- Telugu News Photo Gallery Signs which show your partner busy having online affair Relationship tips in telugu
Relationships: మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నారా..? ‘అఫైర్’ను ఇట్టే పసిగట్టవచ్చు..
Relationship Tips: బంధం కలకాలం నిలవాలంటే.. ఒకరిమీద ఒకరికి నమ్మకం, ప్రేమ, అర్ధంచేసుకునే మనస్తత్వం తప్పనిసరిగా ఉండాలి.. అయితే, ఈ రోజుల్లో సంబంధాలు పక్కదారిపడుతున్నాయి. వివాహేతర సంబంధాలకు సంబంధించి అనేక కేసులు వెలుగు చూస్తున్నాయి.
Updated on: Jul 09, 2023 | 9:33 PM

Relationship Tips: బంధం కలకాలం నిలవాలంటే.. ఒకరిమీద ఒకరికి నమ్మకం, ప్రేమ, అర్ధంచేసుకునే మనస్తత్వం తప్పనిసరిగా ఉండాలి.. అయితే, ఈ రోజుల్లో సంబంధాలు పక్కదారిపడుతున్నాయి. వివాహేతర సంబంధాలకు సంబంధించి అనేక కేసులు వెలుగు చూస్తున్నాయి. కొన్నిసార్లు అక్రమ సంబంధాలు చాలా భయంకరమైనవిగా ఉంటాయి.. వాటిని మనం అస్సలు ఊహించలేం..

సంబంధంలో పురుషులు లేదా స్త్రీలలో కొన్నిసార్లు ప్రవర్తనలో తేడా కనిపిస్తుంది. దీని ద్వారా వారికి సంబంధించిన విషయాలను సకాలంలో గుర్తించవచ్చు. ఒక వ్యక్తి ఆన్‌లైన్ లో మరొకరితో అక్రమ వ్యవహారం కొనసాగిస్తుంటే.. కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.. అవేంటో తెలుసుకోండి..

నిద్ర వేళల్లో గుర్తించవచ్చు: సాధారణంగా ఆన్‌లైన్ యాక్టివిటీస్‌లో నిమగ్నమయ్యే చాలా మంది వ్యక్తులు అర్థరాత్రి నిద్రపోతారు. అలాంటి వ్యక్తులు రాత్రంతా ఆన్‌లైన్‌లో టైమ్ పాస్ చేస్తూ వారిలో వారు నవ్వుకోవడం, కొపగించుకోవడం చేస్తుంటారు. ఆన్‌లైన్‌లో ఎవరితోనైనా చాట్ చేస్తున్నప్పుడు, ఆ వ్యక్తి దేనిపైనా దృష్టి పెట్టడు. వాళ్ళు తమ లోకంలోనే ఉండిపోతారు.

ఫోన్-ల్యాప్‌టాప్: మీ భాగస్వామికి ఆన్‌లైన్ ఎఫైర్ ఉంటే, ఆ వ్యక్తి తన ఫోన్, టాబ్లెట్, ల్యాప్‌టాప్‌లను అందరికీ దూరంగా ఉంచుతారు. దాన్ని తాకడానికి ఎవరికీ అనుమతించరు.. ఎప్పుడూ ఓ మూలన ఫోన్‌తో కనిపిస్తుంటారు. అంతేకాదు ఫోన్ పాస్‌వర్డ్‌ను కూడా మారుస్తుంటారు. మీరు వారి ఫోన్‌ను పరిశీలిస్తే వారికి కోపం వస్తుంది.

ఇంట్లో నిర్లక్ష్యం: మీ మోసం చేసే భాగస్వామి ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం గడిపినప్పుడు, వారు ఇంటి పనులను, బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తారు. అంటే తమ బాధ్యతలను వదిలేసి దానిపైనే ఎక్కువగా శ్రద్ధ పెడుతుంటారు.

విషయాలు దాచడం: మోసం చేసే భాగస్వాములు ఎప్పుడూ ఏదో ఒకటి దాస్తూ ఉంటారు. వారు తమ క్రెడిట్ కార్డ్ బిల్లులు, డేటింగ్ సైట్‌లు లేదా ఇంకా వారు వెళ్లే ప్రాంతాల గురించి దాచడానికి ప్రయత్నిస్తుంటారు. విషయాలు దాచడంతోపాటు తరచూ అబద్ధాలు చెబుతుంటారు.

ఆచరణలో మార్పు: ఏదైనా జరుగుతున్నా.. లేకపోతే.. ఏదైనా పని ఉన్నా.. వారి ప్రవర్తనలో తరచూ చాలా మార్పును చూడవచ్చు. అతను ప్రశాంతంగా ఉంటే, అతను సంతోషంగా ఉంటారు.. లేదా అకస్మాత్తుగా చాలా కోపంగా మారుతారు.





























