Visakhapatnam: మార్చురీలో మృతదేహాలు తారుమారు.. ఖననం చేశాక అసలు విషయం తెలిసి అంతా షాక్..!

Anakapalli District News: అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యనికి పరాకాష్ట ఈ ఘటన. రెండు వేరువేరు మృతదేహాలు తారుమారు చేశారు సిబ్బంది. ఒకరి మృతదేహాన్ని మరొకరి బంధువులకు అప్పగించేశారు. ఓ మృతదేహం తీసుకెళ్లిన ఓ బాధిత కుటుంబం....

Visakhapatnam: మార్చురీలో మృతదేహాలు తారుమారు.. ఖననం చేశాక అసలు విషయం తెలిసి అంతా షాక్..!
Representative Image; Srinu (inset)
Follow us
Maqdood Husain Khaja

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Jul 15, 2023 | 8:48 AM

Anakapalle District News: అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యనికి పరాకాష్ట ఈ ఘటన. రెండు వేరువేరు మృతదేహాలు తారుమారు చేశారు సిబ్బంది. ఒకరి మృతదేహాన్ని మరొకరి బంధువులకు అప్పగించేశారు. ఓ మృతదేహం తీసుకెళ్లిన ఓ బాధిత కుటుంబం.. అంత్యక్రియలు కూడా నిర్వహించింది. మరో డెడ్ బాడీ కేసులో పోలీసులు వచ్చి చూసేసరికి ఆ డెడ్ బాడీ కనిపించకుండా పోయింది. దీంతో మృతదేహాలు తారు మారైనట్టు వెలుగులోకి వచ్చింది. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తోటాడకు చెందిన 55 ఏళ్ల శ్రీను. గత కొన్నేళ్లుగా కుటుంబం కి దూరంగా ఉంటున్నాడు. ఎక్కడున్నాడో ఏమయ్యాడో తెలియక కుటుంబం కూడా. శ్రీనుకు దూరంగా నే ఉంది. అయితే ఈనెల 10వ తేదీన అనకాపల్లిలో తీవ్ర అనారోగ్యానికి గురైన శ్రీనును స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. గుర్తుతెలియని వ్యక్తిగా 108 లో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 12న మరణించాడు. బంధువులు ఎవరో తెలియక మార్చురీలో మృతదేహాన్ని భద్రపరిచారు ఆసుపత్రి సిబ్బంది.

మరోవైపు సబ్బవరంలో ఈ నెల 11న అసకపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ దుర్ఘటనలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో వీఆర్వో సమాచారంతో పోలీసులు స్వాధీనం చేసుకుని.. ఆ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం మార్చురీ కి తీసుకెళ్లారు. ఇక అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని శ్రీను గా తెలుసుని వాళ్ల బంధువులు ఆసుపత్రి వర్గాలను సంప్రదించారు. అయితే ఆ మృతదేహం మార్చురీలో ఉందని చెప్పి.. గుర్తుపట్టేందుకు పంపారు. శ్రీను ఇంటి నుంచి వెళ్ళిపోయి చాలా ఏళ్లు గడవడంతో ఓ మృతదేహాన్ని చూసి తమదేనని మార్చురీ సిబ్బందికి చెప్పారు. దీంతో మృతదేహాన్ని అప్పగించేశారు.

మార్చురీలో వెతికిన పోలీసులు.. అసలు విషయం తెలిసి..

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుర్తుతెలియని వ్యక్తి పంచనామా కోసం సబ్బవరం పోలీసులు.. మార్చురీకి వెళ్లారు. దీంతో లోపల ఎంత వెతికినా మృతదేహం కనిపించలేదు. చివరికి మార్చురీ సిబ్బందిని ప్రశ్నించారు. దీంతో మార్చురీ సిబ్బంది.. ‘ఇదేనండి ఆ డెడ్ బాడీ’ అని చూపారు. అది ఆ కేస్ కాదయ్యా.. అని చెప్పేసరికి అందరూ నోరెళ్ల పెట్టారు. మరి యాక్సిడెంట్ కేసులో ఉన్న డెడ్ బాడీ ఎక్కడ అని వెరిఫై చేసేసరికి.. శ్రీను కు చెందిన బంధువులకు అప్పగించిందేనని గుర్తించారు. ఆరాతీసేసరికి.. అప్పటికే మృతదేహాన్ని ఖననం చేసినట్టు తెలుసుకున్న పోలీసులకు మరో షాక్ తగిలినట్టుంది.

ఇవి కూడా చదవండి

అనంతరం విషయాన్ని ఆసుపత్రి సూపరిండెంట్ దృష్టికి తీసుకెళ్లారు పోలీసులు. అయితే జరిగిన పొరపాటును ఆలస్యంగా గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది.. తలలు పట్టుకున్నారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు ఆసుపత్రి సూపర్డెంట్ శ్రవణ్ కుమార్. ఇది తెలుసుకున్న శ్రీను బంధువులు కూడా అవాక్కయ్యారు. మృతదేహాలు తారుమారు కావడంతో ఇక రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు పోలీసులు ఆసుపత్రి అధికారులు. ప్రొసీజర్ ప్రకారం.. మళ్లీ మృతదేహాలను అప్పగించే ఏర్పాటు చేస్తున్నారు. అయితే శివ మృతదేహం అనుకొని అతని కుటుంబ సభ్యులు ఇప్పటికే ఖననం చేసిన.. యాక్సిడెంట్ కేసు డెడ్ బాడీని స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమయ్యారు.

నిర్లక్ష్యానికి పరాకాష్ట..!

వాస్తవానికి ఏవైనా మృతదేహాలు మార్చురీ వరకు తీసుకొస్తే.. వాటిని జాగ్రత్తగా భద్రపరచాల్సి ఉంటుంది. మృతదేహాలకు ప్రత్యేకంగా ట్యాగ్ కూడా వేస్తారు. కానీ ఈ రెండు మృతదేహాలకు కూడా కనీసం గుర్తింపు ఆనవాళ్లు కూడా పెట్టలేదు. ఎంతలా అంటే.. బంధువులు వచ్చి ఆ మృతదేహం తమదే అని చెప్పేసరికి చెక్ చేసుకోకుండా.. ముందు వెనుక ఆలోచించకుండా సంతకాలు తీసుకుని ఇచ్చేశారు. బంధువులు గుర్తుపట్టినప్పటికీ.. ఆసుపత్రి సిబ్బంది గాని పోలీసులు గాని ఒకటికి రెండు మూడు సార్లు చెక్ చేసుకుని.. నిర్ధారించుకున్న తర్వాతే డెడ్ బాడీలను అప్పగించాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. మార్చురీ పర్యవేక్షక అధికారి కూడా కనీసం అటువైపు కన్నెతైనా చూడలేదు. మరి ఈ ఘటనలో ఎవరి నిర్లక్ష్యం ఎంత అనేదానిపై విచారణ జరగాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..