- Telugu News Photo Gallery Do not make these mistakes while using condom before being intimate with your partner
Condom Uses: బీకేర్‌ఫుల్.. కండోమ్ వాడేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..!
Condom Tips: ఈ రోజుల్లో పెరుగుతున్న జనాభాకు ముఖ్య కారణం సెక్స్ కు సంబంధించిన ముఖ్య సమాచారం తెలియకపోవడమే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో అవసరం లేకపోయినప్పటికీ.. గర్భధారణ కేసులు నిత్యం పెరుగుతున్నాయి.
Updated on: Jul 05, 2023 | 4:42 PM

Condom Tips: ఈ రోజుల్లో పెరుగుతున్న జనాభాకు ముఖ్య కారణం సెక్స్ కు సంబంధించిన ముఖ్య సమాచారం తెలియకపోవడమే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో అవసరం లేకపోయినప్పటికీ.. గర్భం దాల్చే కేసులు నిత్యం పెరుగుతున్నాయి. దీనినే అవాంఛిత గర్భధారణ అంటారు. ముఖ్యంగా లైంగిక, సంతానానికి సంబంధించిన అవగాహన లేకపోవడమే కారణమని పేర్కొంటున్నారు. సెక్స్‌లో పాల్గొనే ముందు యువతీ, యువకులు కొన్ని విషయాలు తెలుసుకోవడం అవసరం. గర్భం దాల్చుకుండా ఉండాలంటే కండోమ్ ఉపయోగించడం మంచిదని పేర్కొంటున్నారు.

కండోమ్ ఉపయోగించడం మిమ్మల్ని సురక్షితంగా అలాగే ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. చాలా మంది ఇబ్బందితో కండోమ్ వాడకానికి దూరంగా ఉంటారు. అయితే, అవాంఛిత గర్భాలను నివారించడానికి కొన్ని సెఫ్టీ మెథడ్స్ ఉపయోగించడం మంచిది.

జాగ్రత్తలు ఉపయోగించకపోవడం వల్ల జనాభా పెరిగే అవకాశం ఉంది. కానీ కండోమ్‌ల వాడకం వల్ల గర్భధారణ జరగదని కూడా చెప్పలేం. అయితే, గర్భనిరోధకం (కండోమ్) ఉపయోగించే ముందు.. దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం మంచిది.

ముందుగా నిరోద్ జాగ్రత్తగా ధరించాలి. శృంగార హడావిడిలో కండోమ్ ను సరిగ్గా ధరించకపోతే, గర్భం దాల్చే అవకాశం ఉంది. ఇంకా మంచి నాణ్యమైన కండోమ్‌ను ఉపయోగించడం వల్ల STDలు, AIDS ప్రమాదాల నుంచి రక్షించుకోవచ్చు.

కండోమ్‌లను తిరిగి ఉపయోగించడం లేదా కడిగి మళ్లీ ఉపయోగించడం ద్వారా గర్భం దాల్చే అవకాశం పెరుగుతుంది. అయితే, అవాంఛిత గర్భాలను నివారించడానికి కండోమ్‌లను క్రమం తప్పకుండా వాడండి. ఇంకా వీటిని ఎక్కువ కాలం ఉపయోగించవద్దు. అంతేకాకుండా నాణ్యత, కండోమ్ గడువు తేదీని తనిఖీ చేయడం మరువకండి..





























