Telangana: తొలి విడత కౌన్సిలింగ్‌లో 70 వేల ఇంజనీరింగ్ సీట్ల భర్తీ.. ఆ కాలేజీల్లో 100 శాతం కేటాయింపు.. పూర్తి వివరాలివే..

TS Engineering Seats: తెలంగాణలో ఆదివారం ప్రారంభమైన ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. తొలి విడత కౌన్సిలింగ్లో 70 వేల 665 సీట్లను ఇంజనీరింగ్ విభాగంలో భర్తీ చేశారు. మరో 12 వేల 1 సీట్లు ఖాళీగా ఉన్నాయి. తొలి విడత కౌన్సిలింగ్ లో సీట్లు పొందిన విద్యార్థులు జులై 22 లోపు కాలేజీల్లో..

Telangana: తొలి విడత కౌన్సిలింగ్‌లో 70 వేల ఇంజనీరింగ్ సీట్ల భర్తీ.. ఆ కాలేజీల్లో 100 శాతం కేటాయింపు.. పూర్తి వివరాలివే..
Telangana Engineering Seats Allotment
Follow us
Vidyasagar Gunti

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Jul 16, 2023 | 2:53 PM

TS Engineering Seats: తెలంగాణలో ఆదివారం ప్రారంభమైన ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. తొలి విడత కౌన్సిలింగ్లో 70,665 సీట్లను ఇంజనీరింగ్ విభాగంలో భర్తీ చేశారు. మరో 12 వేల 1 సీట్లు ఖాళీగా ఉన్నాయి. తొలి విడత కౌన్సిలింగ్ లో సీట్లు పొందిన విద్యార్థులు జులై 22 లోపు కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ఎంసెట్ కన్వీనర్ తెలిపారు. కోర్సుల వారీగా ఫస్ట్ పేజ్ లో CSE లో అత్యధికంగా 94.2 శాతం , EEE లో 58.38 శాతం , సివిల్ ఇంజనీరింగ్ లో 44.76 శాతం , మెకానికల్ ఇంజనీరింగ్ లో 38.5% సీట్లు భర్తీ అయ్యాయి.

మూడు యూనివర్సిటీల్లో, 28 ప్రైవేటు కాలేజీలో 100 శాతం సీట్లు తొలి విడతలోనే భర్తీ అయ్యాయి. వెబ్ ఆప్షన్ల గడువు 12న ముగియగా ఆదివారం తొలి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ జరిపారు . ఈనెల 24వ తేదీ నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ఉంటుంది ఆ తర్వాత ఆగస్టు నాలుగున చివరి విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి పేర్కొంది.రాష్ట్రంలో కొత్తగా 14,565 ఇంజనీరింగ్ సీట్లకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే.రాష్ట్రంలో మొత్తం ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య లక్షా 671కి చేరింది.

సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్ సంబంధించి ఆన్లైన్ ఫైలింగ్ బేసిక్ ఈనెల 24 నుంచి 25వ తేదీ వరకు జరగనుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ జూలై 26వ తేదీన జరగనుంది. జూలై 27వ తేదీన ఆప్షన్స్ ను విద్యార్థులు ఫ్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. 31వ తేదీన సెకెండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ జరుపనున్నారు. ఆగస్టు 2 వరకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్లు పొందిన వాళ్లు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని ఎంసెట్ కన్వీనర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

తుది విడత కౌన్సిలింగ్ సంబంధించి ఆగస్టు 4న ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆగస్టు 5వ తేదీన సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభం అవుతుంది. 6న విద్యార్థులు సీట్లు ఎంచుకోవాల్సి ఉంటుంది. తొమ్మిదో తేదీన ఫైనల్ గా సీట్ల కేటాయింపు ఉంటుంది. తుది విడత కౌన్సిలింగ్లో సీట్లు పొందినవారు ఆగస్టు 11 వరకు కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..