Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: జగన్ సర్కార్ అనూహ్య నిర్ణయం.. దశాబ్ధాల నుంచి వారికి దక్కని హక్కుని అందజేస్తూ..

Andhra Pradesh: జగన్ ప్రభుత్వం ఎవ్వరూ ఊహించని డెసిషన్ తీసుకుంది. తొమ్మిది నెలల్లో ఎన్నికలకు వెలుతున్న తరుణంలో తన బలాన్ని మరింత పుంజుకునేందుకు ఒక్కో అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఇప్పుడు రాజకీయంగా తిరుగులేని మైలేజీ ఇచ్చే మరో సంచలన నిర్ణయం..

Andhra Pradesh: జగన్ సర్కార్ అనూహ్య నిర్ణయం.. దశాబ్ధాల నుంచి వారికి దక్కని హక్కుని అందజేస్తూ..
Ys Jagan
Follow us
S Haseena

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Jul 15, 2023 | 2:09 PM

Andhra Pradesh: జగన్ ప్రభుత్వం ఎవ్వరూ ఊహించని డెసిషన్ తీసుకుంది. తొమ్మిది నెలల్లో ఎన్నికలకు వెలుతున్న తరుణంలో తన బలాన్ని మరింత పుంజుకునేందుకు ఒక్కో అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఇప్పుడు రాజకీయంగా తిరుగులేని మైలేజీ ఇచ్చే మరో సంచలన నిర్ణయం జగన్ తీసుకున్నారు. దశాబ్ధాల నుంచి దళితులకు దక్కని హక్కుని ఇప్పుడు సీఎం జగన్ కలిగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని నిరుపేదలకు భూపంపిణీకి అవసరమైన కీలక నిర్ణయాలను కేబినెట్‌లో తీసుకుంది.

వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరగడమే తప్పా అప్పటి నుండి ఇప్పటి వరకు భూ పంపిణీ ఎవ్వరూ చేయలేదు. ఇప్పుడు సీఎం జగన్ మళ్లీ ఆ భూ పంపిణీ చేయనున్నారు. అనేక దశాబ్ధాలు ఆ భూములను సాగుచేస్తున్నా, ఆ భూములను నమ్ముకుని బ్రతుకుతున్నా, ఆ భూములపై మాకు హక్కు కల్పించాలని రాష్ట్రవ్యాప్తంగా 54,129.45 ఎకరాలను పేద రైతులకు అసైన్‌ చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 46,935 మంది లబ్ధిదారులకు భూములు ఇవ్వనుంది.

లంక భూములపై హక్కులు

కృష్నా గోదావరి నదీ పరివాహక దళిత, పేద రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. లంకల్లో ఎన్నో దశాబ్ధాలుగా ఆ భూములను నమ్ముకుని, సాగుచేసుకుని బ్రతికే రైతులకు ఎట్టకేలకు ఆ భూములపై హక్కు దక్కనుంది. గతంలో ఎన్ని ప్రభుత్వాలు, ఎంత మంది ముఖ్యమంత్రుల దగ్గరకు లంక భూముల రైతులు ధరఖాస్తులు పెట్టుకున్నా ఈ సమస్యకు పరిష్కారం దక్కలేదు. కానీ సీఎం జగన్ మాత్రం భూమిలేని నిరుపేదలకు లంక భూములు ఇచ్చేయాలని నిర్ణయించారు. మూడు కేటగిరీల్లో 9,062 ఎకరాల లంక భూములు విషయంలో రైతన్నలకు అనుకూలంగా అసైన్‌మెంట్‌ పట్టాలు, ఐదేళ్ల లీజు ఇవ్వడానికి జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. 19,176 మంది రైతులకు మేలు జరుగుతోంది. ఓవైపు అసైన్డ్ భూములు, మరో వైపు లంక భూములు రెండు కలిపితే 63,191.84 ఎకరాలు అసైన్డ్‌ ల్యాండ్స్‌ నిరుపేదలకు దక్కనుంది. ఈ భూ పంపిణీ వలన రాష్ట్రంలోని 66,111 మందికి రైతులకు హక్కులు దక్కనున్నాయి.

ఇవి కూడా చదవండి

దళిత రైతుల కోసం సీఎం జగన్ మరో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజనకు ముందు ల్యాండ్‌ పర్చేజ్‌ స్కీమ్ కింద గతంలో 16,213 ఎకరాలు పొందిన దళిత ప్రజలకు ఇది సానుకూలంగా తీసుకున్న నిర్ణయం. 14,223 మందికి గతంలో భూములు, వారు కట్టాల్సిన రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు కూడా కూడా మాఫీ చేసింది. ఫలితంగా దాదాపు రూ.2000 కోట్ల విలువైన భూములపై వారికి పూర్తి హక్కులు దక్కనున్నాయి. ఆగస్టు నెల తొలి వారంలోనే దళితులకు హక్కు పత్రాలు పంపిణీకి కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అసైన్డ్‌ చేసిన డీకేటీ రైతులకు కేబినెట్‌ మరో తీపికబురు చెప్పింది. అసైన్‌మెంట్‌ అయిన ఇరవై ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు అనుభవించేలా తీసుకున్న నిర్ణయానికి జగన్ ప్రభుత్వంలోని మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

ఇతర రైతుల మాదిరిగానే వారికి క్రయ, విక్రయాలపైన పూర్తి హక్కులు దక్కనున్నాయి. ఒరిజనల్‌ అస్సైనీలకు వారి లీగల్‌ హీర్స్‌కు మాత్రమే ఇది వర్తిస్తుంది. దాదాపు 22 లక్షలమంది బడుగు, బలహీనవర్గాల వారికి ప్రయోజనం కలగనుంది. జగన్ తీసుకున్న ఈ సెన్సేషనల్ డెసిషన్ దళితుల భూములను, అసైన్డ్ భూములను కబ్జా చేసే వారికి మాత్రం బిగ్ షాక్ అనే చెప్పాలి. బలవంతంగానో, లేదా దళితుల అవసరాలను ఆసరాగా చేసుకుని చాలా కాలంగా దళితుల భూములను, అసైన్డ్ భూములను తమ గుప్పెట్లో పెట్టుకున్న బడా నేతలు, కబ్జాదారులకు మాత్రం జగన్ ధమ్కీ ఇచ్చినట్టే. ఇప్పుడు ఎవరైతే అసైన్డ్ దారులు, లేదా వాళ్ల లీగల్ వారసులుంటారో వారికే ఈ పట్టాలు, హక్కులు అందించనున్నారు. దీంతో కబ్జాకోరుల బాగోతం కూడా బయటపడనుంది. దళితులకు ఇదో పెద్ద బలం కానుంది. వాళ్ల భూములు లాక్కున్న పెద్దల ఆటలు ఇక సాగవు. ఇప్పుడు ఆ భూములు వేరే వాళ్లకి కావాలంటే దళితుల నుండి మళ్లీ కొనుక్కోవాల్సిందే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..