. ఆలాంటి ఘటనలు సామాన్యులనే కాదు శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరుస్తాయి. ఎప్పుడైనా సరదాగా ఇంటి పైకప్పు మీద కూర్చుని టీ, కాఫీ తాగుతూ డాబా మీద కూర్చుని సరదాగా గడుపుతూ ఆకాశంవైపు చూస్తుంటే.. అప్పుడు సడన్ గా మీ మీద ఏదైనా వస్తువు పడితే అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది.. ఇటువంటి అనుభవం ఒక మహిళకు ఎదురైంది. ఫ్రాన్స్‌లోని ఒక మహిళ తన స్నేహితురాలితో కలిసి టెర్రస్ మీద కూర్చొని కాఫీ తాగుతూ ఉంది. ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక రాయి ఆమె శరీరంపై పడింది. అది చూసి ఆమె ఆశ్చర్యపోయింది.
న్యూస్‌వీక్ కథనం ప్రకారం.. ఈ సంఘటన జూలై 6 న జరిగింది. తన స్నేహితుడితో కలిసి టెర్రస్‌పై కూర్చుని ఉన్నప్పుడు.. ఒక పెద్ద శబ్దంతో పేలుడు సంభవించిందని మహిళ చెప్పింది. అప్పుడు లేచి నిల్చుని ఏమిటా అని చూస్తుండగా.. ఒక వస్తువు ఆ స్త్రీ మీద పడింది. అప్పుడు ఆ మహిళకు ఎముక విరిగిపోయిన ఫీలింగ్ కలిగింది. అప్పటి వరకు తనకు ఏమి జరిగిందో ఏమిటో తెలియకపోయినా? తనపై పడింది గబ్బిలాలు ఉండవచ్చని.. అవి రాత్రి సమయంలో అక్కడక్కడ ఎగురుతూనే ఉంటాయని భావించింది. అంతేకాదు తనపై పడిన వస్తువు ఇటుక లేదా సిమెంట్ ముక్క కావచ్చు అని కూడా భావించింది. అయితే అక్కడ ఆమె నలుపు రంగులో ఉన్న రాయి వంటి వస్తువుని చూసింది.
ఆ రాయి ఒక ఉల్క నివేదికల ప్రకారం మహిళ తనపై పడిన రాయిని సురక్షితంగా ఉంచింది. అంతేకాదు ఆ రాయిని పరీక్ష కోసం పంపింది. అప్పుడు తెలిసింది ఆ రాయి నిజానికి ఉల్క అని.. అది నలుపు రంగులో ఉన్నప్పటికీ నక్షత్రంలా మెరుస్తూ ఉంది. భూవిజ్ఞాన శాస్త్రవేత్త థియరీ రెబ్‌మాన్ ఆ ముక్క సిలికాన్, ఇనుముతో చేసిన ఉల్క అని ధృవీకరించారు.
ఉల్కలు భూమిపై తరచుగా పడతాయి.. అయితే ఉల్క మనిషి మీద పడిన సంఘటనలు బహు అరుదు. ఇప్పుడు మహిళ మీద నేరుగా పడిన ఉల్కతో వార్తల్లో నిలిచింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..