AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: జిమ్ ట్రైనర్ మృతి.. 210 కిలో బరువును ఎత్తడానికి ప్రయత్నిస్తుండగా బార్‌బెల్‌ మెడమీద పడి..

33 ఏళ్ల ఇండోనేషియా ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్, జస్టిన్ విక్కీ బార్‌బెల్ ఎత్తూతూ మృతి చెందాడు. ఎత్తడానికి ప్రయత్నిస్తున్న బార్‌బెల్ మెడ విరిగిపోవడంతో మరణించాడు. జూలై 15న ప్రమాదం జరిగినప్పుడు ఇండోనేషియాలోని బాలిలోని జిమ్‌లో అతను వ్యాయామం చేస్తున్నాడని ఛానెల్ న్యూస్ ఆసియా..

Watch Video: జిమ్ ట్రైనర్ మృతి..  210 కిలో బరువును ఎత్తడానికి ప్రయత్నిస్తుండగా బార్‌బెల్‌ మెడమీద పడి..
Justyn Vicky
Sanjay Kasula
|

Updated on: Jul 22, 2023 | 9:21 PM

Share

ఇండోనేసియా క్రీడా ప్రపంచానికి ఊహించని దెబ్బ తగిలింది. 33 ఏళ్ల ఇండోనేషియా ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్, జస్టిన్ విక్కీ బార్‌బెల్ ఎత్తూతూ మృతి చెందాడు. ఎత్తడానికి ప్రయత్నిస్తున్న బార్‌బెల్ మెడ విరిగిపోవడంతో మరణించాడు. జూలై 15న ప్రమాదం జరిగినప్పుడు ఇండోనేషియాలోని బాలిలోని జిమ్‌లో అతను వ్యాయామం చేస్తున్నాడని ఛానెల్ న్యూస్ ఆసియా నివేదించింది. ఓ జిమ్‌లో బార్‌బెల్‌‌ను ఎత్తుతున్న సమయంలో అదికాస్త మెడపై పడిన విక్కీ మృతి చెందాడు. ఆ బార్‌బెల్‌ బరువు 210 కిలోలు ఉందని అక్కడి మీడియా తెలిపింది. స్థానికంగా జస్టిన్‌ విక్కీ ఎప్పటిలాగే బాలిలోని జిమ్‌లో వ్యాయామం చేస్తూండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ క్రమంలోనే 210 కిలోల బరువైన బార్‌బెల్‌ను ఎత్తుతుండగా ఒక్కసారిగా అది అతని మెడలపై పడింది. దీంతో విక్కీ స్పాట్‌లో ప్రాణాలు కోల్పాయాడు. అయితే అతని పక్కనే ఇద్దరు జిమ్ ట్రైనర్లు కూడా ఉన్నారు. ఒక జిమ్ ట్రైనర్ అది పడుతుండగా సహాయం చేస్తూ చివరి క్షణంలో వదిలేశాడు. దీంతో అది కాస్తా అతని మెడపై పడిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో జనం ఆందోళనకు గురయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ వీడియోలో, జస్టిన్ విక్కీ ప్యారడైజ్ బాలి వ్యాయామశాలలో తన భుజాలపై బార్‌బెల్‌తో స్క్వాట్ ప్రెస్‌ను ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు. ఛానల్ న్యూస్ ఏషియా అందించిన సమాచారం ప్రకారం, అతను స్క్వాట్‌లోకి వెళ్ళిన తర్వాత నిటారుగా నిలబడలేకపోయాడు.

ఆ వీడియోను ఇక్కడ చూడండి

అతను బరువును ఎత్తేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు.. అతని మెడ వెనుక భాగంలో బార్బెల్ పడటంతో అతను తిరిగి కూర్చున్న స్థితిలో ఉండిపోయాడు. జస్టిన్ విక్కీ స్పాటర్ తన బ్యాలెన్స్ కోల్పోయినట్లు అనిపిస్తుంది. సంఘటన సమయంలో అతనితో వెనుకకు పడిపోవడం చూడవచ్చు. స్పాటర్ వెయిట్ లిఫ్టింగ్ సమయంలో సహాయం, సపోర్ట్ అందించే వ్యక్తి కూడా ఏం చేయలేకపోయాడు.

ప్రమాదం కారణంగా, అతను “మెడ విరగడం, అతని గుండె, ఊపిరితిత్తులకు అనుసంధానించే ముఖ్యమైన నరాలను కుదింపు చేయడం”తో చనిపోయినట్లుగా అక్కడి వైద్యులు నిర్ధారించారు.

జస్టిన్ విక్కీని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే, అత్యవసర ఆపరేషన్ చేయించుకున్న కొద్దిసేపటికే అతడు మరణించాడని ఛానెల్ న్యూస్ ఏషియా పేర్కొంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం