Andhra Pradesh: వీలైతే ఆగస్ట్.. లేకుంటే సెప్టెంబర్.. విశాఖకు జగన్ రావడం మాత్రం పక్కా..
TTD chairman YV Subba Reddy: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. విశాఖపట్నం వెళ్లేందుకు రెడీ అయ్యారు. దీనికోసం ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సీఎం క్యాంప్ ఆఫీస్.. సహా ఇంటి నిర్మాణం కూడా పూర్తవుతోంది..
TTD chairman YV Subba Reddy: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. విశాఖపట్నం వెళ్లేందుకు రెడీ అయ్యారు. దీనికోసం ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సీఎం క్యాంప్ ఆఫీస్.. సహా ఇంటి నిర్మాణం కూడా పూర్తవుతోంది.. ఈ దసరా కన్నా ముందే విశాఖకు సీఎం జగన్ రాబోతున్నారని.. టీవీ9 ముందే చెప్పింది. అలాగే.. రుషికొండ సమీపంలో ఇంటి నిర్మాణం కూడా జరుగుతోందని చెప్పింది.. సీఎంవోతో పాటు సీఎం ఇల్లు కూడా పక్కపక్కనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారని.. ఇదే ఫుల్ అండ్ ఫైనల్ అంటూ కూడా టీవీ9 వివరించింది.
ఆ వార్తలకు బలం చేకూరుస్తూ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. జీవీఎంసీ కార్పొరేటర్లతో భేటీ అయిన వైవీ సుబ్బారెడ్డి త్వరలోనే విశాఖకు సీఎం క్యాంప్ ఆఫీస్ షిఫ్ట్ అవుతున్నట్లు పేర్కొన్నారు. వీలైతే ఆగస్ట్, లేదంటే సెప్టెంబర్‌లో వస్తారు.. రాజధానిపై వివరణ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి.. న్యాయపరమైన అడ్డంకుల వల్లే కాస్త ఆలస్యం జరుగుతుందంటూ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
వాలంటీర్లను తప్పుబడితే ప్రతిపక్షాలకు పుట్టగతులుండవంటూ ఫైర్ అయ్యారు. అనవసర కామెంట్లు చేస్తున్నారని.. ప్రతిపక్షాల ఆరోపణలపై చర్చకు మేం సిద్ధమని.. వైవీ సుబ్బారెడ్డి సవాల్ చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..