Minister Roja: పవన్ కల్యాణ్‌కు ఫ్యాన్స్ ఉంటే జగన్‌కు సోల్జర్స్ ఉన్నారు.. మంత్రి రోజా షాకింగ్ కామెంట్స్
ఏపీ పర్యాటక శాఖామంత్రి రోజా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామంలో పర్యటించిన ఆమె పవన్‌పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్ తీరు చూస్తే మెంటల్ హాస్పిటల్ లో కరెంట్ షాక్ ఇస్తుంటే మధ్యలో పారిపోయి వచ్చిన వ్యక్తి లా పిచ్చిగా పిచ్చిగా ఊగుతూ, అరుస్తూ ఏది పడితే..
ఏపీ పర్యాటక శాఖామంత్రి రోజా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామంలో పర్యటించిన ఆమె పవన్‌పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్ తీరు చూస్తే మెంటల్ హాస్పిటల్ లో కరెంట్ షాక్ ఇస్తుంటే మధ్యలో పారిపోయి వచ్చిన వ్యక్తి లా పిచ్చిగా పిచ్చిగా ఊగుతూ, అరుస్తూ ఏది పడితే అది మాట్లాడుతూన్నాడంటూ ధ్వజమెత్తారు. ‘విప్లవకారుడు ఎలా ఉంటాడో పవన్ కళ్యాణ్ ఆలోచించాలి. రోషం పౌరుషంగా ఉంటాడు పవన్ కళ్యాణ్ లాగా సిగ్గు షెరం లేకుండా ప్యాకేజి కోసం పని చేయడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ప్రజలు కూడా ఆడుకునే రోజులు దగ్గరలో ఉన్నాయి. పవన్ తీరు మెంటల్ హాస్పిటల్ లో నుండి వచ్చిన విధంగా ఉంది. పవన్ కళ్యాణ్ నీకు ఫ్యాన్స్ ఉన్నారేమో మాకు సోల్జల్స్ ఉన్నారు. జగన్ సైన్యాన్ని చిటికెన వెలుతే పొలుస్తావా? వార్డు మెంబర్ కూడా గెలవలేని నీవు మాట్లాడుతావా? నీకు పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు లేరు. పవన్ ఇది షూటింగ్ కాదు రియాల్టీ’ అని తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు రోజా.
ఇక ముచ్చుమర్రి గ్రామంలో రూ. 2.38 కోట్లతో ఇండోర్ స్టేడియంలు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు రోజా. ‘నెల పాటు జగనన్న క్రీడా సంబరాలు చేసి యువతను ప్రోత్సహించాం. క్రీడా రంగంలో సీఎం గారు ఎన్నో మార్పులు తెచ్చేరు…ఆడుదాం ఆంధ్ర పేరుతో సచివాలయంలో పరిధిలో క్రీడలు నిర్వహిస్తున్నాం. సీఎం జగన్ గారి ప్రతిపక్ష లతో ఆడుకునే రోజులు త్వరలో ఉన్నాయి. జగనన్న సురక్ష ద్వారా ప్రజలకు ఎన్నో సర్టిఫికెట్ లు అందజేస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు రోజా
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..