AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: దటీజ్ కింగ్ కోహ్లీ..! కొడుకుని కాకుండా విరాట్‌ని చూడడానికే వచ్చిన విండీస్ ప్లేయర్ తల్లి.. వైరల్ అవుతున్న వీడియో..

IND vs WI 2nd Test: ఏ తల్లి అయినా ప్రత్యర్థులపై తన కొడుకు కనబర్చే ప్రదర్శనను కనులారా తిలకించడానికి  వెళ్తుంది. కానీ వెస్టిండీస్‌ టీమ్‌లోని ఓ ప్లేయర్ తల్లి మాత్రం తన కొడుకు కోసం కాకుండా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కోసమే ప్రత్యేకంగా క్రికెట్ స్టేడియానికి..

IND vs WI: దటీజ్ కింగ్ కోహ్లీ..! కొడుకుని కాకుండా విరాట్‌ని చూడడానికే వచ్చిన విండీస్ ప్లేయర్ తల్లి.. వైరల్ అవుతున్న వీడియో..
Virat Kohli With Joshua's Mother
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jul 22, 2023 | 11:18 AM

Share

IND vs WI 2nd Test: ఏ తల్లి అయినా ప్రత్యర్థులపై తన కొడుకు కనబర్చే ప్రదర్శనను కనులారా తిలకించడానికి  వెళ్తుంది. కానీ వెస్టిండీస్‌ టీమ్‌లోని ఓ ప్లేయర్ తల్లి మాత్రం తన కొడుకు కోసం కాకుండా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కోసమే ప్రత్యేకంగా క్రికెట్ స్టేడియానికి వచ్చింది. అవును, వెస్టిండీస్-భారత్ మధ్య జరుగుతోన్న రెండో టెస్ట్ రెండో రోజు ఆట చూసేందుకు విండీస్ వికెట్ కీపర్ జాషువా డా సిల్వా తల్లి వచ్చారు. 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతోన్న విరాట్ కోహ్లీ ఆట చూసేందుకు ఆమె వచ్చిన రోజే రన్ మెషిన్ 76వ సెంచరీతో చెలరేగడం విశేషం.

ఇక రెండో రోజు మ్యాచ్‌ అనంతరం టీమిండియా బస్ వద్దకు జాషువా తల్లి వచ్చి కోహ్లీని కలిసి ఎంతో ఆప్యాయంతో కౌగిలించుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘నేను, జాషువా విరాట్ కోహ్లీకి పెద్ద అభిమానులం. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో రెండో టెస్టు ఆడుతున్న తన అభిమాన క్రికెటర్ కోహ్లీ బ్యాటింగ్ చూసేందుకు మాత్రమే స్టేడియానికి వచ్చా. మా జీవితకాలంలో విరాట్ అత్యుత్తమ బ్యాట్స్‌మ్యాన్. అతనితో పాటు నా కొడుకు కూడా ఒకే మైదానంలో ఆడడం నాకు ఎంతో గౌరవంగా ఉంద’ని ఆమె పేర్కొంది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

జాషువా తల్లితో విరాట్

జాషువా-కోహ్లీ

కాగా రెండో రోజు జాషువా తల్లి వస్తుందన్న విషయాన్ని వెస్టిండీస్ ప్లేయర్ ముందుగానే చెప్పాడు. తొలి రోజు కోహ్లీ ఆడుతున్న సమయంలో జాషువా వికెట్ కీపింగ్ చేస్తూనే ‘విరాట్‌ని చూడటానికి వస్తున్నానని, నా ఆట చూసేందుకు కాదని మా అమ్మ ఫోన్‌లో చెప్పింది. మా అమ్మ అక్షరాలా అదే చెప్పింది. నేను నమ్మలేకపోయా. ఆమె నిజాయితీగా చెప్పినందుకు నేను తనను నిందించను. ఆమె చూస్తూనే ఉంది’ అన్నాడు. అందుకు సంబంధించిన మాటలు కూడా స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. ఇక తొలి రోజు ఆట ముగిసే సరికి కోహ్లీ 87 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అలాగే ఆ రోజు టీమిండియా 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. రెండో రోజు విరాట్ కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు టీమిండియా 438 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ టీమ్ ఓ వికెట్ నష్టానికి 86  పరుగులు చేశారు.

మరిన్ని క్రికెట్ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
న్యూయార్క్‌లో ఆగస్టు 29న విశ్వ ఐక్యతా వేడుకలు!
న్యూయార్క్‌లో ఆగస్టు 29న విశ్వ ఐక్యతా వేడుకలు!
పిల్లలకు డయేరియా, వాంతులా? ORS తాగిస్తే నయం అవుతుందా..
పిల్లలకు డయేరియా, వాంతులా? ORS తాగిస్తే నయం అవుతుందా..
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమే కష్టం.. హీరోయిన్ ఎమోషనల్..
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమే కష్టం.. హీరోయిన్ ఎమోషనల్..
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే