Azharuddin: సుప్రీంకోర్టులో అజారుద్దీన్‌కు ఎదురుదెబ్బ.. కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ..

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ), నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ (ఎన్‌డిసిఎ) మధ్య వివాదంలో తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ధిక్కార నోటీసుపై అజారుద్దీన్ చేసిన పిటిషన్‌ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది.

Azharuddin: సుప్రీంకోర్టులో అజారుద్దీన్‌కు ఎదురుదెబ్బ.. కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ..
Azharuddin
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 22, 2023 | 7:23 PM

కోర్టు ధిక్కరణ నోటీసులుపై అజారుద్దీన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ), నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ (ఎన్‌డిసిఎ) మధ్య వివాదంలో తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ధిక్కార నోటీసుపై అజారుద్దీన్ చేసిన పిటిషన్‌ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఇది కేవలం ధిక్కరణ నోటీసును వ్యతిరేకిస్తూ చేసిన అభ్యర్థన మాత్రమేనని.. ఈ దశలో  పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ దశలో అజహరుద్దీన్‌ పిటిషన్‌ను స్వీకరించేందుకు న్యాయమూర్తులు బిఆర్‌ గవాయ్‌ , ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విముఖత చూపింది.

అయితే హైకోర్టు ధిక్కార నోటీసును మాత్రమే జారీ చేసింది. అయితే ఈ విషయాన్ని కోర్టులో తీసుకోవాలని ఆయన న్యాయవాది గట్టిగా కోరినప్పటికీ. “ఈ విజ్ఞప్తి కేవలం నోటీసుకు వ్యతిరేకంగా ఉంది. మీరు ధిక్కారానికి పాల్పడ్డారా?” అని జస్టిస్ గవాయ్ న్యాయవాదిని ప్రశ్నించారు. తెలంగాణ హైకోర్టు కోఆర్డినేట్ బెంచ్ ముందు రిట్ పిటిషన్ పెండింగ్‌లో ఉందని, వాటిని కలిసి విచారించాలని న్యాయవాది ధర్మాసనానికి తెలియజేశారు.

హెచ్‌సిఎ నిర్వహించే లీగ్‌ మ్యాచ్‌ల్లో పాల్గొనేందుకు తమను అనుమతించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ 2021లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

2022 నాటి హైకోర్టు ఉత్తర్వులను హెచ్‌సీఏ ఉద్దేశపూర్వకంగా పాటించట్లేదని.. అంతేగాక, నల్గొండ క్రికెట్ అసోసియేషన్ ఆటగాళ్ల రిజిస్ట్రేషన్‌ను కూడా అజహరుద్దీన్‌ అనుమతించలేదని తెలిపింది. దీంతో తెలంగాణ హైకోర్టు అజారుద్దీన్‌‌కు ధిక్కర నోటీసులు జారీ చేసింది.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