Hyderabad: ‘క్రికెట్ బెట్టింగ్’ అప్పులు తీర్చలేక గుంటూరు విద్యార్థి మృతి.. జాబ్ కోసం హైదరాబాద్ వచ్చి..

Hyderabad: క్రికెట్ బెట్టింగ్ ఓ యువకుడు ప్రాణం బలి తీసింది. నిరంతరం ఎక్కడో ఒక దగ్గర బెట్టింగ్లకు పాల్పడుతూ యువకులు చేసిన అప్పులు కట్టలేక అర్ధాంతరంగా జీవితాన్ని ముగిస్తున్నారు. క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్లకు సంబంధించి పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా..

Hyderabad: ‘క్రికెట్ బెట్టింగ్’ అప్పులు తీర్చలేక గుంటూరు విద్యార్థి మృతి.. జాబ్ కోసం హైదరాబాద్ వచ్చి..
Satish
Follow us
Peddaprolu Jyothi

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Jul 23, 2023 | 8:25 AM

హైదరాబాద్ న్యూస్, జూలై 23: క్రికెట్ బెట్టింగ్ ఓ యువకుడు ప్రాణం బలి తీసింది. నిరంతరం ఎక్కడో ఒక దగ్గర బెట్టింగ్లకు పాల్పడుతూ యువకులు చేసిన అప్పులు కట్టలేక అర్ధాంతరంగా జీవితాన్ని ముగిస్తున్నారు. క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్లకు సంబంధించి పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇక క్రికెట్ సీజన్ అయితే విపరీతంగా బెట్టింగ్‌లు జరుగుతాయి. ఆ సమయంలో లక్షలలో డబ్బులను సీజ్ చేస్తారు పోలీసులు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడి మోసపోవద్దని ఎంత చెప్పినా లెక్క చేయడం లేదు కొంతమంది యువకులు.. అయితే క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడి ఆత్మహత్య చేసుకునే వాళ్లంతా ఎక్కువగా యువకులే ఉంటున్నారు.

క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడి అప్పుల పాలై వాటిని తీర్చలేక డిగ్రీ మూడో సంవత్సరం చదివే విద్యార్థి ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ ఘటన హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.. అశోక్ నగర్‌లో నివసిస్తున్న సతీష్ అనే యువకుడు(20) గుంటూరు‌కు చెందిన వ్యక్తి. విజయవాడ లయోలా కాలేజీలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న సతీష్.. జాబ్ కోసం 15 రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చి అశోక్ నగర్‌లోని లక్కీ బాయ్స్ హాస్టల్‌లో ఉంటున్నాడు. నగరానికి రాకముందే సతీష్ ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడి అప్పుల పాలయ్యాడు. గత కొంత కాలం క్రితమే తండ్రి చనిపోగా తల్లి గుంటూరులో ఉంటుంది. సతీష్ సోదరుడు కూడా చదువు కోసం నగరానికి వచ్చి యూసుఫ్ గూడాలో ఉంటున్నారు.

వచ్చినప్పటి నుంచి సతీష్ తన స్నేహితులతో కలిసి ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నాడు. ఒకవైపు ఉద్యోగం రాక క్రికెట్ బెట్టింగ్ కోసం చేసిన అప్పులు తీర్చలేక మానసిక బాధతో రాత్రి అతని స్నేహితులందరూ బయటకు వెళ్ళగా ఒంటరిగా ఉన్న సతీష్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన హాస్టల్ సిబ్బంది చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వెంటనే సంఘటన స్థలాన్ని చేరుకొని సతీష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించినట్లు చిక్కడపల్లి పోలీసులు తెలిపారు. సతీష్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని యూసుఫ్ గూడా లో ఉన్న ఆయన సోదరుడుకి సమాచారం అందించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..