CWC 2023: ‘కింగ్ ఖాన్ ప్రోమో’పై అసంతృప్తితో దూసుకొచ్చిన రావల్పిండి ఎక్స్‌ప్రెస్.. అసంపూర్ణమే అంటూ ఐసీసీకి చురకలు..
Shoaib Akhtar on CWC promo: భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి జరిగే 2023 వన్డే ప్రపంచకప్ ప్రోమోను మూడు రోజుల క్రితమే ఐసీసీ విడుదల చేసింది. యావత్ క్రికెట్ ప్రపంచంలో ట్రెండ్ అవుతున్న ఈ వీడియో పాక్ అభిమానులకు నచ్చలేదు. బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ నరేటర్‌గా..
Shoaib Akhtar on CWC promo: భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి జరిగే 2023 వన్డే ప్రపంచకప్ ప్రోమోను మూడు రోజుల క్రితమే ఐసీసీ విడుదల చేసింది. యావత్ క్రికెట్ ప్రపంచంలో ట్రెండ్ అవుతున్న ఈ వీడియో పాక్ అభిమానులకు నచ్చలేదు. బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ నరేటర్‌గా కనిపించిన ఈ ప్రోమో వీడియోలో దేశవిదేశాల తరఫున ఆడిన మాజీ క్రికెటర్లు, వర్తమాన ప్లేయర్లు ఉన్నారు. అయితే ప్రోమో అసంపూర్ణంగా ఉందంటూ పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ వ్యాఖ్యానించాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ద్వారా పాక్, బాబర్ అజామ్ లేకుండా ప్రోమో పూర్తి అయిందనుకుంటే అది హాస్యాస్పదమే అవుతుందంటూ ట్వీట్ చేశాడు.
ఐసీసీ జూలై 20న విడుదల చేసిన వరల్డ్ కప్ ప్రోమోలో.. 1983 ప్రపంచకప్ విన్నింగ్ టీమ్ కెప్టెన్ కపిల్ దేవ్, 2011 వరల్డ్ కప్ విజేతగా భారత్‌ని నిలిపిన ధోని సిక్సర్, 2019 ప్రపంచకప్‌లో రనౌట్ అయి వెనుదిరిగిన ధోని సహా ముత్తయ్య మురళీధరణ్, జేపీ డుమిని(దక్షిణాఫ్రికా), దినేష్ కార్తిక్, జాంటీ రోడ్స్, శుభమాన్ గిల్, 2019 వరల్డ్ కప్ విజేతగా ఇంగ్లాండ్‌ని నిలిపిన ఇయాన్ మోర్గాన్ వంటి ఎందరో ప్లేయర్లు కనిపిస్తున్నారు. వీరే కాక విండీస్ దిగ్గజం వివ్ రీచర్డ్స్, సచిన్ టెండూల్కర్, క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ.. పాక్ తరఫున షాహిన్ ఆఫ్రిదీ సహా పలువురు ప్లేయర్లు, పాక్-భారత్ మ్యాచ్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ‘పాక్, బాబర్ అజామ్ లేకుండా ప్రోమో వీడియో పూర్తి అయ్యిందనుకునే వ్యక్తి తనను తను హాస్యాస్పదంగా చూపించుకున్నట్లే. అన్ని వదిలేయండి.. ఇది కొంచెం అయినా ఎదిగే సమయం’ అని అర్ధం వచ్చేలా షోయబ్ అక్తర్ ట్వీట్ చేశాడు.
ఐసీసీ వరల్డ్ కప్ ప్రోమో
History will be written and dreams will be realised at the ICC Men’s Cricket World Cup 2023 🏆
All it takes is just one day ✨ pic.twitter.com/G5J0Fyzw0Z
— ICC (@ICC) July 20, 2023
షోయబ్ అక్తర్ ట్వీట్
Whoever thought that World Cup promo will be complete without Pakistan & Babar Azam’s significant presence, has actually presented himself as a joke. Come on guys, time to grow up a bit.
— Shoaib Akhtar (@shoaib100mph) July 22, 2023
కాగా, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా ప్రసిద్ధి చెందని షోయబ్ అక్తర్ చేసిన ట్వీట్‌పై విభిన్న స్పందనలు వస్తున్నాయి. బాబర్ కంటే షాహిన్ అఫ్రిదీ భారత్‌కి ప్రమాదమని, అతను వీడియోలో ఉన్నాడని.. అక్తర్ మాటలు నిజమే కదా అని.. వీడియో మొత్తం పాక్ ప్లేయర్లను నింపలేమని.. రకరకాలుగా క్రికెట్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. వన్డే వరల్డ్‌కప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరగనుంది. ఇక ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..