AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO: చంద్రయాన్-3 జరిగిన 12 రోజుల్లోనే ఇస్రో మరో ప్రయోగం.. విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్న భారత్..

Indian Space Research Organisation: ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చంద్రయాన్ .3 రాకెట్ ప్రయోగం జరిగిన రెండు వరాల్లోపే మరో ప్రయోగానికి సిద్ధమైంది.. ఈ నెల PSLV సీరీస్ లో మరో రాకెట్ ను ప్రయోగించనుంది ఇస్రో. ఇది పూర్తిగా కమర్షియల్ లాంచ్ కావడం గమనార్హం. 

ISRO: చంద్రయాన్-3 జరిగిన 12 రోజుల్లోనే ఇస్రో మరో ప్రయోగం.. విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్న భారత్..
Sri Harikota, ISRO
Ch Murali
| Edited By: శివలీల గోపి తుల్వా|

Updated on: Jul 19, 2023 | 9:37 PM

Share

ISRO: ఇస్రో వరుస రాకెట్ ప్రయోగాలతో బిజీగా వుంది.. ఇటీవలే చంద్రయాన్.3 ని తీసుకెళ్లే LVM3 M4 ప్రయోగాన్ని సక్సెస్ చేసిన ఇస్రో ఇపుడు PSLV ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తి చేసింది.. అది కూడా చంద్రాయన్ ప్రయోగం జరిగిన 12 రోజుల్లోనే.. తిరుపతి జిల్లా శ్రీహరికోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మొదటి రాకెట్ ప్రయోగ వేదిక నుండి ప్రయోగం జరగనుంది. ఈనెల 26న ఇస్రో శాస్త్రవేత్తలు పిఎస్ఎల్వి ..సి 56 రాకెట్ ను ప్రయోగించనున్నారు.. ఇది పూర్తిగా కమర్షియల్ లాంచ్ గా ఇస్రో చెబుతోంది. ప్రయోగం ద్వారా సింగపూర్ మరియు ఇజ్రాయిల్ దేశాలకు సంబంధించిన కమర్షియల్ రాకెట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ కమర్షియల్ రాకెట్ ప్రయోగంలో మొత్తం ఏడు ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్న ఇస్రో శాస్త్రవేత్తలు.

సింగపూర్ ,ఇస్రాయిల్ దేశాలకు చెందిన హమ్ డీఎస్ -ఎస్ ఏ ర్ అనే 351.9 కేజీలు బరువు కలిగిన భూ పరిశీలన ఉపగ్రహం ఈ ప్రయోగంలో ప్రధానమైనది. అదేవిధంగా దీనితో పాటు 23. 58 కేజీలు బరువు ఉన్న ఆర్కేడ్ సాటిలైట్ మరియు 23 కేజీలు బరువు ఉన్న వెలాక్ -ఎ ఎమ్ సాటిలైట్ మరియు 12.8 కేజీలు బరువు ఉన్న ఆర్బు12 స్పైడర్ ఉపగ్రహాలతో పాటు మరో మూడు నానో ఉపగ్రహాలు ,గెలుసియా-2 ,స్కూప్-2, మరియు నులియన్ అనే నానో ఉపగ్రహాలను ఇందులో అమర్చి ఇస్రో శాస్త్రవేత్తలు పిఎస్ఎల్వి- సి 56 రాకెట్ ప్రయోగం రూపొందించిన PSLV. C 56 రాకెట్ ప్రయోగం ద్వారా విదేశీ ఉపగ్రహాలను ఎర్త్ ఆర్బిట్ లోకి పంపనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.