ఏం సుఖం గురూ..! రెస్టారెంట్‌లో తిన్నాక.. అక్కడే కాసేపు ఏసీ గదిలో ఎంచక్కా కునుకు తీయొచ్చు..!
అవును మీరు విన్నది నిజమే. ఈ రెస్టారెంట్‌లో కడుపు నిండా తిన్న తర్వాత.. కంటి నిండా నిద్రపోయేందుకు ప్రత్యేకించి ఏసీ గదులను ఏర్పాటు చేశారు. రెస్టారెంట్‌లో నిద్రించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ రిఫ్రెష్‌గా నిద్రపోవచ్చు.
రెస్టారెంట్‌లో మనకు ఇష్టమైన వంటకాలను తిన్న తర్వాత నిద్రమత్తుగా ఉంటుంది. అక్కడే కాసేపు హాయిగా నిద్రపోతే బావుండునని అనిపిస్తుంది. ఇప్పుడు ఈ కలను నిజం చేస్తుంది ఓ రెస్టారెంట్. జోర్డాన్‌లోని ఒక రెస్టారెంట్‌లో భోజనం చేసిన తర్వాత కస్టమర్లు ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం కల్పిస్తుంది. అవును మీరు విన్నది నిజమే. ఈ రెస్టారెంట్‌లో కడుపు నిండా తిన్న తర్వాత.. కంటి నిండా నిద్రపోయేందుకు ప్రత్యేకించి ఏసీ గదులను ఏర్పాటు చేశారు. ఇది ఎక్కడో కాదు.. జోర్డాన్ రాజధాని అమ్మన్‌లో ఉంది ఈ సౌకర్యం. జోర్డాన్ జాతీయ వంటకం మాన్సాఫ్ అందించిన తర్వాత ఎయిర్ కండిషన్డ్ గదులలో హాయిగా నిద్రపోయేందుకు బెస్ట్ బెడ్స్ సౌకర్యం కల్పిస్తోంది.
మోయాబ్ అనే రెస్టారెంట్ తమ జాతీయ వంటకం మన్సాఫ్ అందించిన తర్వాత హాయిగా నిద్రపోయేందుకు అవకాశం కల్పించింది. ఇందులో పులియబెట్టిన పెరుగు, సాస్, అన్నం, గొర్రె మాంసంతో ప్రత్యేకించి తయారు చేసిన సాంప్రదాయ వంటకం.. ఇది తిన్న కస్టమర్లకు ఖచ్చితంగా నిద్రను ప్రేరేపిస్తుంది. ఈ మేరకు ట్విట్టర్ పేజీ నౌ దిస్ న్యూస్ రెస్టారెంట్ ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. దీనిపై ఒక కస్టమర్ స్పందిస్తూ.. మాన్సాఫ్ సహజంగా జోర్డాన్‌లో చాలా భారీ భోజనం. మన్సాఫ్ తిన్న తర్వాత ఎవరైనా సరే మత్తుగా నిద్రపోవాల్సిందే. మన్సాఫ్ మనసును కదిలిస్తుంది. కాబట్టి నిద్రపోతారు.. అతను నిద్రపోకపోతే మాన్సాఫ్‌లో ఏదో లోపం ఉందని అర్థం అంటున్నారు. అయితే, ఈ హోటల్‌కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
Have you ever needed to take a nap after a great meal 🤤? This restaurant in Jordan lets you enjoy the country’s national dish, mansaf, and afterward take a nap in its sleeping area. pic.twitter.com/Qdru4yFjFt
— NowThis (@nowthisnews) July 21, 2023
ఇదిలా ఉంటే.. ఈ ఆలోచన ఒక జోక్‌గా ప్రారంభమైందని రెస్టారెంట్ సహ యజమాని తెలిపారు. మన్సాఫ్ తయారీలో పెరుగు, సాంప్రదాయ నెయ్యి, మాంసం వంటి అధిక పోషక విలువలు కలిగిన పదార్థాలను ఉపయోగించి తయారు చేస్తారు. కాబట్టి చాలా మంది ప్రజలు మన్సాఫ్ తిన్న తర్వాత నిద్రపోవడానికి ఇష్టపడతారు అని ఆయన చెప్పారు. అందుకే రెస్టారెంట్‌లో నిద్రించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ రిఫ్రెష్‌గా నిద్రపోవచ్చు. ఇంకా మెనూలో మన్సాఫ్ తో పాటు రెస్టారెంట్ జోర్డానియన్ కాఫీని కూడా అందిస్తుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..