AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమగా మారిన జైలులో పుట్టిన స్నేహం.. పెరోల్‌పై ఓ ఇంటివారైన ఖైదీలు..

West Bengal: ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు. స్నేహం నుంచి అయినా, చిరునవ్వుతో అయినా, గొడవలతో అయినా ప్రేమ చిగురించవచ్చు. అలాంటి ప్రేమ జైలులో ఒకరినొకరు కలిసి స్నేహితులైన ఓ ఇద్దరు ఖైదీలను..

ప్రేమగా మారిన జైలులో పుట్టిన స్నేహం.. పెరోల్‌పై ఓ ఇంటివారైన ఖైదీలు..
Abdul Hasim and Shahnara Khatun
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jul 16, 2023 | 9:05 PM

Share

West Bengal: ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు. స్నేహం నుంచి అయినా, చిరునవ్వుతో అయినా, గొడవలతో అయినా ప్రేమ చిగురించవచ్చు. అలాంటి ప్రేమ జైలులో ఒకరినొకరు కలిసి స్నేహితులైన ఓ ఇద్దరు ఖైదీలను ఒక్కటి చేసింది. అంతే.. 5 రోజుల పెరోల్ తీసుకుని మరీ ఒక్కటయ్యింది ఆ ఖైదీ జంట. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఈ ప్రేమ పెళ్లితో ఒక్కటైన అబ్దుల్ హసీమ్( అస్సాం), షహ్నారా ఖాతున్(పశ్చిమ బెంగాల్) వేర్వేరు హత్య కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్ సెంట్రల్ కరెక్షనల్ హోమ్‌లో ఖైదు అయ్యే వరకు ఒకరికి మరొకరు తెలియదు. అయితే ఆ జైలే వేదికగా వారి మధ్య చిగురించిన స్నేహం.. అనతి కాలంలోనే అది ప్రేమగా మారింది. ఇద్దరూ తమ తమ కుటుంబాలకు కూడా విషయం చెప్పి ఒప్పించడంతో అడ్డంకులు లేకుండా ఒక్కటి అయ్యేందుకు మార్గం సుగమం అయ్యింది.

దీంతో 5 రోజుల పెరోల్ తీసుకుని తూర్పు బర్ధమాన్‌లోని మాంటేశ్వర బ్లాక్‌లోని కుసుమ్‌గ్రామ్‌లో బుధవారం ముస్లిం సంప్రదాయాల ప్రకారం ఒక ఇంటివారయ్యారు. కాగా, వేర్వేరు హత్య కేసుల్లో అబ్దుల్ హసీమ్ 8 ఏళ్లు, షహ్నారా ఖాతున్ 6 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది