AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: పనిచేసే బ్యాంకులోనే ఉద్యోగి చేతివాటం.. కస్టమర్ల ఖాతాల ద్వారా లక్షల్లో లోన్.. అధికారుల అలెర్ట్..

Tirupati District News: బంగారు నగలు బ్యాంకుల్లో తనఖా పెట్టుకుని రుణాలు ఇస్తుంటారు.. అందుకోసం బంగారం విలువ కట్టేందుకు ప్రతి బ్యాంకులో అప్రయిజర్ ఉంటారు.. విలువ తక్కువ ఉన్న బంగారానికి ఎక్కువ రుణం ఇస్తే బ్యాంకులు నష్టపోతాయని ఇలాంటి వ్వవస్థ ఉంటుంది. కానీ బ్యాంకులో అతనే మస్కా..

Tirupati: పనిచేసే బ్యాంకులోనే ఉద్యోగి చేతివాటం.. కస్టమర్ల ఖాతాల ద్వారా లక్షల్లో లోన్.. అధికారుల అలెర్ట్..
Chittedu Canara Bank
Ch Murali
| Edited By: శివలీల గోపి తుల్వా|

Updated on: Jul 19, 2023 | 3:05 PM

Share

Tirupati District News: బంగారు నగలు బ్యాంకుల్లో తనఖా పెట్టుకుని రుణాలు ఇస్తుంటారు.. అందుకోసం బంగారం విలువ కట్టేందుకు ప్రతి బ్యాంకులో అప్రయిజర్ ఉంటారు.. విలువ తక్కువ ఉన్న బంగారానికి ఎక్కువ రుణం ఇస్తే బ్యాంకులు నష్టపోతాయని ఇలాంటి వ్వవస్థ ఉంటుంది. కానీ బ్యాంకులో అతనే మస్కా కొట్టాడు. తిరుపతి జిల్లా కోట మండలం చిట్టెడు కెనరా బ్యాంకులో వెలుగుచూసిన గోల్డ్ అప్రైజర్ ఘరానా మోసంతో ఒక్కసారిగా ఖాతాదారులు, గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. మామూలుగా అయితే కేటుగాళ్లు దీనిని కవరింగ్ గోల్డ్ లేదా స్పీరియస్ గోల్డ్ అని కూడా అంటారు. ఈ గోల్డ్ తో బ్యాంక్ అధికారులను బురిడీ కొట్టిస్తుంటారు.. ఇక్కడ బ్యాంకు అప్రయిజర్ కోట మండలంలోని చిట్టేడు కెనరా బ్యాంకులో ఇలాంటి మోసానికి పాల్పడ్డారు. అసలు మోసం ఎలా జరిగిందంటే..

ఖాతాదారుల అకౌంట్‌ల ద్వారా స్పిరియస్( కవరింగ్) గోల్డ్ తో 60 లక్షల రూపాయలు స్వాహా చేసిన అప్రైజర్ అంకయ్య మామూలుగా అయితే ఖాతాదారులు తెచ్చిన గోల్డ్ అప్రైజర్ చెక్ చేసిన తర్వాత గోల్డ్ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది.  అది కూడా ఒక సవరకు 8 గ్రాములు కాగా ఏడు గ్రాములకు మాత్రమే లోన్ ఇవ్వడం జరుగుతుంది కానీ ఆప్రైజర్ బ్యాంకు వాళ్లను మోసం చేయాలనుకున్నాడు. ఇలాగే కొన్నాళ్లుగా జరుగుతోంది.. అడిగేవారు ఎవరూ లేకపోవడంతో తనకి ఇష్టం వచ్చిన రేటుతో ఇతరుల ఖాతాలను వాడుకుని కస్టమర్ ఖాతాల్లో లోన్లు తీసుకుంటూ కస్టమర్లకు తెలియకుండా మార్చుకుంటూ ఉండేవాడు. ప్రతి మూడు నెలలకు ఒకసారి గోల్డ్ చెకింగ్ కి మెయిన్ బ్రాంచ్ నుండి వచ్చి సబ్ బ్రాంచ్ లో తనిఖీ చేస్తూ ఉంటారు. ఇలా తనిఖీల్లో భాగంగా అప్రైజర్ బాగోతం బయటపడింది.

Accused

నిందితుడు అంకయ్య

స్పీరియస్ గోల్డ్ అంటే ఏంటి?

స్పీరియస్ గోల్డ్ అంటే ప్యూరిటీ తక్కువ.. గోల్డ్ 24 క్యారెట్స్.. 22 క్యారెట్స్ మాత్రమే చాలావరకు గోల్డ్ కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే స్పీరియస్ గోల్డ్ కేవలం 15% మాత్రమే గోల్డ్ టచ్ అనేది ఉంటుంది. మామూలుగా అయితే 24 క్యారెట్ గోల్డ్ ఒక గ్రామ్ 5000 ఉంటే ఈ స్పీరియస్ గోల్డ్ మాత్రం 1500 నుండి 2000 లోపలే ధర ఉంటుంది. ఈ స్పీరియస్ గోల్డ్ ద్వారా గాజులు తయారీలో ఐదు లేయర్లలో గాజులు తయారు చేస్తారు. లోపల ఉన్న మూడు లేయర్లు ఈస్పీరియస్ గోల్డ్ వాడి పైన ఉన్న రెండు లేయర్లు మాత్రం ఒరిజినల్ గోల్డ్ వాడతారు. ఇలా వాడడం వల్ల గోల్డ్ కి స్పీరియస్ గోల్డ్ కి మధ్య తేడా అనేది కనుక్కోవాలి. అంటే చాలా కష్టం దీన్ని అదునుగా చేసుకొని దాదాపు 60 లక్షల రూపాయలు పైనే చిట్టేడు కెనరా బ్యాంకులో అప్రైజర్ బ్యాంకర్లను మోసం చేసి లోన్ తీసుకున్నాడు. ఇదేవిధంగా అన్ని బ్యాంకులలో గోల్డ్ ప్యూరిటీగా చెక్ చేస్తే వెలుగులోకి ఇంకా చాలా వచ్చే సంఘటనలు ఉన్నాయా అనేది తెలిసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ చేయండి..