Kishan Reddy: నేడే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం.. పూర్తి షెడ్యూల్ వివరాలివే..

Kishan Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కిషన్ రెడ్డి శుక్రవారం రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రానున్న అసెంబ్లీ..

Kishan Reddy: నేడే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం.. పూర్తి షెడ్యూల్ వివరాలివే..
Telangana BJP Chief Kishan Reddy
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 21, 2023 | 7:40 AM

Kishan Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కిషన్ రెడ్డి శుక్రవారం రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అధిష్టానం తెలంగాణలోని నాయకత్వంలో కీలక మార్పులు చేసింది. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్‌కి తెలంగాణ ఎన్నికల నిర్వహణ చైర్మన్‌, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి జాతీయ కార్యవర్గ సభ్యత్వం కల్పించింది.

ఇదిలా ఉండగా.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి ప్రమాణ స్వీకారం చేయబోతున్న కిషన్ రెడ్డి ఉదయం 7:30 గంటలకు పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం 8:20 గంటలకు అంబర్ పేట మహాత్మా జ్యోతి బాపులే విగ్రహాల వద్ద నివాళులు అర్పించి.. 8:50గంటలకు బషీర్ బాగ్ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంటారు. అలాగే 9:25 గంటలకు ట్యాంక్ బండ్ అంబేద్క ర్ విగ్రహం, 9:30 గంటలకు గన్ పార్క్ అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తారు. తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్‌లోనే ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లనున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, శుక్రవారం ఉదయం 11 గంటలకు కిషన్‌ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనుండగా.. ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేతలతో పాటు, రాష్ట్ర నలుమూలల నుంచి కమలదళ శ్రేణులు తరలిరానున్నాయి. ఇంకా శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నారు కిషన్ రెడ్డి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి