Watch Video: వందే భారత్ ట్రైన్‌లో హలాల్ టీ సర్వ్ చేస్తున్న సిబ్బంది.. ప్రయాణీకుడు అభ్యంతరం.. అసలు హలాల్ సర్టిఫికేషన్’ అంటే ఏమిటంటే.?

ప్రయాణికులు, రైల్వే సిబ్బంది మధ్య జరిగిన సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హలాల్ సర్టిఫికెట్ ఉన్న టీ ని ఎందుకు ఇస్తున్నావని ఆ రైల్వే సిబ్బందిని ప్రశ్నించాడు. అంతేకాదు మాకు ఏ మతానికి సంబంధించిన సర్టిఫికెట్ ఉన్న ఆహారం వద్దు.. అలా ఇచ్చేటట్లు అయితే స్వస్తిక్ సర్టిఫికేట్ ఉన్న ఆహారాన్ని అందించామని కోరుతున్నాడు..

Watch Video: వందే భారత్ ట్రైన్‌లో హలాల్ టీ సర్వ్ చేస్తున్న సిబ్బంది.. ప్రయాణీకుడు అభ్యంతరం.. అసలు హలాల్ సర్టిఫికేషన్' అంటే ఏమిటంటే.?
Halal Tea Video Viral
Follow us

|

Updated on: Jul 22, 2023 | 6:39 PM

దేశంలోని అత్యాధునిక రైలు ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’లో ఒక ప్రయాణికుడికి ‘హలాల్ సర్టిఫైడ్ టీ’ ఇచ్చిన సంగతి ప్రస్తుతం ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో రైలు సిబ్బంది  ఒక ప్రయాణీకుడుకి తాను అందిస్తున్న టీ ‘శాఖాహారం’ అని వివరిస్తున్నాడు. అయితే ప్రయాణీకుడు ఇప్పుడు శ్రావణ మాసం జరుగుతుంది.. మేము ఉపసం చేస్తున్నాం.. ఇది పండగ సమయం.. కనుక మాకు హలాల్ సర్టిఫికెట్ ఉన్న టీ ని ఎందుకు ఇస్తున్నావని ఆ రైల్వే సిబ్బందిని ప్రశ్నించాడు. అంతేకాదు మాకు ఏ మతానికి సంబంధించిన సర్టిఫికెట్ ఉన్న ఆహారం వద్దు.. అలా ఇచ్చేటట్లు అయితే స్వస్తిక్ సర్టిఫికేట్ ఉన్న ఆహారాన్ని అందించామని కోరుతున్నాడు.. అయితే ఆ రైల్వే సిబ్బంది టీ శాకాహారం మాత్రమే అంటూ వివరిస్తున్నాడు. ప్రయాణీకుడు రైలు సిబ్బందితో ‘హలాల్ టీ’ గురించి వాదించాడు. ఇంతకీ ‘హలాల్ సర్టిఫికేషన్’ అంటే ఏమిటి?  ఈ రోజు తెలుసుకుందాం..

ప్రయాణికులు, రైల్వే సిబ్బంది మధ్య జరిగిన సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రైలు సిబ్బందితో వాగ్వాదం సందర్భంగా ప్రయాణికుడు స్వయంగా రికార్డు చేసినట్లు వీడియో ద్వారా స్పష్టమైంది. వీడియోలో, ‘ప్రీమిక్స్ టీ’ ప్యాకెట్ గురించి చర్చ జరుగుతోంది. ప్రయాణీకుడు శ్రావణ మాసం జరుగుతోంది..మీరు హలాల్ టీ ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

‘హలాల్ సర్టిఫైడ్’ అంటే ఏమిటి?

హిందూ విశ్వాసం ప్రకారం.. శాఖాహారం, మాంసాహార అలవాట్ల గురించి అనేక అభిప్రాయాలున్నాయి. అంతేకాదు పండగలు పర్వదినం వంటి సమయాల్లో ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహారాన్ని నిషేధించే  నమ్మకాలు ఉన్నాయి.

