- Telugu News Photo Gallery Business photos EPFO amount withdrawal for home loan repayment, Check Details
EPFO: హోమ్ లోన్ రీపేమెంట్ కోసం PF డబ్బులను ఎలా ఉపసంహరించుకోవాలి.. ఫుల్ డిటైల్స్ మీకోసం..
EPFO amount withdrawal for home loan: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఉద్యోగుల భవిష్య నిధి) EPF అనేది ఒక సామాజిక భద్రతా పథకం. ఇది ఉద్యోగులు తమ సంపాదనలో కొంత భాగాన్ని భవిష్యత్తు ప్రయోజనాల కోసం ఆదా చేసుకోవడానికి అనుమతిస్తుంది.
Updated on: Jul 05, 2023 | 2:32 PM

EPFO amount withdrawal for home loan: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఉద్యోగుల భవిష్య నిధి) EPF అనేది ఒక సామాజిక భద్రతా పథకం. ఇది ఉద్యోగులు తమ సంపాదనలో కొంత భాగాన్ని భవిష్యత్తు ప్రయోజనాల కోసం ఆదా చేసుకోవడానికి అనుమతిస్తుంది. అయితే, పలు సందర్భాల్లో పీఎఫ్ డబ్బులను ఉపసంహరించుకోవచ్చు. హోమ్ లోన్ రీపేమెంట్ కోసం మీరు PF మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చని పేర్కొంటున్నారు.

గృహ రుణం చెల్లింపు కోసం EPF బ్యాలెన్స్‌ని విత్‌డ్రా చేయవచ్చా..? EPF పాలసీలోని సెక్షన్ 68BB ప్రకారం గృహ రుణం తిరిగి చెల్లింపు కోసం EPF మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే, ఇల్లు తప్పనిసరిగా పిఎఫ్ సభ్యుని పేరు మీద లేదా ఉమ్మడిగా నమోదయి ఉండాలి. అయితే, హౌసింగ్ లోన్ దరఖాస్తుదారు అలా చేయడానికి కనీసం పదేళ్లపాటు PF విరాళాలను చెల్లించి ఉండాలి. ఐదేళ్ల నిరంతర సేవ తర్వాత ఉపసంహరించుకున్న PF మొత్తంపై పన్ను విధించబడదు.

హోమ్ లోన్ రీపేమెంట్ కోసం మీ PF పొదుపులను ఎలా ఉపసంహరించుకోవాలి.. ముందుగా EPFO e-SEVA పోర్టల్‌ని యాక్సెస్ చేయండి.. మీ UAN నెంబర్, పాస్‌వర్డ్ క్యాప్చా కోడ్‌ను పూరించండి. ఆ తర్వాత 'ఆన్‌లైన్ సేవలు' విభాగానికి వెళ్లండి.. మీ బ్యాంకింగ్ సమాచారాన్ని నమోదు చేయండి.. ఆ తర్వాత నిబంధనలు, షరతులను చదవండి.. రెండుసార్లు తనిఖీ చేయండి

EPF పొదుపులను ఉపసంహరించుకోవడానికి కారణాన్ని ఎంచుకోండి.. మీ చిరునామా, ఇతర సమాచారాన్ని నమోదు చేయండి, ఆపై పత్రాన్ని అప్‌లోడ్ చేయండి. అప్‌లోడ్ చేసిన తర్వాత, నిబంధనలు.. షరతులను అంగీకరించి, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో ఆధార్ OTPని అందుకోండి.. ఆ తర్వాత మీ దరఖాస్తు సమర్పించబడుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు పీఎఫ్ నగదు మీ బ్యాంకు ఖాతాలో జమవుతుంది.

మీరు గృహ రుణాన్ని చెల్లించడానికి EPF కార్పస్‌ని ఉపయోగించవచ్చు.. గృహ రుణ వడ్డీ EPF వడ్డీ కంటే ఎక్కువగా ఉంటే మీ వడ్డీని తగ్గించుకోవచ్చంటున్నారు. ఏమైనా సలహాలుంటే సమీపంలోని ఈపీఎఫ్ కార్యాలయానికి వెళ్లి తెలుసుకోవచ్చు.




