- Telugu News Photo Gallery Cricket photos IND vs WI 2nd Test: Virat Kohli with his 76th Ton breakes Sachin tendulkar's 75 centuries record in 500 Intl Matches
Virat Kohli: 500 మ్యాచ్‌ల్లో 76 సెంచరీలు.. సచిన్ రికార్డ్‌కి కోహ్లీ బ్రేక్.. ఆ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్‌గా కూడా..
IND vs WI 2nd Test: పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న భారత్, వెస్టిండీస్ రెండో టెస్టు ద్వారా 500వ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇంకా 500 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనే 76 సెంచరీలు పూర్తి చేసుకుని.. సచిన్ పేరిట ఉన్న సెంచరీల రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. అదేలా అంటే..
Updated on: Jul 22, 2023 | 6:59 AM

IND vs WI 2nd Test: పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న భారత్, వెస్టిండీస్ రెండో టెస్టు ద్వారా 500వ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇంకా 500 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనే 76 సెంచరీలు పూర్తి చేసుకుని.. సచిన్ పేరిట ఉన్న సెంచరీల రికార్డ్‌ను బ్రేక్ చేశాడు.

ఇప్పటివరకు 500 మ్యాచ్‌ల్లోనే అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడి రికార్డ్‌ని సచిన్ 75 శతకాలతో కలిగి ఉన్నాడు. కానీ తన 500వ మ్యాచ్‌లోనే 76 సెంచరీ చేసిన కోహ్లీ ఇప్పుడు ఆ రికార్డ్‌ను తన సొంతం చేసుకున్నాడు.

అంటే ఇప్పుడు 500 మ్యాచ్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ(76) అగ్రస్థానంలో నిలిచాడు. తద్వారా సచిన్ టెండూల్కర్(75) ఈ లిస్టు రెండో స్థానానికి చేరాడు.

కెరీర్ 500వ అంతర్జాతీయ మ్యాచ్ నాటికి అత్యధిక సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(68) ఉన్నాడు.

అలాగే ఈ లిస్టులో దక్షిణాఫ్రికా లెజెండ్ జాక్వెస్ కల్లీస్ 60 సెంచరీలతో నాల్గో స్థానంలో ఉన్నాడు.

ఇవే కాక 500 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా విరాట్ కోహ్లీ(25,582) అవతరించాడు. కోహ్లీ తర్వాత.. రికీ పాంటింగ్(25,035), సచిన్ టెండూల్కర్(24,874), జాక్వెస్ కల్లీస్(24,799) వరుస స్థానాల్లో ఉన్నారు.

ఇంకా 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా కూడా విరాట్ కోహ్లీ చరిత్రలో నిలిచాడు. అంటే ఇప్పటివరకు 5 వందలకు పైగా మ్యాచ్‌లు ఆడిన ఏ క్రికెటర్ కూడా తమ 500వ మ్యాచ్‌లో సెంచరీ చేయలేదు.





























