- Telugu News Photo Gallery Is It Safe To Eat Mushroom During Rainy Season All You Need To Know Telugu News
వర్షాకాలంలో పుట్టగొడుగులు తింటున్నారా..? అయితే, ఇది తెలుసుకోండి..
పుట్టగొడుగులలోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పుట్టగొడుగులలోని కొవ్వు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ మొత్తం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
Updated on: Jul 22, 2023 | 6:28 PM

పుట్టగొడుగులను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ వర్షాకాలంలో దీనికి దూరంగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

పుట్టగొడుగులలో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఐరన్ వంటి పోషకాలు లభిస్తాయి. ఇది మీ శరీరానికి శక్తిని ఇస్తుంది.

పుట్టగొడుగులలోని కొవ్వు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ మొత్తం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

పుట్టగొడుగులలోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

పుట్టగొడుగులను తినడం వల్ల క్యాన్సర్, అల్జీమర్స్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

బాక్టీరియా వర్షంలో నేలపైకి వస్తుంది. తడి నేలలో శిలీంధ్రాలు ఏర్పడతాయి. ఈ సందర్భంలో బ్యాక్టీరియా పుట్టగొడుగుల్లో వచ్చి చేరుతుంది. అందుకే వర్షాకాలంలో పుట్టగొడుగులను తినకూడదు అంటారు.

మష్రూమ్‌లు వర్షాకాలంలో చాలా బీజాంశాలను ఉత్పత్తి చేస్తాయి. దీంతో పుట్టుగొడుగులు ఎక్కువగా పుట్టుకోస్తాయి. కానీ, ఇవి చాలా మందికి అలెర్జీని కలిగిస్తాయి.





