అదే విధంగా ముస్లిం మతంలో ఆహారం గురించి అనేక అభిప్రాయాలు ఉన్నాయి. వీటిలో ఒకటి ‘హలాల్’ మరియు ‘ఝట్కా’. ముస్లిం మతంలో ‘హలాల్’ మాంసం తినడం అనుమతించబడుతుంది. కానీ ‘ఝట్కా’ మాంసం నిషేధించబడింది. ఈ రెండు మాంసాల నిర్ణయం జంతువును కత్తిరించే విధానం ద్వారా నిర్ణయించబడుతుంది.

అందుకే ముస్లిం జనాభా ఉన్న దేశాల్లో ఏదైనా కంపెనీ ఆహార పదార్థాలను విక్రయించాలంటే ‘హలాల్ సర్టిఫికేషన్’ తీసుకుంటుంది. ‘హలాల్ సర్టిఫికేషన్’ నిజానికి ముస్లిం షరియా చట్టం ప్రకారం ఆహార పదార్ధం తయారు చేయబడిందని హామీ. ఇందులో ఎలాంటి కల్తీ లేదు. ఇస్లాంలో ‘హరామ్’గా పరిగణించబడే అటువంటి జంతువు లేదా దాని ఉప ఉత్పత్తిని ఇందులో ఉపయోగించలేదని అర్ధం.

భారతదేశంలో ‘హలాల్ సర్టిఫికేషన్’ ఎవరు చేస్తారు?

సాధారణంగా హలాల్ సర్టిఫికేషన్ అనేది మాంసం, మాంసేతర ఉత్పత్తుల కోసం ఇచ్చేది. అంటే 100% శాఖాహార ఉత్పత్తులకు కూడా ‘హలాల్ సర్టిఫికేషన్’ తీసుకోవచ్చు. ఇస్లాంలోని ‘హరాం’ జంతువులతో సహా ఏ జంతు ఉప ఉత్పత్తులను ఈ ఉత్పత్తి తయారీలో ఉపయోగించలేదని అర్ధాన్ని సూచిస్తుంది. భారతదేశం నుండి పెద్ద మొత్తంలో ఆహార ఉత్పత్తులు సింగపూర్, మలేషియా, గల్ఫ్ దేశాలు మరియు అనేక ఇతర అంతర్జాతీయ మార్కెట్‌లకు ఎగుమతి చేయబడతాయి. ముఖ్యంగా ఎక్కువ ఇస్లామిక్ జనాభా దేశాలకు ఎగుమతి చేస్తారు.

అటువంటి పరిస్థితిలో చాలా భారతీయ కంపెనీలు తమ ఉత్పత్తులకు ‘హలాల్ సర్టిఫికేషన్’ పొందుతాయి. భారతదేశంలోని అనేక థర్డ్-పార్టీ ఇన్‌స్టిట్యూట్‌లు మాంసం, మాంసేతర ఉత్పత్తులకు హలాల్ ధృవీకరణను అందిస్తాయి. ఇందులో హలాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, హలాల్ సర్టిఫికేషన్ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ , జమియాత్ ఉలేమా-ఎ-హింద్ హలాల్ ట్రస్ట్ ప్రముఖమైనవి.

వందే భారత్ రైలులో అందిస్తున్న టీ

వందే భారత్ రైలులో ప్రయాణికుడికి అందించిన టీ.. టీ ప్రీమిక్స్ పౌడర్. సాధారణంగా ఈ రకమైన టీ-కాఫీ ప్రీమిక్స్‌లో పాల పొడి, టీ లేదా కాఫీ సారం, చక్కెర పొడి ఉంటాయి. వేడి నీటిలో ఈ పొడి వేసి కరిగించి క్షణాల్లో టీ లేదా కాఫీని తయారు చేయవచ్చు. అయితే రైల్వే సిబ్బంది ఉపయోగించిన టీ ప్రీమిక్స్ పౌడర్ ‘హలాల్ సర్టిఫైడ్’ అని రాసి ‘ఇస్లామిక్ నిబంధనల’ ప్రకారం ఉంది.

 వెజ్, నాన్ వెజ్, వేగన్ ఫుడ్ చిహ్నాలు

Food Symbols

ఆహారం శాఖాహారమా కాదా అని ఎలా గుర్తించాలి?

