AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI 2nd Test: ధోనిని వెనక్కు నెట్టిన రోహిత్.. భారత్ తరఫున ఆ ఘనత సాధించిన ఐదో ప్లేయర్‌గా రికార్డ్..

Rohit Sharma: భారత్-వెస్టిండీస్ రెండో టెస్టులో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన 500 మ్యాచ్‌లో 121 పరుగులతో 76 సెంచరీ నమోదు చేసుకున్నాడు. దీంతో కోహ్లీ ఖాతాలోకి ఎన్నో రికార్డులు చేరాయి. అయితే అంతకముందు 80 పరుగులు చేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డ్‌ని బద్దలుకొట్టాడు. అదేమిటంటే..

శివలీల గోపి తుల్వా
|

Updated on: Jul 22, 2023 | 8:58 AM

Share
Rohit Sharma: భారత్-వెస్టిండీస్ రెండో టెస్టులో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన 500 మ్యాచ్‌లో 121 పరుగులతో 76 సెంచరీ నమోదు చేసుకున్నాడు. దీంతో కోహ్లీ ఖాతాలోకి ఎన్నో రికార్డులు చేరాయి. అయితే అంతకముందు ఈ మ్యాచ్‌ ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తన మాజీ సారథి ఎంఎస్ ధోని పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డ్‌ని బద్దలుకొట్టాడు.

1 / 10
IND vs WI 2nd Test: విండీస్‌తో జరుగుతోన్న రెండో టెస్ట్‌లో 80 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన 5వ ఆటగాడిగా అవతరించాడు.

2 / 10
నిజానికి రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌కి ముందు ఆ స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఉన్నాడు. భారత్ తరఫున మొత్తం 533 మ్యాచ్‌లు ఆడిన ధోని 17,266 పరుగులు చేసి భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన 5వ ఆటగాడిగా ఉన్నాడు.

3 / 10
అయితే వెస్టిండీస్‌తో రెండో టెస్టులో 80 పరుగులు చేయడం ద్వారా రోహిత్ శర్మ 463 మ్యాచ్‌ల్లోనే 17,298 పరుగులు చేశాడు. దీంతో ధోనిని అధిగమించి 5వ స్థానాన్ని హిట్ మ్యాన్ ఆక్రమించాడు.

4 / 10
ఇక భారత్ తరఫున అత్యధిక పరగులు చేసిన ఆటగాడిగా రోహిత్ కంటే ముందు.. 100 సెంచరీల సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. భారత్ తరఫున 664 మ్యాచ్‌లు ఆడిన మాస్టర్ బ్లాస్టర్ మొత్తం 34,357 పరుగులు చేశాడు.

5 / 10
ఈ లిస్టు రెండో స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. తన 500 మ్యాచ్‌ ఆడుతున్న విరాట్ ఇప్పటివరకు 25,582 పరుగులు నమోదు చేశాడు.

6 / 10
టీమిండియా వాల్ రాహుల్ ద్రావిడ్ 509 మ్యాచ్‌ల్లో 24,208 పరుగులు చేయడం ద్వారా భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన 3వ ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

7 / 10
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈ లిస్టు 4వ స్థానంలో ఉన్నాడు. దాదా 424 మ్యాచ్‌లు ఆడి 18,575 పరుగులు సాధించాడు.

8 / 10
తాజాగా ధోని(17,266)ని అధిగమించి 463 మ్యాచ్‌ల్లో 17,298 పరుగులు చేసిన రోహిత్ శర్మ ఐదో స్థానానికి చేరుకున్నాడు.

9 / 10
కాగా, భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా తన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులు చేసిన భారత్.. రెండో రోజు ఆట ముగిసేసరికి విండీస్ కంటే 352 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం తమ తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న కరేబియన్లు ఓ వికెట్ కోల్పోయి 86 పరుగులు చేశారు. ఇంకా క్రీజులో  క్రైగ్ బ్రెత్‌వైట్(37), మెకంజీ(14) ఉన్నారు.

10 / 10