Andhra Pradesh: టీడీపీని స‌ర్వనాశ‌నం చేసింది దేవినేని ఉమానే.. వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి సంచలన వ్యాఖ్యలు..

MLA Simhadri Ramesh Babu: మాజీ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వర‌రావుపై కృష్ణా జిల్లా అవ‌నిగ‌డ్డ ఎమ్మెల్యే సింహాద్రి ర‌మేష్ తీవ్ర విమర్శలు చేసారు. రెండు రోజుల పాటు అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ భ‌విష్యత్తుకు భ‌రోసా బ‌స్సు యాత్ర నిర్వహించింది.

Andhra Pradesh: టీడీపీని స‌ర్వనాశ‌నం చేసింది దేవినేని ఉమానే.. వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి సంచలన వ్యాఖ్యలు..
Devineni Uma Mla Simhadri
Follow us
pullarao.mandapaka

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 17, 2023 | 11:58 AM

MLA Simhadri Ramesh Babu: మాజీ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వర‌రావుపై కృష్ణా జిల్లా అవ‌నిగ‌డ్డ ఎమ్మెల్యే సింహాద్రి ర‌మేష్ తీవ్ర విమర్శలు చేసారు. రెండు రోజుల పాటు అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ భ‌విష్యత్తుకు భ‌రోసా బ‌స్సు యాత్ర నిర్వహించింది. దేవినేని ఉమాతో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి ర‌మేష్ బాబుపై తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించారు. నియోజ‌క‌వ‌ర్గం అభివృద్దిపై ప‌లు విమర్శలు చేసారు. అవ‌నిగ‌డ్డలో మ‌ట్టి, ఇసుక దోపిడీ జ‌రుగుతుంద‌ని దేవినేని ఉమా ఆరోపించారు. 2020లో జ‌రిగిన డాక్టర్ కోట శ్రీహ‌రిరావు హ‌త్య వెనుక ఎవ‌రున్నారో తేల్చలేక‌పోయార‌ని ఎమ్మెల్యేపై ఆరోప‌ణ‌లు చేసారు. దీనికి కౌంట‌ర్ గా ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ దేవినేని ఉమాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు సింహాద్రి..

అసలు ఉమ్మడి కృష్నా జిల్లాలో టీడీపీ తుడిచిపెట్టుకుపోవ‌డానికి కార‌ణం ఉమా అని ఆరోపించారు. హ‌త్యా రాజ‌కీయాలు ప్రోత్సహించి రౌడీల‌కు, గూండాల‌కు స‌క‌ల సౌక‌ర్యాలు క‌ల్పించింది దేవినేని ఉమానే అన్నారు. ఉమా చేసిన అవినీతి, అరాచ‌కాలు రాష్ట్ర ప్రజ‌లంద‌రికీ తెలుసున‌ని సింహాద్రి ర‌మేష్ బాబు మండిపడ్డారు. ఎమ్మెల్యే టిక్కెట్ కోసం సొంత వ‌దిన‌ను హ‌త్య చేసి రాజ‌కీయాల్లోకి వ‌చ్చార‌ని.. ఆయ‌న వల్లనే తెలుగుదేశం పార్టీ స‌ర్వనాశ‌నం అయింద‌ని ఆరోపించారు. అంతెందుకు కులాల‌వారీగా త‌గ‌వులు పెట్టింది దేవినేని ఆయ‌న కుటుంబ స‌భ్యులేన‌ని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొన్నేళ్ల క్రితం రాష్ట్రం కులాల గొడ‌వ‌ల‌తో అల్లక‌ల్లోలం కావ‌డానికి దేవినేని ఉమా.. ఆయ‌న కుటుంబమే కార‌ణ‌మ‌ని చెప్పారు.

పార్లమెంట్ ల వారీగా తెలుగుదేశం పార్టీ మొద‌ట విడ‌త మేనిఫెస్టో పై భ‌విష్యత్తుకు గ్యారంటీ పేరుతో బ‌స్సు యాత్రలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో పర్యటించిన బ‌స్సు యాత్ర అవ‌నిగ‌డ్డ చేరుకుంది. స్థానిక ఎమ్మెల్యేల‌ను టార్గెట్ గా బ‌స్సు యాత్రను నిర్వహిస్తున్నారు టీడీపీ నాయ‌కులు. ఇదే కోవ‌లో అవ‌నిగ‌డ్డ ఎమ్మెల్యే సింహాద్రి ర‌మేష్ పైనా విమర్శలు చేయ‌డంతో.. దేవినేని ఉమాతో పాటు మిగిలిన టీడీపీ నాయ‌కుల‌కు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు ర‌మేష్ బాబు.

ఇవి కూడా చదవండి

అస‌లు విష‌యం ఏంటంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ నాయ‌కులంతా దేవినేని ఉమాను టార్గెట్ చేసారు. సింహాద్రి ర‌మేష్ కంటే ముందుగానే ఒకరిద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ నాశ‌నానికి దేవినేని ఉమా కారణం అంటూ ఆరోపణ‌లు చేయ‌డం జిల్లా వ్యాప్తంగా చ‌ర్చనీయాంశంగా మారింది. మ‌రోవైపు దేవినేని ఉమా కుటుంబంలో జ‌రిగిన ప‌రిణామాలను కూడా వైసీపీ నేత‌లు లేవ‌నెత్తుతూ ఉండ‌టంతో టీడీపీ నేత‌ల్లో కాస్త ఆందోళ‌న వ్యక్తం అవుతుంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..