ఆహారం శాఖాహారమా లేదా మాంసాహారమా అని గుర్తించడానికి కొన్ని సంకేతాలు ఇస్తారు. ఆహార పదార్ధం 100 శాతం శాఖాహారం అయితే, దానిపై ఆకుపచ్చ రంగుతో చదరపు బాక్స్ లాంటి చిహ్నం ఉంది.. తెలుపు రంగుతో నిండి ఉంటుంది. దీని మధ్యంలో ఆకుపచ్చ రంగు వృత్తం ఉంటుంది. మాంసాహార ఉత్పత్తులను తెలియజేసే విధంగా అదే డిజైన్ బ్రౌన్ కలర్‌లో ఉంటుంది. అయితే మధ్యలో సర్కిల్‌కు బదులుగా త్రిభుజం ఉంటుంది. భారతదేశంలో వేగన్ ఫుడ్ కోసం మరొక చిహ్నం ఉపయోగించబడుతుంది. అందులో  వేగన్ ఫుడ్ అని కూడా వ్రాయబడి ఉంటుంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆహా.! ఏం వయ్యారం గురూ.. అప్పుడేమో పద్దతిగా చుడీదార్‌లో.!
ఆహా.! ఏం వయ్యారం గురూ.. అప్పుడేమో పద్దతిగా చుడీదార్‌లో.!
ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. కీలక అంశాలపై చర్చలు..
ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. కీలక అంశాలపై చర్చలు..
అప్పుడు సారాయికి ఇప్పుడు గంజాయికి హైదరాబాద్ నగరం నడిబొడ్డు అడ్డా
అప్పుడు సారాయికి ఇప్పుడు గంజాయికి హైదరాబాద్ నగరం నడిబొడ్డు అడ్డా
రెండు ప్రైవేట్ పాఠశాలలకు బాంబు బెదిరింపు..రంగంలోకి దిగిన పోలీసులు
రెండు ప్రైవేట్ పాఠశాలలకు బాంబు బెదిరింపు..రంగంలోకి దిగిన పోలీసులు
సెట్‏లో హీరోయిన్ చెంప పగలగొట్టిన హీరో..
సెట్‏లో హీరోయిన్ చెంప పగలగొట్టిన హీరో..
కాలనీలోని ఓ ఇంట్లో ఏదో వింత వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా
కాలనీలోని ఓ ఇంట్లో ఏదో వింత వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా
ఆ రోజు రానే వచ్చేస్తోంది.. మరి కొన్ని గంటల్లో రైతన్నల ఖాతాల్లోకి
ఆ రోజు రానే వచ్చేస్తోంది.. మరి కొన్ని గంటల్లో రైతన్నల ఖాతాల్లోకి
మేడారం జంపన్నవాగులో ఆటో గల్లంతు.. ప్రాణాలతో బయటపడ్డ ఆటో డ్రైవర్..
మేడారం జంపన్నవాగులో ఆటో గల్లంతు.. ప్రాణాలతో బయటపడ్డ ఆటో డ్రైవర్..
ఎందుకైనా మంచిది.. షూలు వేసుకునే ముందు ఓసారి చెక్‌ చేసుకోండి..
ఎందుకైనా మంచిది.. షూలు వేసుకునే ముందు ఓసారి చెక్‌ చేసుకోండి..
ఈ దేశాల్లో భారతీయ రూపాయి విలువ ఎక్కువ.. అవి ఏవో తెలుసా?
ఈ దేశాల్లో భారతీయ రూపాయి విలువ ఎక్కువ.. అవి ఏవో తెలుసా?
కాలనీలోని ఓ ఇంట్లో ఏదో వింత వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా
కాలనీలోని ఓ ఇంట్లో ఏదో వింత వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా
ఇక ఏపీలో వానల జాతర.. వచ్చే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఇక ఏపీలో వానల జాతర.. వచ్చే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
డాబా దగ్గర బస్సు ఆగిందని భోజనానికి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
డాబా దగ్గర బస్సు ఆగిందని భోజనానికి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
సద్గురు మహోన్నత సేవ.. ఏకంగా 7500 గ్రామాలకు శ్రీరామరక్ష
సద్గురు మహోన్నత సేవ.. ఏకంగా 7500 గ్రామాలకు శ్రీరామరక్ష
ఆ సినిమా చేయొద్దని హెచ్చరించారు.! కెరీర్ ఖతమన్నారు..
ఆ సినిమా చేయొద్దని హెచ్చరించారు.! కెరీర్ ఖతమన్నారు..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.