Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narasaraopet: ఐపీ వ్యాపారి ఇంటి స్వాధీనంలో ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ కార్యకర్తలతో మొదలై నేతల వరకు..

Palnadu District News: నర్సరావుపేటలో ఐపి పెట్టిన వ్యాపారి ఇంటిని స్వాధీనం చేసుకునే క్రమంలో వైసిపి, టిడిపి నేతల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. కార్యకర్తలతో మొదలైన గొడవ నేతలు రంగంలోకి దిగే వరకూ వెళ్ళింది. ఇరు వర్గాలు రాళ్ళు రువ్వుకోవటం..

Narasaraopet: ఐపీ వ్యాపారి ఇంటి స్వాధీనంలో ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ కార్యకర్తలతో మొదలై నేతల వరకు..
Narasaraopet
Follow us
T Nagaraju

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Jul 17, 2023 | 10:51 AM

Palnadu District News: నర్సరావుపేటలో ఐపి పెట్టిన వ్యాపారి ఇంటిని స్వాధీనం చేసుకునే క్రమంలో వైసిపి, టిడిపి నేతల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. కార్యకర్తలతో మొదలైన గొడవ నేతలు రంగంలోకి దిగే వరకూ వెళ్ళింది. ఇరు వర్గాలు రాళ్ళు రువ్వుకోవటం, భౌతిక దాడులకు దిగటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. రెండు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. వివరాల్లోకి వెలితే నర్సరావుపేట పట్టణానికి చెందిన భార్గవ్, గిరి అన్నదమ్ముల. వీరిద్దరూ కలిసి పట్టణంలో ఒక సెలూన్ షాపు నిర్వహిస్తున్నారు. వ్యాపారాభివృద్ధిలో భాగంగా పలువురి వద్ద అప్పులు తీసుకున్నారు. మూడు కోట్ల రూపాయల వరకూ అప్పులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వ్యాపారంలో నష్టం రావటంతో వీరు ఐపి పెట్టారు. ఐపి పెట్టడంతో పాటు ఒకరు లండన్‌లో ఉండగా మరొకరు పట్టణం విడిచి వెళ్ళిపోయారు.

అయితే వీరికి కోటప్పకొండ రోడ్డులోని అమరావతి హైట్స్ లో ఒక ఇల్లు ఉంది. దీని విలువ 70 లక్షలు వరకూ ఉంటుంది. దీంతో అప్పులు ఇచ్చిన వారు కన్ను ఆ ఇంటిపై పడింది. అప్పులిచ్చిన వారిలో టిడిపి, వైసిపి నేలిద్దరున్నారు. అమరావతి హైట్స్ లోనే నివాసం ఉండే టిడిపి నేత సుబ్బారావు, గిరి ఇంటిని స్వాధీనం చేసుకున్నాడు. ఈ విషయం పట్టణమంతా పాకిపోయింది. అటు వైసిపి నేతలు కూడా ఇంటిని స్వాధినం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారనే సమాచారం అందుకున్న సుబ్బారావు వైసిపి ఎమ్మెల్యే గోపిరెడ్డితో పాటు ఇతర నేతలపై విరుచుకుపడ్డారు. దీంతో వైసిపి నేతలు నిన్న సాయంత్రం ఆ ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు బాధితులతో కలిసి వెళ్ళారు. అక్కడికి సుబ్బారావు కూడా వచ్చారు. వైసిపి నేతల్ని చూసిన సుబ్బారావు టిడిపి నేతల్ని ఆ ఇంటి వద్దకు పిలిపించారు.

ఇరు వర్గాలు భారీగా మోహరించడంతో ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై మరొకరు భౌతిక దాడులకు దిగటం, రాళ్ళు రువ్వుకోవటం, వాహనాలు ధ్వంసం చేసుకోవటం జరిగింది. పోలీసులు ఇరు వర్గాలను అక్కడ చెదరగొట్టి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. తిరిగి ఘర్షణలు తలెత్తకుండా ఆ ఇంటి వద్ద పికెటింగ్ ఏర్పాటు చేశారు. అయితే వైసిపి ఎమ్మెల్యే గోపిరెడ్డితో పాటు టిడిపి ఇంఛార్జి అరవింద్ బాబు కూడా ఆ ఇంటి వద్దకు వెళ్ళడంతో వివాదం పెద్దదైంది. వీరిద్దరూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. టిడిపి నే సుబ్బారావు ఇంటి ఆక్రమించుకుంటే బాదితులు ప్రశ్నించడానికి వెళ్ళారని వారిపై టిడిపి నేతలు దాడి చేశారని ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆరోపించారు. ఇంఛార్జి స్థాయిలో ఉన్న అరవింద్ బాబు అక్రమాలను ప్రోత్సహిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించాల్సిన వ్యక్తులు కబ్జాలకు పాల్పడుతున్నారన్నారు.

ఇవి కూడా చదవండి

ఇటు ఆ ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు వైసిపి గుండాలు వచ్చారని వారిని ప్రతిఘటించాల్సిన పరిస్థితి వచ్చిందని టిడిపి ఇంఛార్జి అరవింద్ బాబు ఆరోపించారు. ఐపి లు పెట్టిన వ్యాపారులు విదేశాలకు వెళ్ళేందుకు ఎమ్మెల్యే సహకరిస్తున్నారన్నారు. అధికారాన్ని, పోలీసులను అడ్డుపెట్టుకొని నాపై హత్యాయత్నం చేశారన్నారు. ఘర్షణలపై పోలీసులు ఇంకా కేసులు నమోదు చేయలేదు. 144 సెక్షన్ పెట్టడం, దాడులు చేసిన వారిపై టిడిపి నేతలు ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు.ప్రస్తుతం నర్సరావుపేటలో ప్రశాంత వాతావరణం నెలకొంది.