Faria Abdullah: ఓటీటీలో మరో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌ సిరీస్‌.. చిట్టి ‘ది జెంగాబురు క‌ర్స్’ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

చిట్టీ ఇప్పుడు ఓటీటీల్లోకి అడుగుపెట్టనుంది. అది కూడా ఓ బాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌తో. ఫరియా అబ్ధుల్లా నటించిన లేటెస్ట్‌ వెబ్ సిరీస్‌ 'ది జెంగాబురు క‌ర్స్'. అక్రమ మైనింగ్‌ వ్యాపారం వల్ల ఆదివాసీలు ఎలా సతమతమవుతున్నారో అన్నది స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు నీల మాధ‌బ్ పాండ ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.

Faria Abdullah: ఓటీటీలో మరో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌ సిరీస్‌.. చిట్టి 'ది జెంగాబురు క‌ర్స్' స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
The Jengaburu Curse Web Series
Follow us
Basha Shek

|

Updated on: Jul 14, 2023 | 4:49 PM

జాతిరత్నాలు సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది ఫరియా అబ్ధుల్లా. ఇందులో తను పోషించిన చిట్టి పాత్ర ఎంత హైలెట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆతర్వాత మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌, బంగర్రాజు, లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్‌, రావణాసుర తదితర సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా చేరువైంది. కాగా చిట్టీ ఇప్పుడు ఓటీటీల్లోకి అడుగుపెట్టనుంది. అది కూడా ఓ బాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌తో. ఫరియా అబ్ధుల్లా నటించిన లేటెస్ట్‌ వెబ్ సిరీస్‌ ‘ది జెంగాబురు క‌ర్స్’. అక్రమ మైనింగ్‌ వ్యాపారం వల్ల ఆదివాసీలు ఎలా సతమతమవుతున్నారో అన్నది స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు నీల మాధ‌బ్ పాండ ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఇటీవలే ది జెంగాబురు కర్స్‌ ట్రైలర్‌ కూడా రిలీజైంది. అక్రమ మైనింగ్‌ వ్యాపారాలు, అనుమానాస్పద హత్యలు, తండ్రిని వెతుక్కుంటూ ఫరియా అక్కడికి రావడం. .ఇలా ఇంట్రెస్టింగ్‌ అంశాలతో ట్రైలర్‌ను కట్‌ చేశారు. ఈక్రమంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సోనీ లివ్‌లో ఆగ‌స్ట్ 9 నుంచి ది జేగాంబురు కర్స్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది.

ది జెంగాబురు క‌ర్స్ సిరీస్‌లో ఫరియాతో పాటు నాజ‌ర్, మ‌క‌రంద్ దేశ్‌పాండే తదితరులు కీలక పాత్రలు పోషించారు. హిందీతో సహా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. కాగా భారతదేశంలోనే ఫ‌స్ట్ క్లి -ఫై (క్లైమేట్ ఛేంజ్ కాన్సెప్ట్‌) వెబ్‌సిరీస్ తమదేనంటూ ది జెంగాబురు కర్స్ యూనిట్ ప్ర‌క‌టించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.